
మేకప్ లేకుండా బయటకు వచ్చిన బ్యూటీ!
ఇంటర్నెట్ బ్యూటీ ఐకాన్, సెల్ఫీ క్వీన్ గా పేరొందిన కిమ్ కర్దాషియన్ ఇటీవల తన అభిమానులకు స్వీట్ షాకిచ్చింది. శుక్రవారం ఆమె షేర్ చేసిన స్నాప్‌చాట్ వీడియోలో మేకప్ లేకుండా సహజంగా దర్శనమిచ్చింది. మేకప్ లేకుండా ఇదిగో నేను ఇలా ఉంటానంటూ ఈ 35 ఏళ్ల బ్యూటీ ఈ వీడియోలో కనిపించింది. కారులో తీసిన కిమ్ అభిమానుల్ని బాగానే అలరిస్తోంది.
ఇటీవల 'బ్రేక్ ద ఇంటర్నెట్ అవార్డు' గెలుచుకున్న ఈ అమ్మడు.. చనిపోయేవరకు తన 'న్యూడ్ (నగ్న) సెల్ఫీలు' సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రకటించింది. నిత్యం సోషల్ మీడియా దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి అనేక జిమ్మిక్కులు చేసే కిమ్ ఆ మధ్య తన న్యూడ్ సెల్ఫీ పోస్టు చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే.