nude selfies
-
మేకప్ లేకుండా బయటకు వచ్చిన బ్యూటీ!
ఇంటర్నెట్ బ్యూటీ ఐకాన్, సెల్ఫీ క్వీన్ గా పేరొందిన కిమ్ కర్దాషియన్ ఇటీవల తన అభిమానులకు స్వీట్ షాకిచ్చింది. శుక్రవారం ఆమె షేర్ చేసిన స్నాప్‌చాట్ వీడియోలో మేకప్ లేకుండా సహజంగా దర్శనమిచ్చింది. మేకప్ లేకుండా ఇదిగో నేను ఇలా ఉంటానంటూ ఈ 35 ఏళ్ల బ్యూటీ ఈ వీడియోలో కనిపించింది. కారులో తీసిన కిమ్ అభిమానుల్ని బాగానే అలరిస్తోంది. ఇటీవల 'బ్రేక్ ద ఇంటర్నెట్ అవార్డు' గెలుచుకున్న ఈ అమ్మడు.. చనిపోయేవరకు తన 'న్యూడ్ (నగ్న) సెల్ఫీలు' సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రకటించింది. నిత్యం సోషల్ మీడియా దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి అనేక జిమ్మిక్కులు చేసే కిమ్ ఆ మధ్య తన న్యూడ్ సెల్ఫీ పోస్టు చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
చచ్చేవరకూ న్యూడ్ సెల్ఫీలు పోస్టు చేస్తా!
లాస్ ఏంజిల్స్: సెల్ఫీ క్వీన్, హాలీవుడ్ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ తాజాగా అభిమానులకు చిలిపి వరాన్ని ప్రసాదించింది. తాను చనిపోయేవరకు 'న్యూడ్ (నగ్న) సెల్ఫీలు' దిగుతూ.. వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటానని తాజాగా హామీ ఇచ్చింది. 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మను తాజాగా 'బ్రేక్ ద ఇంటర్నెట్ అవార్డు' వరించింది. 20వ వార్షిక వెబ్బీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మొట్టమొదటిసారిగా ప్రకటించిన ఈ అవార్డును కిమ్ కర్దాషియన్‌కు ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. తన జీవితాంత నగ్న సెల్ఫీలు దిగి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని తెలిపింది. నగ్నంగా సెల్ఫీలు దిగడం ఈ భామకు కొత్తకాదు. గత ఏడాది తన నగ్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టుచేసి.. కిమ్ పెద్ద దమారమే రేపింది. ఆమె చర్యను పలువురు తప్పుబట్టగా.. మరికొందరు హాలీవుడ్ సినీ స్టార్లు మాత్రం కిమ్ దారిలో సాగుతూ.. తమ న్యూడ్ సెల్ఫీలను అభిమానులతో పంచుకున్నారు.