
లండన్ : నచ్చిన నటీనటులు లాగా తాము కూడా మారాలని.. వారి మాదిరి స్టైల్‌గా ఆకట్టుకునేలా తయారవ్వాలని కొందరు అభిమానులు తాపత్రయం పడుతుంటారు. దీని కోసం కొందరు ఫుల్‌గా వర్క్‌వుట్లు చేస్తూ ఉంటే.. మరికొందరు సులుమైన మార్గాల్లో ఏకంగా సర్జరీలే చేయించుకొని ప్రాణాలపైకి తెచ్చుకుంటారు.
తాజాగా ఇంగ్లండ్‌కు చెందిన ఓ మహిళ.. అమెరికన్ రియాల్టీ టెలివిజన్ పర్సనాలిటీ కిమ్ కర్దాషియాన్‌లాగా సెక్సీగా మారాలనుకుంది. దానికోసం టర్కీ లోని ఓ కాస్మోటిక్ క్లినిక్‌ను సంప్రదించింది. నాలుగు రోజులు పాటు శస్త్ర చికిత్స చేసి, మూడు లక్షల బిల్ చేతిలో పెట్టారు. అంతేకాక ఈ శస్త్ర చికిత్స అనంతరం ఏడు రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. కానీ ఆ జాగ్రత్తలన్నింటిన్నీ ఆమె పెడచెవిన పెట్టింది. శస్త్ర చికిత్స అయిన వెంటనే తాను కూడా కిమ్ కర్దాషియాన్‌లాగా మారాననే ఆనందంలో రెండు రోజులకే ఇంగ్లండ్‌కు పయనమైంది. డాక్టర్ల సూచనలు పట్టించుకోని ఆమెకు, ఈ శస్త్రచికిత్సే ప్రాణాల మీదకు తెచ్చింది. ఒక్కసారిగా ఇన్ఫెక్షన్‌కు గురై కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. హుటా హుటిన ఆస్సత్రికి తీసుకెళితే పరీక్షలు చేసిన ఇంగ్లండ్ వైద్యులు ఆమె చేయించుకున్న ఆపరేషన్ వికటించిందని, కిడ్నీలు చెడిపోయాయని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment