'ఆమె ఓ సీక్రెట్ ఏజెంట్.. మేం వదలం' | Kim Kardashian is a secret agent for Instagram, says Iranian moral policing group | Sakshi
Sakshi News home page

'ఆమె ఓ సీక్రెట్ ఏజెంట్.. మేం వదలం'

Published Tue, May 17 2016 6:16 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

'ఆమె ఓ సీక్రెట్ ఏజెంట్.. మేం వదలం'

'ఆమె ఓ సీక్రెట్ ఏజెంట్.. మేం వదలం'

లాస్ ఎంజెల్స్: ప్రముఖ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియాన్ సామాజిక అనుసంధాన వేధిక ఇన్స్టాగ్రామ్ సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తుందని ఇరాన్కు చెందిన నైతిక విలువల సంస్థ ఒకటి ఆరోపించింది. ఇస్లాం మతాన్ని దెబ్బతీసేలా యువకులను ఆకట్టుకునేందుకు ఆమె పలు అసభ్యకరమైన ఫొటోలను అందులో పెడుతోందంటూ ఆ సంస్థ మండిపడింది. ఈ వ్యవహారాన్ని తాము అంత తేలికగా తీసుకోవాలని అనుకోవడం లేదని కూడా స్పష్టం చేసింది.

ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ కు చెందిన ది ఆర్గనైజడ్ సైబర్ స్పేస్ క్రైమ్స్ విభాగం ఈ మేరకు వివరాలు తెలియజేస్తూ ఒక అజెండాలో భాగంగానే కిమ్ కార్దర్షియాన్ ఇన్ స్టాగ్రామ్ కోసం సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తుందని.. తన ఫొటోల ద్వారా యువకులను, మహిళలను ఆకర్షించడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తోందని.. ఇందుకుగాను ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా అందుతున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. ఇరాన్లో ఇన్ స్టాగ్రమ్, ఫేస్ బుక్ వాడకంపైన ఇప్పటికీ పరిమితులు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement