అప్పు చేసైనా సరే పెళ్లి గ్రాండ్‌గా చేస్తామంటున్నాయి మధ్యతరగతి కుటుంబాలు. వివాహం కోసం స్థోమతకు మించి మరీ ఖర్చు చేస్తున్నారు. పెళ్లి వేడుకలు అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని ఆరాటపడుతున్నారు. వీళ్ల పరిస్థితే ఇలా ఉంటే దిగ్గజ పారిశ్రామికవేత్త, వేలకోట్ల సంపన్నుడు ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లంటే ఇంకెలా ఉండాలి? దేశమంతా మార్మోగిపోదు!
సెలబ్రేషన్స్ చేసినన్ని రోజులు కలిసుండట్లేదు
ఈ ఏడాది మార్చిలో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. జూలై 12న వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే వీరు లండన్‌కు వెళ్లి అక్కడ కూడా పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టనున్నారట! ఈ వేడుకలపై పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ సోషల్ మీడియాలో సెటైర్స్ వేశాడు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు ఎన్నాళ్లు జరుపుకుంటున్నారో.. కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడటం లేదు అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
నీకేంటి సమస్య?
ఇది చూసిన జనాలు నటుడిని తిట్టిపోస్తున్నారు. 'వాళ్లు సంతోషంగానే ఉన్నారు.. మధ్యలో నీకేంటి సమస్య?', 'వాళ్లను చూసి కుళ్లుకుంటున్నావ్ కదూ..', 'అనంత్-రాధిక చిన్ననాటి స్నేహితులు.. వారి ప్రేమలో నిజాయితీ ఉంది. వారి బంధం తెగిపోయేంత బలహీనమైంది కాదు', 'నీ డబ్బుతో సెలబ్రేట్ చేసుకోవడం లేదుగా.. మరి నువ్వెందుకు అంత బాధపడుతున్నావ్..' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఐశ్వర్య- అభిషేక్ దాగుడుమూతలు.. కలిసున్నారా? విడిపోయారా?
Comments
Please login to add a commentAdd a comment