ఐశ్వర్య- అభిషేక్‌ దాగుడుమూతలు.. కలిసున్నారా? విడిపోయారా? | Abhishek Bachchan Likes Post Based Instagram Divorce Amid Seperation Rumours, Deets Inside | Sakshi
Sakshi News home page

విడాకుల పోస్టుకు అభిషేక్‌ లైక్‌.. భార్యాభర్తల మధ్య పెరుగుతున్న దూరం?

Published Thu, Jul 18 2024 5:02 PM | Last Updated on Thu, Jul 18 2024 5:46 PM

Abhishek Bachchan Likes a Instagram Post on Divorce

బాలీవుడ్‌ జంట ఐశ్వర్య రాయ్‌- అభిషేక్‌ బచ్చన్‌ విడాకులు తీసుకోబోతున్నారట! కొన్ని నెలల నుంచి ఈ వార్త జోరీగలా సోషల్‌ మీడియా అంతటా తిరుగుతోంది. కలిసి కనిపించకపోతే విడాకులనేస్తారా? మా కాపురంలో నిప్పులు పోస్తున్నారేంటని హీరో అభిషేక్‌ బచ్చన్‌ ఎప్పటిలాగే ఇటీవల సైతం మండిపడ్డాడు. తాము బాగానే ఉన్నామని తెలియజేస్తూ.. ఒకరి బర్త్‌డేకి మరొకరు ఆలస్యంగానైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

ఫంక్షన్‌కు వేర్వేరుగా
అయినా ఎక్కడో తేడా కొడుతుంది అని ఫ్యాన్స్‌ అనుకుంటూనే ఉన్నారు. వీరి అనుమానాలను నిజం చేస్తూ ఐశ్వర్య తన కూతురు ఆరాధనను తీసుకుని అనంత్‌ అంబానీ పెళ్లికి వెళ్లింది. అలా అని అభిషేక్‌ వెళ్లలేదా? అంటే వెళ్లాడు. తన తల్లిదండ్రులు జయ- అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఫంక్షన్‌కు వెళ్లాడు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు. కుటుంబమంతా కలిసి రాకుండా ఇలా సెపరేట్‌గా వచ్చారేంటి? వీళ్లు కలిసి లేరని ఇక్కడే అర్థమవుతోందోని ఎవరికి వారే అనుకున్నారు. 

విడాకుల పోస్టుపై అభిషేక్‌ ఆసక్తి
పెళ్లికి కలిసి వెళ్లలేదు, కలిసి ఫోటోలూ దిగలేదు.. కానీ లోపలికి వెళ్లాక మాత్రం ఐష్‌- అభిషేక్‌ పక్కపక్కనే కూర్చుని కబుర్లాడినట్లు ఓ ఫోటో కూడా బయటకు వచ్చింది. దీంతో వీరి వ్యవహారం ఎవరికీ ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఇంతలోనే తాజాగా అభిషేక్‌ ఓ విడాకుల పోస్టును లైక్‌ చేశాడు. అందులో ప్రేమ కష్టంగా మారితే.. అని రాసుంది.

50 ఏళ్ల తర్వాత కూడా..
ఇంకా ఏమని ఉందంటే.. విడాకులు తీసుకోవడం ఎవరికీ అంత ఈజీ కాదు. కానీ కొన్ని సార్లు జీవితం మనం అనుకున్నట్లు సాగదు. దశాబ్దాలపాటు కలిసుండి వేరుపడితే ఆ బాధను ఎలా తట్టుకుంటున్నారు? 50 ఏళ్ల తర్వాత కూడా విడిపోవడానికి మొగ్గుచూపుతున్నారు. దీనికి అనేక రకాల కారణాలున్నాయని అందులో రాసుకొచ్చారు. పత్రికలో వచ్చిన వ్యాసాన్ని దీనికి జత చేశారు. ఈ పోస్టును అభిషేక్‌ లైక్‌ చేయడంతో.. మళ్లీ విడాకుల చర్చ మొదలైంది.

చదవండి: ప్రియుడితో పెళ్లి.. అనుకున్నది సాధించానంటున్న హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement