త్వరలో మూడు ముళ్ళతో, ఏడు అడుగులతో ఒక్కటి కానున్న కొత్త జంట 'అనంత్ అంబానీ, రాధిక మర్చంట్'ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అప్పుడే మొదలైపోయాయి. ఈ కార్యక్రమానికి ఇప్పుడిప్పుడే ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు వస్తున్నారు.
జామ్‌నగర్‌లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఒక్కో రోజు.. ఒక్కో థీమ్‌తో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే చాలామందికి భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. అనంత్ అంబానీకి కాబోయే భార్య 'రాధిక' గురించి పెద్దగా తెలియకపోవచ్చు.
నిజానికి అనంత్, రాధిక చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఈ చిన్ననాటి స్నేహమే తరువాత ప్రేమగా చిగురించి, పెళ్లి పీటల వరకు తీసుకువచ్చింది. రాధిక మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్, పారిశ్రామికవేత్త షైలా మర్చంట్‌ల చిన్న కుమార్తె. ఈమె బీడీ సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి డిప్లొమో పూర్తి చేసింది. ఆ తరువాత న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది.
న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్, దేశాయ్ అండ్ దివాన్‌లలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఆమె రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్ప్రావాలో జూనియర్ సేల్స్ మేనేజర్‌గా కూడా పనిచేసింది. ఆ తరువాత కుటుంబం వ్యాపారమైన ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డు డైరెక్టర్‌గా పనిచేసింది.
విలాసవంతమైన జీవనశైలిని కొనసాగిస్తున్న ఈమె ఖరీదైన దుస్తులు, వస్తువులు వినియోగించడానికి చాలా ఆసక్తి చూపుతుంది. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌తో కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఈమె సంపద విలువ రూ. 8 నుంచి రూ. 10 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.
రాధిక మర్చంట్.. నీతా అంబానీ మాదిరిగా ప్రముఖ వ్యాపారవేత్త మాత్రమే కాదు క్లాసికల్ డ్యాన్సర్ కూడా, గతంలో 2022లో జియో వరల్డ్ సెంటర్‌లో నాట్యం చేసి ఎంతోమందిని అలరించింది. ఈమె జంతు సంక్షేమం, విద్య, మానవ హక్కుల వంటి పలు సామిజిక అంశాల మీద కూడా ఆసక్తి కలిగి ఉంది.
ఇదీ చదవండి: కాబోయే కోడలి కోసం ఖరీదైన కానుకలు.. ఎంతైనా అంబానీ రేంజే వేరు..
రాధిక మర్చంట్ జులై 12న అనంత్ అంబానీతో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ రూ.4.5 కోట్ల విలువైన బెంట్లీ కారు, వెండి లక్ష్మి గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్ వంటి వాటిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment