ఆమెను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నా..
గతకొంతకాలంగా ప్రణయసీమల్లో విహరిస్తున్న పాప్ సింగర్ రిహాన్నా, ర్యాపర్ డ్రాకే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటే సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి. రిహాన్నాను పెళ్లిచేసుకోవాలని డ్రాకే కృతనిశ్చయంతో ఉన్నాడంట.
కొంతకాలం ప్రేమించుకొని ఆ తర్వాత విడిపోయి.. మళ్లీ ఇప్పుడు రొమాన్స్ చేసుకుంటున్న ఈ జంట తాజాగా ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డు వేడుకలో తమ మధ్య ఉన్న ప్రేమను చాటుకున్నారు. తాను రిహాన్నాతో ప్రేమలో ఉన్నట్టు 29 ఏళ్ల డ్రాకే ఈ వేడుకలో ప్రకటించాడు. ఇందుకు రిహాన్నా సిగ్గుపడుతూ తలూపింది. ఈ నేపథ్యంలో రిహాన్నాను పెళ్లి చేసుకోవాలని డ్రాకే కోరుకుంటున్నాడని, ఇద్దరూ పెళ్లికి సిద్ధంగా ఉన్నారని, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్నది వారే నిర్ణయం తీసుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.