సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్‌బుక్ సొంతమైన ఇన్‌స్టాగ్రామ్‌లో అవతార్‌ని క్రియేట్ చేసుకోవడం ఇపుడు చాలా ఈజీ. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో మనకు నచ్చిన అవతార్ సృష్టించుకునే అవకాశాన్ని మెటా కల్పించింది. తద్వారా మన స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన అవతార్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. (Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?)
ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్ ఇలా....
ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవతార్‌ను క్రియేట్ చేసుకోవడానికి...
♦ మీ ప్రొఫైల్‌లోకి వెళ్లిన తరువాత స్క్రీన్ రైట్ కార్నర్‌లోని హంబర్గర్ మెనూ క్లిక్ చేయాలి.
♦ ఎకౌంట్–అవతార్‌లోకి వెళితే ‘అవతార్ మేకింగ్ స్క్రీన్’ ఓపెన్ అవుతుంది.
♦ స్కిన్ టోన్‌ను ఎంపిక చేసుకొని మీ ఇన్‌స్టా అవతార్‌ను తయారు చేసుకోవాలి.
♦ మీ అవతార్‌కు మీకు ఓకే అనిపిస్తే...స్క్రీన్ టాప్‌రైట్ కార్నర్‌లోని ‘డన్’ క్లిక్ చేయాలి.
♦ ఫేస్‌స్ట్రక్చర్, హెయిర్ స్టైల్, నోస్‌షేప్... మొదలైన ఆప్షన్స్‌ను యూజర్ ఎంపిక చేసుకోవచ్చు.
ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ స్నాప్‌చాట్ ఇండియాలో స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్‌ను నెలకు కేవలం 49 రూపాయలకే అందిస్తోంది. దీంతో పాటు అనేక ప్రత్యేక ఫీచర్లను కూడా యూజర్లకు అందిస్తోంది.
స్నాప్‌చాట్+లో ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్
మెసేజింగ్ అండ్ అప్‌డేట్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ స్నాప్‌చాట్ ‘స్నాప్‌చాట్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్’ సర్వీస్‌ను లాంచ్ చేసింది. దీనిలో భాగంగా యూజర్లు ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌పెరిమెంటల్, ఫ్రీ రిలీజ్ ఫీచర్లతో యాక్సెస్ కావచ్చు. రీవాచ్ ఇండికేటర్, బ్యాడ్జ్, కస్టమ్ యాప్ ఐకాన్స్, బెస్ట్‌ఫ్రెండ్స్ ఫర్‌ఎవర్, ఘోస్ట్ ట్రయల్స్ ఆన్ స్నాప్ మ్యాప్, సోలార్ సిస్టమ్...అనే ఆరు ఎక్స్‌క్లూజివ్ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది. సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌లోకి వచ్చాం అనేదానికి సూచనగా యూజర్ ప్రొఫైల్‌లో స్నాప్‌చాట్ ప్లస్ బ్యాడ్జ్, స్టార్‌లు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి: Anand Mahindra: వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, భార్య జంప్, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్
Comments
Please login to add a commentAdd a comment