
నన్ను ఫాలో అవ్వండి: స్టార్ హీరోయిన్
టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా తనను ఫాలో అవాలని కోరుతోంది. అదేంటీ హీరోయిన్ ఏంటి ఇలా అంటుందనుకుంటున్నారా.. ఆ విషయం ఏంటంటే.. స్నాప్ చాట్ అనే లేటెస్ట్ సోషల్ నెటివర్కింగ్ సైట్ లో మిల్కీ బ్యూటీ ఇటీవల ఖాతా తెరిచింది. తన అభిమానులు, మిత్రులతో స్నాప్ చాట్ లో తీరిక వేళల్లో చాటింగ్ చేయాలని భావించినట్లుంది. స్నాప్ చాట్ లో తాను జాయిన్ అయ్యాయని, తన అభిరుచులు, విశేషాలను పంచుకోవాలనుకుంది. అందుకే తనను స్నాప్ చాట్ అకౌంట్ లో ఫాలో అవ్వాలని కోరుతూ తన ట్విట్టర్ ఖాతాలో తమన్నా పోస్ట్ చేసింది.
ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సైట్లలో ఇప్పటికే సెలబ్రిటీలు తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ మూవీలు, ఫారిన్ ట్రిప్స్, తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు.. ఇలా చాలా విషయాలను సెలబ్రిటీలు తమ ఫాలోయర్స్ తో షేర్ చేసుకుంటున్నారు. లైక్ టీచర్, లైక్ స్టూడెంట్ అంటూ మార్నింగ్ వర్కవుట్ గురించి ట్రెయినర్ సిద్ధార్థ సింగ్ తో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ట్రెయినర్ తో కలిసి అల్లరి చేసింది. తమ ఇద్దరి వేషాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు ఆ విశేషాలను ఫొటో ద్వారా పంచుకుంది.