ఎగిరే కెమెరా.. అదిరిందయ్యా | Snapchat Company Unveils Flying Drone Camera Called Pixy | Sakshi
Sakshi News home page

ఎగిరే కెమెరా.. అదిరిందయ్యా

Published Sat, Apr 30 2022 4:03 AM | Last Updated on Sat, Apr 30 2022 4:03 AM

Snapchat Company Unveils Flying Drone Camera Called Pixy - Sakshi

కెమెరా గాల్లో ఎగురుతూ మన చుట్టూ తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీస్తుంటే ఎలా ఉంటుంది? వారెవా.. భలే ఉంటుంది అంటారు కదా. అచ్చం ఇలాంటి ప్రత్యేకతలతోనే స్నాప్‌ చాట్‌ కంపెనీ ఓ ఎగిరే కెమెరాను విడుదల చేసింది. ఎలాంటి సెటప్‌ అవసరం లేకుండా దానంతట అదే పని చేసే ఈ కెమెరాకు ‘పిక్సీ’ అని పేరు పెట్టింది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉండదు. వెళ్లాల్సిన 4 మార్గాలు ముందే ఇందులో నిర్దేశించి ఉంటాయి. మనకు కావాల్సిన మార్గాన్ని ఎంచుకొని బటన్‌ నొక్కితే గాల్లో తేలియాడుతుంది. మనతో పాటు కదులుతుంది. ఫొటోలు, వీడియోలు తీస్తుంది.

అంతా అయిపోయాక మన అరచేయిని కింద పెడితే వచ్చి వాలిపోతుంది. దీన్ని ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్‌లలో అందుబాటులోకి తెచ్చారు. ధర రూ. 17,600. దీని బరువు 101 గ్రాములు. ఇందులో 12 మెగా పిక్సెల్‌ కెమెరా ఉంటుంది. 2.7కె వీడియోలు తీస్తుంది. 16జీబీ డేటాను నిల్వ చేసుకుంటుంది. అంటే దాదాపు వెయ్యి ఫొటోలు, వంద వీడియోల వరకు తీస్తుంది. పిక్సీ బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో కంపెనీ చెప్పలేదు. అయితే ఫుల్‌గా చార్జ్‌ చేస్తే దాదాపు 5 నుంచి 8 సార్లు ఎగురుతుందని చెబుతున్నారు. ఒక్కసారి ఎగిరితే దాదాపు 10 నుంచి 20 సెకన్లు గాల్లో ఉంటుంది. 
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement