Snapchat Layoff: 2024 ప్రారంభం నుంచి అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 32000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు, ఉద్యోగాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ (Snapchat) మాతృ సంస్థ, స్నాప్ కూడా 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.
ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా తమ ఉద్యోగులను తగ్గించుకోవాలని యోచిస్తున్న కంపెనీల జాబితాలో.. స్నాప్ కూడా చేరింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది.
సంస్థలో ఇప్పటికి 5367 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు.. ఇందులో 10 శాతం, అంటే సుమారు 540 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. స్నాప్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. 2022లో 20 శాతం ఉద్యోగులను, 2023లో 3 శాతం ఉద్యోగులను ఇంటికి పంపింది.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన 'టాటా' - ఏకంగా రూ.30 లక్షల కోట్లు..
కంపెనీ 10 శాతం ఉద్యోగులను తొలగిస్తుందన్న విషయం ప్రకటించినప్పటికీ.. ఏ విభాగంలో ఎంతమందిని తొలగిస్తుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కంపెనీ ఎదుగుదలకు ప్రాధాన్యత ఇస్తూ.. రాబోయే రోజుల్లో మంచి వృద్ధిని సాధించడానికి సంస్థ ఈ లే ఆప్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment