న్యూఢిల్లీ: facebook launches online courses for content creators కంటెంట్ క్రియేటర్లకు ఆన్‌లైన్ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది. మార్కెట్ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది.
క్రియేటర్లకు విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి, అధిక ఆదాయం, వృద్ధికి తోడ్పడుతుందని ఇన్‌స్ట్రాగామ్ హెడ్ అడమ్ మోసెరీ తెలిపారు. చిన్న పట్టణాల్లోనూ ఇన్‌స్ట్రాగామ్ షార్ట్ వీడియో ఫీచర్ అయిన రీల్స్ వాడకం పెరిగిందని చెప్పారు. ప్రతిరోజూ సగటున 60 లక్షల రీల్స్ నమోదవుతున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment