హైదరాబాద్: వీడియో కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు వీలుగా చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ జియూన్ సరికొత్త జింబల్‌లను ఇండియాలో రిలీజ్ చేసింది. జింబల్స్ స్మూత్ క్యూ3, విబిల్ 2ను ఇటీవల ఆవిష్కరించింది.
జియూన్ అందిస్తోన్న జింబల్‌లో త్రీ-యాక్సిస్, రొటేటబుల్ ఫిల్ లైట్, 17 స్మార్ట్ టెంప్లేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు 4300k వార్మ్ టోన్డ్ ఇంటిగ్రేటెడ్ ఫిల్ లైట్, మూడు లెవల్స్‌లో బ్రైట్ అడ్జస్ట్‌మెంట్, ఫ్రంట్, రియర్ లైటింగ్ కోసం 180° టచ్ బటన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి సాయంతో తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన వీడియోలను మరిన్ని యాంగిల్స్‌లో తీసే వీలు కలుగుతుంది.
స్మూత్-క్యూ3 యూజర్లు స్మార్ట్ టెంప్లేట్స్, అడ్వాన్స్డ్ ఎడిటర్ వంటి కొత్త ఫీచర్లతో గతంలో కంటే అధిక విధాలుగా ఇప్పుడు తమ స్టోరీలు క్యాప్చర్ చేయవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మూత్ క్యూ3 అన్ని ప్రధాన ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లను సపోర్టు చేస్తుంది. కంటెంట్ క్రియేటర్లు, ఇతరులకు మెరుగైన క్వాలిటీ అందిస్తుంది.
కొత్త ప్రొడక్టు ఆవిష్కరణ సందర్భంగా జియూన్ ఇండియా ప్రతినిధి మయాంక్ చచ్రా మాట్లాడుతూ... భారతీయ మార్కెట్ నుంచి మాకు మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రస్తుతం మా బ్రాండ్ నుంచి 11 ఉత్పత్తులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్యను 15 పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.
చదవండి : Xiaomi Smart Glasses: మాట్లాడేందుకు కళ్ల జోళ్లొస్తున్నాయ్
Comments
Please login to add a commentAdd a comment