video cameras
-
Gimbal: వీడియో కంటెంట్ ఇప్పుడు మరింత కొత్తగా
హైదరాబాద్: వీడియో కెమెరాలు, స్మార్ట్ఫోన్లను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు వీలుగా చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ జియూన్ సరికొత్త జింబల్లను ఇండియాలో రిలీజ్ చేసింది. జింబల్స్ స్మూత్ క్యూ3, విబిల్ 2ను ఇటీవల ఆవిష్కరించింది. జియూన్ అందిస్తోన్న జింబల్లో త్రీ-యాక్సిస్, రొటేటబుల్ ఫిల్ లైట్, 17 స్మార్ట్ టెంప్లేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు 4300k వార్మ్ టోన్డ్ ఇంటిగ్రేటెడ్ ఫిల్ లైట్, మూడు లెవల్స్‌లో బ్రైట్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్, రియర్ లైటింగ్ కోసం 180° టచ్ బటన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి సాయంతో తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన వీడియోలను మరిన్ని యాంగిల్స్‌లో తీసే వీలు కలుగుతుంది. స్మూత్-క్యూ3 యూజర్లు స్మార్ట్ టెంప్లేట్స్, అడ్వాన్స్డ్ ఎడిటర్ వంటి కొత్త ఫీచర్లతో గతంలో కంటే అధిక విధాలుగా ఇప్పుడు తమ స్టోరీలు క్యాప్చర్ చేయవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మూత్ క్యూ3 అన్ని ప్రధాన ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లను సపోర్టు చేస్తుంది. కంటెంట్ క్రియేటర్లు, ఇతరులకు మెరుగైన క్వాలిటీ అందిస్తుంది. కొత్త ప్రొడక్టు ఆవిష్కరణ సందర్భంగా జియూన్ ఇండియా ప్రతినిధి మయాంక్ చచ్రా మాట్లాడుతూ... భారతీయ మార్కెట్ నుంచి మాకు మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రస్తుతం మా బ్రాండ్ నుంచి 11 ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్యను 15 పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. చదవండి : Xiaomi Smart Glasses: మాట్లాడేందుకు కళ్ల జోళ్లొస్తున్నాయ్ -
స్వేచ్ఛాయుత పోలింగ్‌కు సర్వం సిద్ధం
► ఓటు బయటికి తెలిసే ఛాన్సే లేదు ► వెబ్, వీడియో కెమెరాల ఏర్పాటు ► ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక కేంద్ర పరిశీలకుడు ► జిల్లా ఎన్నికల అధికారి కేవీ సత్యనారాయణ కడప సెవెన్‌రోడ్స్: శాసనమండలి కడపస్థానిక సంస్థల నియోజకవర్గానికి ఈనెల 17న జరగనున్న పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి కేవీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మలమడుగు, రాజంపేటలలో ఆర్డీఓ కార్యాలయాలు, కడపలో జెడ్పీ సమావేశ మందిరం పోలింగ్ కేంద్రాలుగా ఉంటాయన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం సీనియర్ అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామన్నారు. మూడంచెల భద్రత: ఒక్కో పోలింగ్ ప్రాంతాన్ని ఇన్నర్ సర్కిల్, కాంపౌండ్, ఔటర్ సర్కిల్‌గా విభజించామన్నారు. ఓటర్లు తాము ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారానే లోనికి వెళ్లి అనంతరం మరోమార్గం ద్వారా బయటికి రావాల్సి ఉంటుందన్నారు. ఓటర్లు లోనికి వెళ్లే సమయంలో మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఓటు వేసిన అనంతరం బయటికి వచ్చే సమయంలో కూడా తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఓటర్లు తమ వెంట ఐడీ కార్డు, ఓటరు స్లిప్పులు తీసుకొస్తేనే లోనికి అనుమతిస్తామని చెప్పారు. కెమెరాలతో నిఘా: పోలింగ్ కేంద్రంలో రెండు వెబ్ కెమెరాలతోపాటు ఇద్దరు వీడియో గ్రాఫర్లను సైతం నియమిస్తున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రంలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళుతున్నారో ఇట్టే తెలిసిపోతుందన్నారు. కలెక్టరేట్ మీడియా సెంటర్లో వెబ్‌కాస్టింగ్‌ను తిలకించవచ్చన్నారు. రహస్య ఓటింగ్: పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వ్యక్తి ఓటరు అవునో, కాదో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బ్యాలెట్ పేపరు ఇస్తామని తెలిపారు. కంపార్టుమెంటులోకి వెళ్లి ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పత్రం వెనుక ఉన్న పీఓ సంతకం, డిస్టింగ్విషింగ్ మార్క్‌ను ప్రిసైడింగ్ అధికారికి చూపించాల్సి ఉంటుందన్నారు. వీటిని సరిచూశాక ప్రిసైడింగ్ అధికారి అనుమతి మేరకే ఓటరు తన బ్యాలెట్ పత్రాన్ని బాక్సులో వేయాలన్నారు. ఓటింగ్ వంద శాతం రహస్యంగానే సాగుతుందని వివరించారు. ప్రస్తుతం జరిగే పోలింగ్‌లో ఏ ఓటరుకు కంపానియన్ సౌకర్యం ఉండదని స్పష్టం చేశారు. అడుగడుగునా పోలీసుల మోహరింపు: ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెయ్యి మంది పోలీసులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీరితోపాటు ప్రధాన కూడళ్లు, పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసుల పహారా ఉంటుందన్నారు. సీఆర్పీఎఫ్ బలగాలతోపాటు ఆరు ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, స్థానిక పోలీసులు కూడా బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. ప్రచారాలు బంద్: బుధవారం 4 గంటలకు ప్రచార కార్యక్రమం ముగిసిందని పేర్కొన్నారు. ఎలాంటి ప్రచారాలు నిర్వహించరాదన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి ఆఫీసు బేరర్లు ఎవరూ పోలింగ్ ఏజెంట్లుగా కూర్చొవడానికి అనుమతించబోమని తెలిపారు. రిటర్నింగ్ అధికారి శ్వేత, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వై.నరసింహారావు, ట్రైనీ ఐఎఫ్ఎస్ నందిని పాల్గొన్నారు. ఎన్నికల పరిశీలకులు వీరే..: తొలుత ఎన్నికల సంఘం జిల్లాకు ఒక్క పరిశీలకుడిని మాత్రమే నియమించిందని చెప్పారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితిని చూశాక మరో ఇద్దరు పరిశీలకులు అవసరమని తాము ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. దీంతో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పరిశీలకుని ఈసీ నియమించిందని కలెక్టర్ పేర్కొన్నారు. కడప డివిజన్ పోలింగ్ కేంద్రానికి చక్రవర్తి, రాజంపేటకు కరికల వలవెన్, జమ్మలమడుగుకు కేఎస్ జవహర్‌రెడ్డిలను ఈసీ నియమించిందన్నారు. జనరల్ అబ్జర్వర్‌గా బి.కిశోర్ వ్యవహరిస్తారని వివరించారు. వీరితోపాటు అమిత్‌గార్గ్ అనే ఐపీఎస్ అధికారి పోలీసు అబ్జర్వర్‌గా ఉంటారని తెలిపారు. -
30 నిమిషాల ముందే హాజరుకావాలి
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల్లో అక్రమాలకు తావివ్వకుండా పరీక్ష కేంద్రాల్లో వీడియో కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా జిల్లాలో సాలూరు మండలం పి.కోనవలస ఏపీటీడబ్ల్యూ గురుకుల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో వీడియో కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 11 నుంచి మొదటి సంవత్సరం, 12 నుంచి రెండో సంవత్సరం ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు విధిగా 30 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి హాజరుకావాలి. కనీసం 15 నిమిషాల ముందు హాజరుకాకపోతే అనుమతించరు. 31వ తేదీ వరకు నిర్వహించే పరీక్షలకు జిల్లాలో 46,839 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 23,040 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 23,799 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 170 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అనుకూలంగా ఉన్న 68 కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారి చొప్పున ఇద్దరు అధికారులు పూర్తిస్థాయి నిర్వాహణ బాధ్యత తీసుకుంటారు. జిల్లాలోని ప్రైవేటు కళాశాల పరీక్ష కేంద్రాల్లో అదనంగా మరో సహాయ సీఎస్‌ను ఏర్పాటు చేస్తారు. రోజూ ఉదయం 09.00 నుంచి 12.00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల్లో ఫర్నీచరు, తాగునీరు, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పదిరోజుల కిందటే వచ్చిన ప్రశ్నపత్రాలను ఇంటర్మీడియెట్ తనిఖీ అధికారి కార్యాలయంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. హాల్ టిక్కెట్లను కూడా ఆయా కళాశాలల యాజమాన్యాలకు బుధవారం నుంచి అందజేస్తున్నారు. హాల్ టిక్కెట్లో ఏవైనా తప్పులుంటే కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా ఆర్ఐఓ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే బోర్డుకు పంపి సవరణలు చేయిస్తామని ఆర్ఐఓ ఎల్ఆర్ బాబాజీ తెలిపారు. కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సభ్యులతో చర్చిస్తూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాల్‌ప్రాక్టీస్ నిరోధానికి ముగ్గురేసి సభ్యులున్న మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఇద్దరేసి సభ్యులున్న ఐదు సిట్టింగ్ స్క్వాడ్ల బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు కనీస (కనీసం) 11 మంది ఇన్విజిలేటర్లు విధులను నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఏడాది కూడా ‘జీపీఎస్’ అమలు ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులకు ఇంటర్మీయెట్ మార్కులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఏడాది మాల్‌ప్రాక్టీస్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు బోర్డు ప్రతిసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత ఏడాది ప్రయోగాత్మకంగా అమలు చేసిన వినూత్న పద్ధతులు ఫలితాలను ఇచ్చాయి. పరీక్ష కేంద్రాల పరిధిలోని సెల్‌ఫోన్ కాల్స్‌పై దృష్టిసారించేందుకు నూతన టెక్నాలజీ గ్లోబెల్ పొజిషన్ సిస్టం (జీపీఎస్) ను ఇంటర్ బోర్డు గత ఏడాది అమలు చేసింది. ఈ ఏడాది కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. జీపీఎస్ టెక్నాలజీ వినియోగం వల్ల సంబంధిత పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్, బ్లూటూత్ వంటివి ఎవరు వినియోగించినా బోర్డు ఉన్నతాధికారులు గుర్తించ వచ్చు. పరీక్ష కేంద్రాలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టు మెంటల్ అధికారుల మినహా ఇతర సిబ్బంది ఎవ్వరూ సెల్ఫోన్లు వినియోగించడానికి వీలులేదు. కార్పొరేట్ కళాశాలల్లో అధికశాతం మాల్‌ప్రాక్టీస్ కేసులు ఎదురవడం వల్ల ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థికిచ్చిన జవాబు బుక్లెట్ 24 పేజీలున్నాయో లేదోచూసుకోవాలి. పరీక్షకేంద్రానికి 30 నిముషాల ముందు హాజరవ్వాలి. కనీసం 15 నిముషాలు ముందు రావాలి. ఈ సమయం దాటితే పరీక్షకు అనుమతి ఇవ్వరు. అంధ విద్యార్థికి స్కైబ్ (సహాయకుడు) అర్హత డిగ్రీ చదువుతో సమానంగా ఉండాలి. సంబంధిత కోర్సులు చదివి ఉండకూడదు. ఓఎంఆర్ బార్‌కోడెడ్ షీటులోని పార్టు-3లో అభ్యర్థి ఏమైనా మార్పులు చేసినట్లయితే పబ్లిక్ పరీక్షలలో అనుచిత ప్రవర్తనగా పరిగణిస్తారు. సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు -
ప్రైవేట్ స్కూల్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయలోని నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనను చిత్రీకరించేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బందితో స్కూల్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. రిపోర్టర్ల కెమెరాలు లాక్కొని ధ్వంసం చేశారు. ప్రమాద తీవ్రత తెలియాల్సి ఉంది.. -
కొలువు వేటకు వీడియో బాసట!
ఉద్యోగ ప్రయత్నం సఫలం కావాలంటే.. అర్హతలు, అనుభవం ఉండగానే సరిపోదు. వాటిని సరైన రీతిలో రిక్రూటర్ల దృష్టికి తీసుకెళ్లగలగాలి. కొలువుకు వందలు, వేలాది మంది అర్హులైన అభ్యర్థులు పోటీపడుతుంటారు. వారందరినీ దాటుకొని వెళ్లి ముం దంజలో నిలవాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఇటీవలి కాలంలో దరఖాస్తుల విషయంలో రెజ్యూమెలాగే వీడియో కూడా తప్పనిసరిగా మారుతోంది. ఆందుకే అభ్యర్థులు దీనిగురించి తెలుసుకోవాలి. కొలువు వేట ప్రారంభించినవారితోపాటు ప్రారంభించనివారు కూడా ఈ వీడియో ఇంటర్వ్యూలు, రెజ్యూమెల గురించి తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. సమయం, డబ్బు ఆదా ఆధునిక కాలంలో హైరింగ్ మేనేజర్లు జాబ్ ఇంటర్వ్యూల కోసం వీడియోపైనే ఆధారపడుతున్నారు. దూర ప్రాంతాల్లోని అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. దీనివల్ల విలువైన సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. తమ కంపెనీల్లో జాబ్ ఇంటర్వ్యూలను వీడియో ద్వారానే కొనసాగిస్తున్నట్లు 63 శాతం హెచ్ఆర్ మేనేజర్లు చెప్పారు. వీడియో పాపులారిటీ నానాటికీ పెరుగుతోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ వినియోగిస్తున్నారు. ఈ విధానంలో రిక్రూటర్లు అభ్యర్థులను ఆన్లైన్లో ప్రశ్నిస్తారు. వీడియో ఇంటర్వ్యూయింగ్ టూల్స్ కూడా అమల్లో ఉన్నాయి. ఇందులో ముందే రికార్డు చేసిన ప్రశ్నలకు వరుసగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రిక్రూటర్లు కనిపించరు. అభ్యర్థులు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఫార్మాట్ ఏదైనప్పటికీ వీడియో ఇంటర్వ్యూలో నెగ్గాలంటే తగిన విధంగా ప్రిపేర్ కావాలి. సాంకేతికాంశాలు యూజర్ ఫ్రెండ్లీ వీడియో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్, వీడియో కెమెరాను ఆపరేట్ చేయగలిగితే చాలు.. వీడియో ఇంటర్వ్యూను ఎదుర్కోవచ్చు. సౌకర్యవంతమైన ఎక్విప్మెంట్ను ఎంచుకోవాలి. దాన్ని ముందే పరీక్షించి చూసుకోవాలి. ఏవైనా సమస్యలు తలెత్తితే సరిచేసుకోవాలి. సాంకేతికాంశాలు మీ ఉద్యోగావకాశాలను దెబ్బతీయకుండా చూసుకోవాలి. చక్కటి వెలుతురు, నిశ్శబ్ద వాతావరణం ఉన్నచోటును ఇంటర్వ్యూ కోసం ఎంచుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో పుస్తకాలు, వస్తువులు లేకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే.. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు రిక్రూటర్ల దృష్టిని అవి పక్కదారి పట్టిస్తాయి. కొన్ని దుస్తులు, రంగులు వీడియోలో ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. మీరు తెల్ల దుస్తులు వేసుకొని, తెలుపురంగు గోడ ముందుకు కూర్చుంటే వీడియోలో అస్పష్టంగా కనిపిస్తారు. కాబట్టి సరిగ్గా కనిపించే రంగులను ఎంచుకోవాలి. అదేసమయంలో మీ వస్త్రధారణ పూర్తి ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఇంటర్వ్యూకు సంసిద్ధమయ్యే క్రమంలో స్నేహితులు, సహచరులతో కలిసి ముందే సాధన చేయడం మంచిది. దీంతో బెరుకు మాయమవుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వీడియోలో మిమ్మల్ని మీరు చిత్రీకరించుకొని చూసుకోండి. మాటతీరు, హావభావాల్లో మార్పులుచేర్పులు చేసుకోండి. బయోడేటా వీడియో అనేది ఇంటర్వ్యూలకే పరిమితం కాదు బయోడేటాకు కూడా ఉపయోగిస్తున్నారు. ఒకటి నుంచి మూడు నిమిషాల నిడివి ఉండే ఈ వీడియోలో అభ్యర్థులు తమ గురించి తాము చెప్పుకోవాలి. పరిచయం, విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం వంటివాటిని క్లుప్తంగా వివరించాలి. దరఖాస్తుతోపాటు ఈ వీడియోను సంస్థకు పంపించాలి. అంతేకాకుండా యూట్యూబ్, లింక్డ్ఇన్ వంటి సామాజిక అనుసంధాన వేదికల్లో పోస్టు చేయాలి. రిక్రూటర్లు వీటిని పరిశీలిస్తారు. తమకు కావాల్సిన అర్హతలున్న అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. కమ్యూనికేషన్స్ హైరింగ్ మేనేజర్‌తో కమ్యూనికేషన్స్‌కు కూడా వీడియోను వినియోగించుకోవచ్చు. మౌఖిక పరీక్ష పూర్తయిన తర్వాత రిక్రూటర్స్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వీడియోను రూపొందించుకొని వారికి ఈ-మెయిల్ ద్వారా పంపించండి. దీనివల్ల వారికి మీపై సానుకూలమైన అభిప్రాయం కలుగుతుంది. వీడియో అనగానే అది ఎలా ఉన్నా ఫర్వాలేదు అనుకోవద్దు. నాణ్యమైన వీడియోతోనే ఆశించిన ఫలితం లభిస్తుంది. -
హాస్టల్ బాత్రూంలో కెమెరాలు!
సాక్షి, చెన్నై:ఊరుగాని ఊరొచ్చి హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులతో ఓ ఎలక్ట్రీషియన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాత్రూముల్లో స్నానం చేస్తున్న విద్యార్థినులను వీడియో తీశారన్న సమాచారంతో కంచిలోని ఓ వర్సిటీలోని విద్యార్థుల్లో ఆగ్రహం రేగిం ది. యాజమాన్యం నిర్లక్ష్య పూరితంగా సమాధానం ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బస్సులపై ప్రతాపం చూపించారు. కాంచీపురంలో ఓ ప్రైవే టు వర్సిటీ ఉంది. ఈవర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు మూడు వేల మంది వరకు చదువుకుంటున్నారు. వీరికి ఆ యాజమాన్యం హాస్టల్ సౌకర్యం కల్పించింది. అయితే, బుధవారం చోటు చేసుకున్న ఘటనతో విద్యార్థినులకు హాస్టల్లో భద్రత ఉందా? అన్న ప్రశ్న బయలు దేరింది. ఎలక్ట్రీషియన్ అసభ్యకర ప్రవర్తన ఆ హాస్టల్లో వార్డెన్‌గా పనిచేస్తున్న ఒకరికి సన్నిహితుడైన ఎలక్ట్రీషియన్ విద్యార్థినులతో అసభ్యకరం గా ప్రవర్తించాడు. అంతేకాకుండా స్నానం చేస్తున్న విద్యార్థినుల్ని రహస్యంగా తన మొబైల్ కెమెరాలో బంధించాడు. ఎన్నాళ్ల నుంచి ఈ తంతు సాగుతున్న దో ఏమోగానీ, బుధవారం కొందరు విద్యార్థినులు ఎలక్ట్రీషియన్ నిర్వాకాన్ని పసిగట్టారు.ఈ విషయాన్ని విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ఎలక్ట్రీషియన్‌పై చర్య తీసుకోవాలని, వార్డెన్‌ను సస్పెండ్ చేయాలన్న నినాదంతో విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. మీడియాకు కొందరు విద్యార్థులు ఫోన్లలో సమాచారం ఇచ్చారు. అప్పటికే మేల్కొన్న యాజమాన్యం విద్యార్థుల్ని బుజ్జగించే యత్నం చేసింది. కొందరు విద్యార్థులు ఆగ్రహించి తమ ప్రతాపాన్ని అక్కడి బస్సులపై చూపించారు. ల్యాబ్, కళాశాల పరిసరాల్లోని అద్దాలు ధ్వంసం చేశారు. ఓ దశలో కొందరు విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలు దేరగా, యజమాన్యం అడ్డుకున్నట్టు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేశామని, వార్డెన్‌ను సస్పెండ్ చేశామని చెబుతూ, కళాశాలకు సెలవు ప్రకటించేసింది. పది రోజుల పాటు సెలవు ప్రకటించిన కళాశాల యాజమాన్యం, ఆ ఎలక్ట్రీషియన్‌పై మొక్కుబడిగా కేసు నమోదు చేయించినట్టు విద్యార్థులకు సమాచారం అందడంతో మరోమారు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాయంత్రం విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో తమ ప్రతాపాన్ని ఆ వర్సిటీ ఆస్తులపై చూపించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న కాంచీపురం ఎస్పీ విజయకుమార్ నేతృత్వంలోని బలగాలు అక్కడికి చేరుకుని విద్యార్థులపై లాఠీలను ఝుళిపించాయి. తమపై లాఠీలు ఝుళిపించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు కళాశాల లోపల నిరసన కు దిగారు. పరిస్థితి మరింతగా అదుపు తప్పకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలక్ట్రీషియన్ మొబైల్లోని సిమ్ కార్డును వార్డెన్ ధ్వంసం చేసినట్టుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ నేతృత్వంలో విచారణ బృందాన్ని రంగంలోకి దించారు. -
లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు!