లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు! | video-cameras-in-university-ladies-hostel-bathroom | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 24 2014 8:52 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM

యూనివర్సిటీ విద్యార్ధినుల హాస్టల్ బాత్రూమ్లో వీడియో కెమెరాలు అమర్చారు. తమిళనాడులోని అత్యంత ప్రతిష్టాత్మక కంచి విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. హాస్టల్ బాత్రూమ్లో అమర్చిన వీడియో కెమెరాలు చూసిన విద్యార్థినులు వార్డెన్ దృష్టికి తీసుకువెళ్లారు. వార్డెన్, అధికారులు స్పందించలేదు. దాంతో విద్యార్థులు పోలీసులకు, యూనివర్శిటీ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. యూనివర్సిటీ ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉండవచ్చునని యూనివర్శిటీ అధికారులు అనుమానిస్తున్నారు. అధికారుల తీరుపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు భద్రతలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు యూనివర్సిటీ వదిలి వెళ్లిపోవాలని విద్యార్థులను బెదిరిస్తున్నారు. హాస్టళ్లను ఖాళీ చేయాలని విద్యార్థులకు చెబుతున్నారు. విద్యార్థులలో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. దాదాపు పది రోజుల నుంచి ఈ వీడియో కెమెరాలు అమర్చినట్లు తెలుస్తోందని విద్యార్థులు చెప్పారు. కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోకుండా ఆందోళన చేస్తున్న తమపై లాఠీఛార్జీ చేశారని విద్యార్థులు చెప్పారు. తమను బెదిరిస్తున్నారని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement