
ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ (2013) విజేతగా, మోడల్‌గా ‘గూఢచారి, మేజర్’ వంటి తెలుగు చిత్రాలతో, హిందీ ‘రామన్ రాఘవ్ 2.ఓ’ చిత్రంతో, ‘మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్’ వంటి సిరీస్‌లతో... ఇలా శోభితా ధూళిపాళ్ల చాలా పాపులార్టీ సంపాదించుకున్నారు. అయితే హీరో నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ తర్వాత ఒక్కసారిగా వార్తల్లో ట్రెండింగ్‌గా నిలిచారామె.
అందుకు నిదర్శనం ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) తాజాగా రిలీజ్ చేసిన భారతీయ సెలబ్రిటీల జాబితా. ఈ జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచారు. గత వారానికి సంబంధించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ (‘ముంజ్యా’ మూవీ ఫేమ్) తొలి స్థానంలో నిలవగా, శోభిత ద్వితీయ స్థానంలో నిలిచారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి మూడో స్థానం దక్కింది. నాగచైతన్య–శోభితల నిశ్చితార్థం ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు ఆమె గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఈ కారణంగా గత వారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా నిలిచారు శోభిత. ఇక ‘ఐఎండీబీ’ జాబితాలో కాజోల్ నాలుగో స్థానం, జాన్వీ కపూర్ ఐదో స్థానం, బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆరు, దీపికా పదుకోన్ ఏడు, విజయ్ సేతుపతి ఎనిమిది, మృణాల్ ఠాకూర్ తొమ్మిది, ఐశ్వర్యా రాయ్ పదో స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment