ఇంతవరకు చాలామంది పర్యాటకులు నయాగరా జలపాతం అందాలను వీక్షించారు. ఆ దృశ్యాలను ఇంతవరకు పర్యాటకులు దూరం నుంచే వీక్షించారు. ఇక నుంచి చాలా దగ్గర నుంచే కళ్లను కట్టిపడేసే ఆ నయాగరా అందాలను వీక్షించొచ్చు అంటున్నారు అధికారులు. ఈ నయాగరా జలపాతం పర్యాటక కేంద్రంగా చాలా ప్రసిద్ధిగాంచింది. ఐతే జలపాతం కింద ఉన్న 100 ఏళ్ల నాటి సొరంగం పర్యాటక ఔత్సాహికుల కోసం తెరిచారు.
దీంతో ఈ సొరంగం గుండా ఉన్న పవర్‌స్టేషన్ కూడా చూడవచ్చు. కెనడియన్ వైపు శతాబ్దం క్రితం నిర్మించిన 670 మీటర్ల సొరంగం నాటి ఇంజనీరింగ్ అద్భుతాన్ని బహిర్గతం చేస్తోంది. ఇప్పుడు ఈ పవర్ స్టేషన్‌ని కూడా నయగరా పర్యటనలో భాగంగా అందరూ వీక్షించే సువర్ణావకాశం కల్పించారు. 1905 నుంచి 2006 వరకు పనిచేసిన ఈ పవర్‌స్టేషన్ శక్తివంతమైన జెయింట్ జనరేటర్‌తో నయగరా నది నీటిని మళ్లించి ప్రాంతీయ పరిశ్రమను విద్యుద్దీకరించేవారు.
ఈ ప్రాంతం ఒకప్పుడు జలవిద్యుత్‌ను వినియోగించుకోవాలనుకునే వ్యాపారవేత్తల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఒక గాజుతో కప్పబడిన ఎలివేటర్ సదర్శకులను సొరంగంలోకి తీసుకువెళ్తుంది. అక్కడ పర్యాటకులు నయగరా జలపాతం అందమైన దృశ్యాల తోపాటు దిగువన ఉన్న పవర్ స్టేషన్‌ని కూడా చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment