Niagara Falls
-
ఔరా నయాగారా.. చూడరా లిబర్టీ స్టాచ్యూ.!
పౌరులు ఎప్పుడు బయటకు వచ్చినా చిరునవ్వుతో కనబడాలని ఇటలీలోని మిలాన్‌లో చట్టం చేశారట, ఆస్పత్రులు అంత్యక్రియలకు వెళ్లేవారు తప్ప ! అదేమిటో కాని అలాంటి ఏ చట్టమూ లేకున్నా అమెరికన్స్ , వాళ్ళ మనసులో ఏమైనా ఉండనిగాక, కొత్త పాత అనకుండా , మనిషిని చూడగానే ఒక చిరునవ్వు విసరడం వారి సహృదయతను, సంస్కారాన్ని చాటుతుంది. అక్కడి వారిలో ఈ లక్షణం నేను చూసిన ఇటు పసిఫిక్ తీరం లాసంజెల్స్ నుండి గల్ఫ్ అఫ్ మెక్సికో డల్లాస్ మీదుగా అట్లాంటిక్ మహా సముద్రం న్యూయార్క్ వరకు దారి పొడుగునా గమనించాను. ఎప్పుడు అమెరికా వచ్చినా మొక్కుబడిగా సమీప సందర్శనీయ స్థలాలు మాత్రమే చూస్తున్నాం, అలాకాదు ఈసారి ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేద్దామనుకున్నాం. లాస్ఎంజెల్స్ నుంచి ఈస్ట్ కోస్ట్ ట్రిప్‌కు వెళ్లాం. అలా మొదట మేము వెళ్ళింది బఫెలో కు. ఇటు అమెరికా ( న్యూ యార్క్ ) అటు కెనడా ( ఒంటారియా ) ల మధ్య గుర్రపునాడా ఆకారంలోనున్న జలపాతం నయాగరా అందాలను చూసాం. ఇది 167 ఫీట్ల ఎత్తు నుండి ఎక్కువ వెడల్పులో కిందికి జారుతుంటే.. దాన్ని సమీపంగా చూడాలని చిన్న పడవలో వెళ్ళాం, రెయిన్ కోట్ వేసుకున్నా తడిసినంత పనైంది. ఈ జలపాతాన్ని రెండు దేశాల వైపు నుంచి చూడొచ్చు. అమెరికా, కెనడాలను విడదీసేది కూడా నయాగారా జలపాతమే. ఈ నదిపైనే రెయిన్బో అనే బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జిపై నడుచుకుంటూ రెండు దేశాలు దాటేయవచ్చు. అయితే రెండు వైపులా ఎంట్రీ పాయింట్, చెక్ పాయింట్, టోల్ గేట్ ఉంటాయి. చాలా మంది కెనడా వైపు నుంచి చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. కెనడా వైపు నుంచి మరింత ముందుకు.. అంటే జలపాతం చివరి వరకు చూడొచ్చంటారు. పైగా కొండపైనే గుహలను కూడా కెనడా వైపు నుంచి చూసే అవకాశం ఉంది. ఆ రోజు రాత్రి వర్షంలో కారు ప్రయాణం, మధ్యరాత్రి ఎప్పుడో న్యూయార్క్ చేరుకొని హోటల్ హాలిడే ఇన్ లో బస. ఇది మన గుజరాతీ పటేల్ లు నడుపుతున్న హోటల్ కావడం విశేషం. పేరుకు అమెరికానే కానీ.. పటేల్ బ్రదర్స్ స్టోర్లు మనకు దాదాపు అమెరికా అంతటా కనిపిస్తాయి. ఇండియాలో దొరికే ఏ సరుకయినా.. పటేల్ బ్రదర్స్‌లో కనిపిస్తుంది. జండూ బామ్ నుంచి బఠానీల దాకా, పల్లీల నుంచి కొత్తిమీర దాకా కేరాఫ్ పటేల్ బ్రదర్స్. అమెరికాలో గుజరాతీల వ్యాపారం ఎంత పెద్దదంటే.. మనం ఊహించలేనంత పెద్ద టర్నోవర్ నడుస్తుందని అక్కడ సెటిల్ అయిన మనవాళ్లు చెబుతారు. గుజరాతీ వ్యాపారులు చాలా ఇన్ఫ్యూయన్సర్లని పేరు. అందుకే గుజరాతీల ఈవెంట్లలో మేయర్ల నుంచి గవర్నర్ల దాకా అతిథులుగా కనిపిస్తారు. పటేల్ బ్రదర్స్ హోటల్ వాళ్ళే ఏర్పాటు చేసిన బస్‌లో ‘ న్యూయార్క్ టైం స్క్వేర్ ’ వైపు వెళ్ళాం. న్యూయార్క్ యూఎస్‌లోనే ఎక్కువ జనాభా కలిగిన నగరం. దీన్ని ప్రపంచ రాజధాని కూడా అంటార , ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉండడంవల్ల కాబోలు. నాకు దీన్ని చూస్తుంటే అచ్చం మన ముంబైలాగే అనిపించింది, వీధుల్లో జన సంచారం ఎక్కువ, ఇండియన్ రెస్టారెంట్లు కూడా. అయితే ఆధునికత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 1931 లోనే నిర్మించబడిన, ఎన్నిసార్లు పిడుగులు పడ్డా చెక్కు చెదరని, 102 అంతస్తుల ‘ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ’ ఎక్కి న్యూయార్క్ నగర అందాలను చూసాము. మేడం టుస్సాడ్ మ్యూజియం గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్టోబర్1 నాడు కారులో బయలుదేరి ‘లిబర్టీ ఐల్యాండ్’కు వెళ్ళాం. అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వేచ్చా స్వాతంత్రాలకు ప్రతీకయైన, రోమన్ దేవతలావున్న‘ లిబర్టీ స్టాచ్యు ’ చూసాం. ఇది ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టే బర్తోలీ రూపొందించిన 151 అడుగుల ఎత్తయిన శిల్పం, 1886 లో ఫ్రాన్స్ ప్రజల నుండి యూ ఎస్ కు వచ్చిన కానుక. నిజంగానే గొప్ప విగ్రహం అనిపించింది. విగ్రహం కాలి బొటన వేలు మనిషి సైజంతా ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే.. విగ్రహం లోపల ఉండే మెట్ల దారి గుండా తలలోని కిరీటం వరకు ఎక్కొచ్చు. కింది నుంచి లెక్కిస్తే 354 మెట్లు ఎక్కితే తల వరకు వస్తాం. అక్కడి నుంచి మరో 192 మెట్లు ఎక్కితే చివరి వరకు చేరుకుంటాం. తలకున్న కిరీటంలో 25 కిటీకీలున్నాయి. ఈ భూమి మీద ఉన్న 25 అత్యంత విలువైన అణిముత్యాలను దృష్టిలో పెట్టుకుని 25 కిటీకీలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు కిరీటం నుంచి ఏడు కాంతి రేఖలు కనిపిస్తాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో ఖండాన్ని ప్రతిబింబిస్తాయి ‘ఎల్లిస్ ఐ ల్యాండ్ ’ ఒకప్పటి యూఎస్ ఎంట్రీ పోర్ట్. 1892 నుండి 1954 వరకు దాదాపు 12 మిలియన్ల మంది వలసదారులు యూఎస్ లో అడుగు పెట్టింది ఇక్కడి నుండే. ఇక్కడున్న ఇమ్మిగ్రేషన్ జాతీయ మ్యూజియం చరిత్ర పై ఆసక్తి వున్నవారు తప్పనిసరి చూడాల్సింది. గాంధీజయంతి రోజు మేము వాషింగ్టన్ డి సి చేరుకున్నాము. ప్రపంచంలో శాంతి అయినా ఆశాంతి అయినా అది మాచేతిలో పని అని విర్రవీగే అగ్రరాజ్యం అమెరికా రాజధాని నగరం అది. చూడడానికి మాత్రం విశాలమైన రోడ్లు , అందమైన భవనాలతో ప్రశాంతంగా కనబడింది. ప్రపంచ స్థాయి వ్యూహాలకు నిలయమైన ఆ దేశ అధ్యక్షులవారి అధికారిక నివాసం ‘వైట్ హౌస్ ’ అనబడే శ్వేత సౌధం ఉన్నది వాషింగ్టన్ డి సి లోనే. మేము దాన్ని బయటి నుండే చూసి అక్కడి నుండి బయటపడ్డాం. వైట్ హౌజ్ అందాలను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే జులై 4న ఇండిపెండెన్స్‌డే రోజున చూడాలి. ఆ రోజు రాత్రి అద్భుతమైన రీతిలో బాణా సంచా కాల్చి కనువిందు చేస్తారు. యూఎస్ ‘ పార్లమెంట్ హౌస్ ’ చూసాం , అప్పుడు జరుగుతున్న 112 వ కాంగ్రెస్ సెనెట్ సమావేశాలు సెనెటర్ పాస్ కూడా సంపాదించి సందర్శకుల గ్యాలరీ నుండి చూశాం, అక్కడ సెక్యూరిటీ చాలా పకడ్బంధిగా వున్నా మాకేమి ఇబ్బంది కలగలేదు. అక్కడి నుంచి మా కారు పిట్స్ బర్గ్ గుట్ట మీదున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వైపు మళ్ళింది . సరిగ్గా స్వామివారి దర్శన సమయానికి మేము అక్కడికి చేరుకోగాలిగాము. ఈ ఆలయం గురించి మరో కథనంలో రాస్తాను. వేముల ప్రభాకర్ (చదవండి: US: ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి!) -
గడ్డకట్టిన నయాగరా జలపాతం.. అద్భుత దృశ్యాలు
న్యూయార్క్: అమెరికాలో మంచు తుపాను(Bomb cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరుగనటువంటి చలి గాలులు, విపరీతంగా కురుస్తోన్న మంచు ధాటికి దేశమంతా అతలాకుతలమైంది. 4వేలకుపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా 60 మందికిపైగా మరణించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ముఖ్యంగా న్యూయార్క్, బఫెలో కౌంటీలో నెలకొన్న దుర్భర పరిస్థితులను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చిత్రాలు, వీడియోలు చూపుతున్నాయి. బఫెలో కౌంటీలో వాహనాల్లోనే గడ్డకట్టుకుపోయి మరణించిన సంఘటనలూ ఉన్నాయి. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. దీంతో నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. దీంతో పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. అయితే, నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నయాగరా ఫాల్స్ న్యూయార్క్ స్టేట్ పార్క్ ప్రకారం ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు జలపాతం నుంచి పడుతుంది. ఈ నీరు ప్రతి సెకనుకు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాల్లో నయాగరా నదిపై మంచు గడ్డకడుతుందని అధికారులు తెలిపారు. ఇలా మంచుతో ఏర్పడిన బ్రిడ్జ్‌పై నడవటాన్ని నిషేధించారు. 1912, ఫిబ్రవరి 4 నయాగరా నదిపై ఏర్పడిన మంచు వంతెనపైకి వెళ్లి ముగ్గురు చనిపోయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. The day after the great freeze, my family and I went to #NiagraFalls. The #NiagraRiver below it had ice thick enough for you *to technically* get to #Buffalo, #NewYork by foot! Was it an intriguing and surreal Arctic experience for a kid from California, yes! pic.twitter.com/MAC8IIfjZc — Escondido Weather Observer (CoCoRaHs: CA-SD-197) (@KCAESCON230) December 23, 2022 ఇదీ చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం -
నయగరా జలపాతం కింద 100ల ఏళ్ల నాటి సొరంగం
ఇంతవరకు చాలామంది పర్యాటకులు నయాగరా జలపాతం అందాలను వీక్షించారు. ఆ దృశ్యాలను ఇంతవరకు పర్యాటకులు దూరం నుంచే వీక్షించారు. ఇక నుంచి చాలా దగ్గర నుంచే కళ్లను కట్టిపడేసే ఆ నయాగరా అందాలను వీక్షించొచ్చు అంటున్నారు అధికారులు. ఈ నయాగరా జలపాతం పర్యాటక కేంద్రంగా చాలా ప్రసిద్ధిగాంచింది. ఐతే జలపాతం కింద ఉన్న 100 ఏళ్ల నాటి సొరంగం పర్యాటక ఔత్సాహికుల కోసం తెరిచారు. దీంతో ఈ సొరంగం గుండా ఉన్న పవర్‌స్టేషన్ కూడా చూడవచ్చు. కెనడియన్ వైపు శతాబ్దం క్రితం నిర్మించిన 670 మీటర్ల సొరంగం నాటి ఇంజనీరింగ్ అద్భుతాన్ని బహిర్గతం చేస్తోంది. ఇప్పుడు ఈ పవర్ స్టేషన్‌ని కూడా నయగరా పర్యటనలో భాగంగా అందరూ వీక్షించే సువర్ణావకాశం కల్పించారు. 1905 నుంచి 2006 వరకు పనిచేసిన ఈ పవర్‌స్టేషన్ శక్తివంతమైన జెయింట్ జనరేటర్‌తో నయగరా నది నీటిని మళ్లించి ప్రాంతీయ పరిశ్రమను విద్యుద్దీకరించేవారు. ఈ ప్రాంతం ఒకప్పుడు జలవిద్యుత్‌ను వినియోగించుకోవాలనుకునే వ్యాపారవేత్తల కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఒక గాజుతో కప్పబడిన ఎలివేటర్ సదర్శకులను సొరంగంలోకి తీసుకువెళ్తుంది. అక్కడ పర్యాటకులు నయగరా జలపాతం అందమైన దృశ్యాల తోపాటు దిగువన ఉన్న పవర్ స్టేషన్‌ని కూడా చూడవచ్చు. (చదవండి: చిన్నారిని వీపుకి తగిలించుకున్న బాలుడెవరో తెలుసా!) -
టూరిస్ట్ ప్రాంతంగా మారిన పెన్నఅహోబిలం
-
StayStrongIndia: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం
కరోనా ధాటికి గజగజ వణుకుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు తమకు తోచిన విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయి. సహాయం చేస్తూనే మరో పక్క భారత్ ధైర్యం ఉండు.. కోలుకో అంటూ సందేశాలు పంపిస్తున్నాయి. ఇటీవల బూర్జ్ ఖలీఫాపై భారత జెండా రెపరెపలు ఆడించి ‘భారత్ కోలుకో’ అంటూ సందేశం ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతం... పాలనురుగులు కక్కుతూ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే నయాగార రంగు మారింది. కెనడాలోని ఒంటరియో వద్ద ఉన్న నయాగార జలపాతం భారత జెండా రంగులు అద్దుకుంది. తెల్లగా కనిపించే నయాగారా కాస్త త్రివర్ణ శోభితంగా మారింది. కరోనాతో తీవ్రంగా సతమతమవుతున్న భారత్‌కు ధైర్యం చెప్పేలా ఈ విధంగా కెనడా అధికారులు ఈ విధంగా నయాగారాపై భారత రంగులు వచ్చేలా లైటింగ్ వేశారు. కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సంఘీభావం తెలిపేందుకు ఏప్రిల్ 28వ తేదీ రాత్రి 9.30 నుంచి 10 గంటల వరకు భారత జెండాలోని మూడు రంగులు ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు రంగులు వచ్చేలా లైటింగ్ వేశారు. దీంతో నయాగారా త్రివర్ణ శోభితంతో అద్భుతంగా కనిపించింది. ‘ధృడంగా ఉండు భారత్ (స్టేస్ట్రాంగ్ ఇండియా)’ అంటూ సందేశం పంపారు. చదవండి: ఆక్సిజన్ అందక కర్నూలులో ఐదుగురు మృతి India is currently facing a surge in cases and losses of life resulting from COVID-19. In a display of solidarity and hope for India, Niagara Falls will be illuminated tonight from 9:30 to 10pm in orange, white and green, the colours of the flag of India. #StayStrongIndia pic.twitter.com/o0IIxxnCrk — Niagara Parks (@NiagaraParks) April 28, 2021 -
తెలంగాణ ‘నయాగరా’
సాక్షి, ఆసిఫాబాద్: చుట్టూ అడవి.. కొండల నుంచి జాలువారే జలపాతాలు.. పాలనురుగును తలపించే నీళ్లు.. దిగువకు దూకుతున్న జల సవ్వడులు.. రెప్పకూడా వేయకుండా తనివితీరా చూడాలనిపించే ప్రకృతి సోయగాలు.. ఫొటో చూస్తుంటేనే అదిరిపోతోంది.. నిజంగా అక్కడకు వెళ్లి చూస్తే తన్మయత్వంతో మైమరచిపోవడం ఖాయం అనిపిస్తోంది కదూ! మరి ఇంతటి అందమైన.. మినీ నయాగరాలా కనిపిస్తున్న ఈ జలపాతం ఎక్కడుందో తెలుసా? అచ్చంగా మన గడ్డ మీదే..! చదవండి: జలపాతాల కనువిందు మనసు దోచే జలపాతాలు, హృదయం పులకరించే ప్రకృతి సోయగాలు చూడాలంటే ఇకపై మనం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. దర్జాగా మన గడ్డపైనే వాటిని చూస్తూ తన్మయత్వంతో మైమరచిపోవచ్చు. మదిని కట్టిపడేస్తూ కనువిందు చేస్తున్న ఈ అందాలు.. మన కుమురంభీం జిల్లాలోనే ఉన్నాయి. లింగాపూర్ మండల సమీపంలో ఈ జలపాతాలు హోయలొలికిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. సప్తగుండాలుగా పిలిచే ఏడు జలపాతాలు మదిని పులకరింపజేస్తున్నాయి. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రామ గుండం, సీత గుండం, లక్ష్మణ గుండం, భీమ గుండం, సవితి గుండం, చిరుతల గుండం, సప్తగుండం అనే ఏడు గుండాలను కలిపి మిట్టె జలపాతం అని పిలుస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద చేరడంతో ఎత్తైన కొండల నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తోంది. కుమురంభీం జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని గతంలో పనిచేసిన కలెక్టర్ చంపాలాల్ సందర్శించడంతో మరింత వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరజిల్లాల్సిన ఈ ప్రదేశం.. సరైన రోడ్డు మార్గం లేకపోవడంవల్ల ప్రాచుర్యం సంతరించుకోలేకపోతోంది. ఇవే కాకుండా ఈ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనేక జలపాతాలు ఉన్నా ఇన్నాళ్లూ అవి బాహ్య ప్రపంచానికి పరిచయం కాలేదు. -
మంచు కొండలా మారిన నయాగరా
-
భౌగోళిక అద్భుతం నయాగరా...
విదేశాలలో! ప్రపంచంలోనే భౌగోళికంగా ప్రసిద్ధి చెందిన నయాగరా జలపాతం కెనడా, అమెరికా దేశాల సరిహద్దులో ఉంది. 167 అడుగుల ఎత్తు నుంచి జలపాతం కొండపై నుంచి కిందికి పడుతుండే దశ్యం మనోహరం. న్యూయార్క్ రాష్ర్టంలోని బఫెల్లో పట్టణానికి సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లను చేసింది. ఒకే సమయం లో కెనడా, అమెరికా దేశాల ప్రజలు, టూరిస్టులు సందర్శించేందుకు భారీ ఏర్పాట్లున్నాయి. కెనడాలోని హార్షూ జలపాతం, నయాగరా జలపాతం పక్క పక్కనే ఉన్నాయి. అయితే విస్తీర్ణంలో హార్షూ జలపాతం కంటె నయాగరానే పెద్దది. నయాగర జలపాతాన్ని అతి సమీపం నుంచి పడవలోనూ, సొరంగమార్గం ద్వారా సందర్శించవచ్చు. పడవలో 17 డాలర్లు, సొరంగమార్గంలో వెళ్లేందుకు 12 డాలర్లు చెల్లించాలి. నయాగరాను సందర్శించేందుకు మెయిడ్ మిస్త్ నుంచి కిందికి లిఫ్ట్‌లో వెళ్లాలి. పడవలోకి వెళ్లే ముందు సందర్శకులకు రెయిన్‌కోట్ ఇస్తారు. పడవ కెనడాలోని హార్స్‌షూ జలపాతం దగ్గరగా వెళుతుంది. అ సమయంలో పై నుంచి దుముకుతున్న జలపాతాన్ని అతి సమీపం నుంచి తిలకించడం జీవితంలో మరపురాని అనుభూతిగా మిగులుతుంది. అక్కడ నుంచి పడవ నయాగరా జలపాతం వైపు మళ్లుతుంది. అక్కడ సాయంత్రం సూర్యకిరణాలు పడడం వల్ల ఇంధ్రదనుస్సు సందర్శకులకు కనువిందు చేస్తుంది. కెనడా వైపు నుంచి వచ్చే సందర్శకులకు ఎర్ర రంగు రెయిన్‌కోట్, అమెరికా వైపు నుంచి వచ్చే వారికి నీలిరంగు రెయిన్‌కోట్ ఇస్తారు. అమెరికా సరిహద్దు నుంచి కెనడాలోని భవనాలు, రోడ్లు, కార్లు, ఇతర దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. నయాగరా జలపాతం అడుగు భాగానికి చేరుకునేందుకు కొండ ను చీల్చి సొరంగ మార్గం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలోకి వెళ్లేందుకు నయాగర నది పై నిర్మించిన వంతెన దాటి అవతలి వైపుకు వెళ్లాలి. ఈ మార్గంలో వెళ్లే సందర్శకులకు జారిపడిపోకుండా ప్రత్యేకమైన పాదరక్షలు ఇస్తారు. ఆ మార్గం దాటి వెళ్లే దారిలో తెల్లని పక్షులు స్వాగతం పలుకుతాయి. పక్షులను దాటి మెట్ల మార్గం ద్వారా నది సమీపంలోకి వెళ్లి, అక్కడ నుంచి జలపాతం పడుతున్న ప్రాంతాన్ని అతి సమీపం నుంచి చూడవచ్చు. రాత్రి పూట జలపాతం నీరు నీలి, ఎరుపు, పసుపు రంగుల్లో తిలకించవచ్చు. - జి.గంగాధర్ -
గడ్డకట్టుకుపోయిన నయాగరా జపాతం