ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన సహారా ప్రాంతం.. ఎడారిగా మారడానికి కారణం మానవుడి చర్యలేనని పరిశోధకులు తెలిపారు.
సియోల్: ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన సహారా ప్రాంతం.. ఎడారిగా మారడానికి కారణం మానవుడి చర్యలేనని పరిశోధకులు తెలిపారు. సహారా ఎడారిగా రూపాంత రం చెందడానికి కారణాలను తెలుసు కునేం దుకు గతంలో అనేక పరిశోధనలు జరిగాయి. భూమి కక్ష్యలో మార్పు వల్ల సహారా ఎడారిగా మారి ఉండవచ్చని గతంలో అనేక అధ్యయనాల్లో పేర్కొన్నారు. కానీ అవన్నీ అవాస్తవాలు అని దక్షిణ కొరియాలోని సియోల్ యూనివర్సి టీకి చెందిన పురాతత్వవేత్త డేవిడ్ రైట్ పేర్కొన్నారు.
దాదాపు 8 వేల సంవత్స రాల క్రితం నవీన శిలా యుగం సమయంలో ఆదిమ మానవుడు తీసుకొచ్చిన వ్యవసాయ ఆవిష్కరణలు అక్కడి వాతావరణంపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. అక్కడి భూభాగంపై ఉన్న గడ్డి జాతులను పశుగణాల ఆహారం కోసం, తన ఆహారం కోసం అప్పటి ఆదిమ మానవుడు వినియోగించుకున్నా డని తెలిపారు. తద్వారా అక్కడ పచ్చదనం తగ్గిపోయి, వాతావరణం వేడిగా మారి, రుతుపవనాలు లేకపోవడంతో వర్షపాతం తగ్గిపోయిందని తెలిపారు. రుతుపవనాలు బలహీనపడటంతో క్రమక్రమంగా సహారాలో పచ్చదనం అంతరించి, ఎడారిగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు.