Seoul National University
-
నిద్ర ఎక్కువైనా, తక్కువైనా సమస్యలే!
సియోల్: మానవుడికి ఆహారం తరువాత అత్యంత ఆవశ్యకమైనది నిద్ర. ఏ మనిషికైనా 8 గంటల కనీస నిద్ర అవసరం. అదే సమయంలో అతినిద్ర, నిద్రలేమితో సమస్యలు తప్పవని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఒక రోజులో 10గంటలకు మించి నిద్రపోవడం, ఆరుగంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండెవ్యాధులు, డయాబెటిస్ సమస్యలు చుట్టుముడతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటివారిలో మెటబాలిక్ సిండ్రోమ్‌లు ఏర్పడటం, నడుము చుట్టుకొలత పరిమితికి మించి పెరుగడం గమనించవచ్చని దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అతినిద్ర, నిద్రలేమి కారణంగా పురుషులలో ట్రైగ్లిసరైడ్స్, గ్లూ్లకోజ్ స్థాయిలు పెరుగుతాయి. మహిళల్లో వీటితో పాటు హెచ్‌డీఎల్ స్థాయిలను తగ్గిస్తుందట. వీటికారణంగా గుండె, షుగరు వ్యాధుల బారిన పడతారని స్పష్టం చేశారు. 2004–2013 మధ్యకాలంలోని కొరియన్ల మెడికల్ హిస్టరీని విశ్లేషించి ఈ ఫలితాలు వెల్లడించారు. -
మానవుడి వల్లే ఎడారిగా సహారా!
సియోల్: ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన సహారా ప్రాంతం.. ఎడారిగా మారడానికి కారణం మానవుడి చర్యలేనని పరిశోధకులు తెలిపారు. సహారా ఎడారిగా రూపాంత రం చెందడానికి కారణాలను తెలుసు కునేం దుకు గతంలో అనేక పరిశోధనలు జరిగాయి. భూమి కక్ష్యలో మార్పు వల్ల సహారా ఎడారిగా మారి ఉండవచ్చని గతంలో అనేక అధ్యయనాల్లో పేర్కొన్నారు. కానీ అవన్నీ అవాస్తవాలు అని దక్షిణ కొరియాలోని సియోల్ యూనివర్సి టీకి చెందిన పురాతత్వవేత్త డేవిడ్ రైట్ పేర్కొన్నారు. దాదాపు 8 వేల సంవత్స రాల క్రితం నవీన శిలా యుగం సమయంలో ఆదిమ మానవుడు తీసుకొచ్చిన వ్యవసాయ ఆవిష్కరణలు అక్కడి వాతావరణంపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. అక్కడి భూభాగంపై ఉన్న గడ్డి జాతులను పశుగణాల ఆహారం కోసం, తన ఆహారం కోసం అప్పటి ఆదిమ మానవుడు వినియోగించుకున్నా డని తెలిపారు. తద్వారా అక్కడ పచ్చదనం తగ్గిపోయి, వాతావరణం వేడిగా మారి, రుతుపవనాలు లేకపోవడంతో వర్షపాతం తగ్గిపోయిందని తెలిపారు. రుతుపవనాలు బలహీనపడటంతో క్రమక్రమంగా సహారాలో పచ్చదనం అంతరించి, ఎడారిగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. -
మొబైల్లో త్రీడీ వీడియోలు..
సియోల్: త్రీడీ ఎఫెక్ట్స్‌తో రూపొందించిన సినిమాలను చూసేందుకు త్రీడీ కళ్లద్దాలు కావాలి. కానీ త్వరలోనే ఎటువంటి ప్రత్యేక పరికరాలు కళ్లకు ధరించాల్సిన అవసరం లేకుండానే నేరుగా మన కళ్లతోనే వీక్షించేలా తెరలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. మొదటగా ఈ రకం తెరలను మొబైల్ ఫోన్స్‌లో ఉపయోగించనున్నారు. ఈ కొత్త రకం తెరల ద్వారా 2డీ, త్రీడీ వీడియోలను వీక్షించవచ్చని వారు పేర్కొంటున్నారు. చిత్రానికి సంబంధించిన పిక్సల్స్, కాంతిని అనుసంధానం చేయడం ద్వారా ఇది సాధ్యమయిందని వారు తెలిపారు. ఈ రెండింటి అనుసంధానానికి గాను మెక్రో లెన్స్‌గా పిలిచే లెంటిక్యూలర్ లెన్స్గానీ, మెక్రోఫిల్టర్స్గా పిలిచే పార్లాక్స్ బ్యారియర్‌ను తెరకు ముందు అమర్చాలని దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ వర్సిటీ ప్రొఫెసర్ సిన్ డూ లీ చెప్పారు.