మొబైల్‌లో త్రీడీ వీడియోలు..
సియోల్: త్రీడీ ఎఫెక్ట్స్‌తో రూపొందించిన సినిమాలను చూసేందుకు త్రీడీ కళ్లద్దాలు కావాలి. కానీ త్వరలోనే ఎటువంటి ప్రత్యేక పరికరాలు కళ్లకు ధరించాల్సిన అవసరం లేకుండానే నేరుగా మన కళ్లతోనే వీక్షించేలా తెరలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. మొదటగా ఈ రకం తెరలను మొబైల్ ఫోన్స్‌లో ఉపయోగించనున్నారు.
ఈ కొత్త రకం తెరల ద్వారా 2డీ, త్రీడీ వీడియోలను వీక్షించవచ్చని వారు పేర్కొంటున్నారు. చిత్రానికి సంబంధించిన పిక్సల్స్, కాంతిని అనుసంధానం చేయడం ద్వారా ఇది సాధ్యమయిందని వారు తెలిపారు. ఈ రెండింటి అనుసంధానానికి గాను మెక్రో లెన్స్‌గా పిలిచే లెంటిక్యూలర్ లెన్స్‌గానీ, మెక్రోఫిల్టర్స్‌గా పిలిచే పార్లాక్స్ బ్యారియర్‌ను తెరకు ముందు అమర్చాలని దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ వర్సిటీ ప్రొఫెసర్ సిన్ డూ లీ చెప్పారు.