
మేఘా ఆకాశ్
కొన్నిసార్లు మనసుకి నచ్చిన పాత్రలు చేసినప్పుడు డబ్బింగ్ వేరే వాళ్లు చెబితే నటిగా తమకు పరిపూర్ణత ఉండదని ఫీల్ అవుతుంటారు హీరోయిన్లు. అందుకే వాళ్ల పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకుంటుంటారు. మేఘా ఆకాశ్ కూడా ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకున్నారు. అధర్వ మురళి, మేఘా ఆకాశ్ జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘బూమర్యాంగ్’.
ఈ సినిమాలో మేఘ బాగా నటించారని, వేరేవాళ్లు డబ్బింగ్ చెబితే ఆ కంప్లీట్‌నెస్ పోతుందేమోనని దర్శకుడు కన్నన్ భావించారట. దాంతో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు మేఘ. ‘‘డబ్బింగ్ చెప్పడం సరదాగా అనిపించింది’’ అన్నారు మేఘ. నిజానికి మేఘ మాతృభాష తమిళ్. మరి.. మదర్ టంగ్‌లో డబ్బింగ్ చెబితే విశేషం ఏంటి అంటున్నారా? కొందరు నాయికలు మాతృభాషలో కూడా సొంత గొంతు వినిపించరు. వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment