బూమరాంగ్ చిత్రం జనరంజకంగా ఉంటుందని ఈ చిత్ర కథానాయకుడు అధర్వ పేర్కొన్నారు. ఈయనకు జంటగా ఇందుజా, మేఘాఆకాశ్ నటించారు. దర్శకుడు ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. రథన్ సంగీతాన్ని, సెల్వ ఛా యాగ్రహణం అందించిన ఈ చిత్రం 8న తెరపైకి రావడానికి ముస్తాబైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఆర్.కన్నన్ మాట్లాడుతూ.. ఒక చిత్రం అనుకున్న విధంగా రూపొందించాలంటే హీరో సహకారం అవసరం అన్నారు. అలా ఈ చిత్రానికి నటుడు అధర్వ బలంగా నిలిచారని అన్నారు. అందుకే తాను అధర్వతో మరో చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. బూమరాంగ్ చిత్రానికి సహకారాన్ని అందించిన పంకజ్ మెహతా, అన్భుచెలియన్, రాంప్రసాద్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. బూమరాంగ్ చిత్రాన్ని మంచి తేదీలో విడుదల చేయడానికి సహకరించిన ట్రైడెంట్స్ ఆర్ట్స్ రవీంద్రన్‌కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని దర్శక నిర్మాత ఆర్.కన్నన్ అన్నారు.
చిత్ర కథానాయకుడు అధర్వ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభించామో, ఎప్పుడు పూర్తి చేశామో తెలియలేదన్నారు. అంతవేగంగా బూమరాంగ్ చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు. బూమరాంగ్ అంటే కర్మ అని అర్థం అని, మనం ఏం చేశామో అదే మనకు తిరిగి వస్తుందని అన్నారు. ఈ చిత్రం కోసం ప్రచార బృందం అంటూ ఏమీ ఉండదన్నారు. ఈ చిత్రాన్ని తాము అంతా కలిసి జనరంజకంగా రావడానికి శ్రమించి పని చేశామని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నటించిన మేఘాఆకాశ్, ఇందుజా ఇద్దరూ తమిళ భాష తెలిసిన నటీమణులనీ, వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందనీ అధర్వ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment