స్ఫూర్తి ప్రదాతలు
ఇన్ బాక్స్
మారుతున్న జీవనశైలితోపాటు మనుషుల్లో కూడా మానవత్వం ఉం దని నిరూపించే జీవన దానం ఒక గొప్ప ఆదర్శమని రుజువు చేసిన మణికంఠ అనే డ్రైవర్ నేడు తెలుగువారికి స్ఫూర్తిదాతగా నిలిచారు. తాను చనిపోతూ కూడా ఐదుగురు ఆపన్నులకు ప్రాణదానం చేయ డాన్ని జాతి మొత్తం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి చివరి నిమిషంలో కూడా తోడ్పాటు నందించాలని భావించే ఈ ఉత్కృష్ట గుణంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. వందల కిలో మీటర్ల దూరం నుంచి అవయవాలను శరవేగంగా తరలించి సంబం ధిత ఆసుపత్రికి చేర్చడంలో పోలీసులు నిర్వహిస్తున్న పాత్ర అత్యంత కీలకం. అవయవ దానం చేయడం ఒక వంతు అయితే, దాన్ని నిర్దిష్ట సమయంలో అవసరమైన రోగులకు అందించడంలో పోలీసులు అంది స్తున్న సేవలు అమోఘం. యశోదా ఆసుపత్రిలో ఇటీవల ఇలాగే గుండె చికిత్సను సకాలంలో నిర్వహించడం ప్రతి ఒక్కరినీ కదిలించింది. మన దేశం ఖర్మకొద్దీ వీఐపీల సేవల్లోనే మునిగిపోతున్న పోలీసుల పట్ల ప్రజ లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నా, ఇలాంటి మానవీయ అంశాల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టడం వారిపై సదభిప్రాయాన్ని పెంచు తోంది. ఎంతోమంది మణికంఠలు ముందుకు రావాలి. ఎందుకంటే ఆపత్కాలంలో నిజమైన సహాయాన్ని అందించేది పేదలే. వీరే మానవ లోకంలో మణిదీపాలు.
శొంఠి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్
మృత్యుంజయ యాగమా?
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మహామహులంతా వరుసగా కాలం చేయడం టాలివుడ్‌కి అరిష్టంగా భావిస్తూ కళాకారుల క్షేమం కోసం, మృత్యుంజయ యాగం నిర్వహించనున్నట్లు ఇటీవల నటుడు మురళీ మోహన్ ప్రకటించారు. చిత్రపరిశ్రమలో ఆకస్మిక మరణాలను నియం త్రించడానికి పరిపూర్ణానందస్వామి వారిచేత మనుషు లను సజీవులుగా ఉంచే యాగం చేయాలన్నది వీరి లక్ష్యం. సినీ ప్రముఖుల మరణాలకు అసలు కారణాలు మరొక చోట ఉండగా మృత్యుంజయ యాగాలతో ఆ మర ణాలను ఆపివేయాలనుకోవడమే హాస్యాస్పదం. చిత్ర సీమలో నటీనటులు తమ మేకప్ కోసం నిత్యం ఉపయోగి స్తున్న రసాయనాల ప్రభావం, ఆహార నియమాలు ఏమాత్రం పాటించ కపోవటం, మాదక ద్రవ్యాలు, మద్యం అతిగా సేవించడం, వేళా పాళా లేని షెడ్యూళ్ల భారం వంటివి టాలివుడ్‌లో ఆకస్మిక మరణాలను బాగా పెంచుతున్నాయి. పైగా హైదరాబాద్ వాసులు హుస్సేన్‌సాగర్ నీటితో పండించిన పంటలు ఉపయోగించడం, భారీ పరిశ్రమలు విడుదల చేస్తున్న విషవాయువుల వలన కాలుష్యం కోరల్లో చిక్కి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. హుస్సేన్ సాగర్ నీటిని ప్రక్షాళన చేసే కార్యక్రమం ఎంత త్వరగా పూర్తి చేస్తే మహానగరంలో ప్రజల ఆరోగ్యానికి అంతగా భరోసా ఉంటుంది.
ఎ.వై. శెట్టి సీనియర్ సిటిజన్, పత్తిపాడు
అపరిశుభ్రతకు ఆవాసాలు
జంటనగరాల్లో ఆర్టీసీ బస్టాండ్‌లు మహత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుక్ నగర్ ఇలా అవీ ఇవీ అనే తేడా లేకుండా అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. నిత్యం వేలాది మంది ప్రయాణీకులతో రద్దీగా ఉండేచోట మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపు గొడుతున్నా పట్టించుకునే నాధు లులేరు. ఆ మరుగుదొడ్లు ఉపయోగిస్తే రోగాలు రావడం ఖాయం. అటువైపుగా వెళ్లాలంటేనే ప్రయాణికులు ముక్కుమూసుకుని వెళ్లవల సిన పరిస్థితి దాపురించంది. మరి ఆర్టీసీ అధికారులు ఏం చేస్తున్నట్లు? ఇక తినుబం డారాల స్టాల్స్ విషయం చెప్పే పనిలేదు. ఇష్టం వచ్చిన రేట్లతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు మాత్రం పండుగ పబ్బం అంటూ రెట్టింపు చార్జీలు వడ్డిస్తూ ప్రయాణి కుల నడ్డి విరవడం సమంజసమా? బస్టాండులలో ఈ అసౌకర్యం పట్ల ఒక్క అధికారి కానీ, సంబంధిత మంత్రి కానీ నిలదీసిన పాపాన పోలేదు. ఇక భద్రత విషయం అంతంత మాత్రమే. ఏ ఇద్దరూ ముగ్గురూ పోలీసులు అక్కడ తచ్చాడుతుంటారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం హడావుడి చేయడం. మళ్లీ సద్దుమణగటం షరా మామూలే. ఆకస్మిక తనిఖీలను అధికారులు చేపడుతున్నారో లేక చూసీ చూడనట్లు ఊరకుంటున్నారో తెలియని పరిస్థితి. వేలాది ప్రయాణికు లకు నిత్యం కలుగుతున్న ఈ అసౌకర్యాల పట్ల ఇకనైనా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవాలని విన్నపం.
శిష్ట్లా అన్నపూర్ణ చందానగర్, హైదరాబాద్