కన్నబిడ్డలు కాలదన్నారు
పోరుమామిళ్ల : ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుని పేరు బడిగించల సుబ్బన్న. ఊరు ప్రొద్దుటూరు. ఇతను గతంలో మగ్గం నేసేవాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. అందరికీ వివాహాలు చేశాడు. వయసు మీద పడటంతో ఏపనీ చేయలేక ఇంటి వద్దే ఓ బంకు పెట్టుకుని జీవిస్తుండగా దాన్ని రెండో కుమారు డు వెంకటసుబ్బయ్య స్వాధీనం చేసుకున్నాడు. కొడుకు, కోడలు కలిసి సుబ్బన్నను గెంటేశారు. పెద్ద కొడుకు శివయ్య మైలవరం మండలం వేపరాలలో మగ్గం నేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు. ఇక మూడో కుమారుడు మణికంఠ కూడా కడపలో ఉంటున్నాడు.
అతను కూడా తండ్రి బాగోగులు పట్టించుకోలే దు. తన కంటే ఇద్దరు పెద్దవాళ్లు ఉండగా వారికి పట్టం ది తనకెందుకు అని కరాఖండిగా చెప్పేశాడు. అంతటితో ఆగకుండా తండ్రిని తీసుకెళ్లి నాలుగు రోజుల క్రి తం కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో వది లేసి వెళ్లాడు. అతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొందరి సాయంతో సోమవారం రాత్రి పోరుమామిళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. తనకు ముగ్గురు కొడుకులున్నా ఎవరూ తనకు అన్నం పెట్టడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. తన భార్య మాత్రం నెల్లూరులో చిరువ్యాపారం చేసుకుంటున్న తన కూతురు లక్ష్మిదేవి వద్ద ఉంటోందని చెప్పాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఆసుపత్రి నుంచి డిస్చార్జి అయిన సుబ్బన్నకు ఎటు వె ళ్లాలో దిక్కుతోచలేదు. తనను ఎక్కడైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి అని అక్కడున్న వారిని ప్రాధేయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న జ్ఞాన సరస్వతి దేవి ట్రస్టు ప్రతినిధి శ్రీనివాసులు తమ సంస్థ సభ్యులతో కలిసి వృద్ధుడిని తీసుకెళ్లి కడపలోని గుడ్‌హార్ట్ ఫౌండేషన్‌లో చేర్చాడు. కన్నబిడ్డలు కాలదన్నినా తన స్థితిని చూసి స్పందించి వృద్ధాశ్రమంలో చేర్పించిన యువకులకు అతను కృతజ్ఞతలు తెలిపాడు.