పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులో విషాదం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు..చివరికి చెరువులో శవాలై తేలారు.
అత్తిలి : పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులో విషాదం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు..చివరికి చెరువులో శవాలై తేలారు. దుళ్ళ గ్రామానికి చెందిన వేల్పూరు రాంబాబు కుమారుడు మణికంఠ, తణుకు మండలం వేల్పూరుకు చెందిన కోటి చుక్కల నాగేంద్ర కుమార్ ఇద్దరు కుమార్తెలు పావని దుర్గ మహాలక్ష్మి, పల్లవిలు సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికి వచ్చారు.
వీరంతా దగ్గరలోని గుడి దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళనతో కుటుంబసభ్యుల వెతికారు. అయినా ఫలితం లేకపోవటంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు జరుపుతుండగనే..చిన్నారుల శవాలు చెరువులో లభ్యం కావడంతో వారి తల్లిదండ్రులు ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఇప్పటివరకూ ఓ చిన్నారి మృతదేహం వెలికి తీయగా, మిగతా ఇద్దరి మృతదేహాలు వెలికి తీస్తున్నారు.