సింగర్ చిన్మయి పేరు వినని సినీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. దక్షిణాదిలో ఆమె గాత్రాన్ని ఆస్వాదిచని సంగీత ప్రేమికులు కూడా ఉండరు. అయితే ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిని ఉవ్వెతున ప్రచారం చేశారు. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తు లాంటి వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ మహిళల తరఫున ధైర్యంగా నిలబడ్డ మనిషి చిన్మయి. తాజాగా ఈ గాయని తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్‌పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో చిన్మయి చీర కట్టు ఉంది. అయితే చీర కట్టిన విధానం వల్ల ఆమె బేబి బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో చిన్మయి గర్భవతి అని, ఆమె తమ తొలి బిడ్డకు త్వరలో జన్మనివ్వబోతుందని నెట్టింట్లో, యూట్యూబ్‌లో పుకార్లు రేగాయి. రూమర్స్‌పై స్పందించిన చిన్మయి.. తను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సుధీర్ఘ పోస్టు పెట్టారు.
Wishing my babies @subiksharaman and @Rohit_Ravindran an amazing life together 😍😍❤️ pic.twitter.com/h2FLZ6Mr18
— Rahul Ravindran (@23_rahulr) July 1, 2021
‘ఇది మా పెళ్లి ఫోటో. ఇందులో నేను మడిసార్ ధరించారు. దాన్ని క్యారీ చేయడంలో నాకు సమస్యలు ఉన్నాయి. మడిసార్ కారణంగా నా ఉదరం పెద్దదిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నేను గర్భవతిని కాదు. చిన్మయి బేబీ బంప్ అంటూ యూట్యూబ్ ఛానల్స్ తప్పుగా పెట్టిన ఫోటోలను నేను ఈ రోజు చూశాను. వీటితో విసిగిపోయాను. మడిసార్‌తో ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయ్యింది. అయిన నా పర్సనల్ లైఫ్ విషయాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి, సన్నిహితుల గురించి అస్సలు షేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు.
అలాగే ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయిన సమయం వచ్చినప్పుడు ఆ విషయాలు మీతో పంచుకోవచ్చు లేదా చెప్పకపోవచ్చు. అనా నా నిర్ణయం. మేము 100% పిల్లల ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో పంచుకోము. వారు సోషల్ మీడియాలో ఉండరు. ఈ వార్తలతో అలసిపోయాను. ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ రూమర్స్‌ను ఆపండి’ అంటూ పుకా రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment