విషెస్ చెప్తూ విరాళాలు సేక‌రించిన చిన్మ‌యి | Chinmayi Sripada Raised 85 Lakhs For Needy By Song Dedications | Sakshi
Sakshi News home page

చిన్మ‌యి విరాళం @ రూ.85 ల‌క్ష‌లు

Published Tue, Sep 15 2020 4:12 PM | Last Updated on Tue, Sep 15 2020 4:12 PM

Chinmayi Sripada Raised 85 Lakhs For Needy By Song Dedications - Sakshi

ప్ర‌ముఖ‌ గాయ‌ని చిన్మ‌యి శ్రీపాద కోవిడ్ విప‌త్తువేళ త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. త‌న గాన‌మాధుర్యాన్ని ఓ మంచి ప‌నికి ఉప‌యోగించారు. అభిమానుల కోసం పాట‌లు పాడుతూ, శుభాకాంక్ష‌లు చెప్తూ 82 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా సేక‌రించారు. ఈ మొత్తాన్ని లాక్‌డౌన్ వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల‌కు అందించనున్నారు. కాగా క‌రోనా వ‌ల్ల చిన్నాభిన్న‌మ‌వుతున్న కుటుంబాల‌ను చూసి చ‌లించిపోయిన చిన్మ‌యి ఏప్రిల్‌లోనే ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. బ‌ర్త్‌డే విషెస్ గానీ, ఎవ‌రి కోస‌మైనా పాట డెడికేట్ చేయాల‌న్నా, ఇంకేదైనా శుభాకాంక్ష‌లు చెప్పాల‌న్నా ‌వారు ముందుగా చారిటీకి ఎంతో కొంత డ‌బ్బులు డొనేట్ చేసి ఆ మొత్తాన్ని స్క్రీన్‌షాట్ తీసి పంపాలి. అప్పుడు వారి కోసం ఆమె పాట పాడి ఆ వీడియోను సెండ్ చేస్తారు. అలా ఇప్ప‌టివ‌ర‌కు మూడు వేల‌కు పైగా వీడియోల‌ను సెండ్ చేసి 85 ల‌క్ష‌ల డ‌బ్బు జ‌మ చేశారు. (చ‌ద‌వండి: పోలీసుల ట్వీట్‌.. చిన్మయి హర్షం!)

క‌ష్టాల సుడిలో 800 కుటుంబాలు
ఈ విష‌యం గురించి చిన్మ‌యి మాట్లాడుతూ.. "క‌రోనా వ‌ల్ల‌ ఎంతోమందికి ఉపాధి లేకుండా పోయింది. ఓ రోజు త‌మిళ‌నాడులోని ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు.. అక్క‌డి విద్యార్థుల‌కు సాయం చేయాల్సిందిగా న‌న్ను కోరాడు. 800 కుటుంబాల దీన ప‌రిస్థితి గురించి వివ‌రాల‌తో స‌హా మాకు పూర్తి స‌మాచారం పంపారు. అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌ని క‌నుక్కునే క్ర‌మంలో ఎన్నో విష‌యాలు తెలిశాయి. చాలా మంది పిల్ల‌ల త‌ల్లిదండ్రులు రోజువారీ కూలీలు. మ‌రికొంద‌రు శారీర‌క‌, మాన‌సిక ప‌రిస్థితి బాగోలేనివారు. హ‌ఠాత్తుగా వ‌చ్చిప‌డ్డ‌ క‌రోనా వైప‌రీత్యం వ‌ల్ల వారికి పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారింది. అప్పుడే నిర్ణ‌యించుకున్నా, వారికి నా వంతు సాయం చేయాల్సిందేన‌ని! అందుకే ఎవ‌రైనా స‌రే, ఏదైనా పాట కావాల‌న్నా, శుభాకాంక్ష‌లు చెప్పాల‌న్నా విరాళ‌మిస్తే చాలు వీడియోలు చేసి పంపించేందుకు డిసైడ్ అయ్యా"నన్నారు. ఎక్కువ‌గా బర్త్‌డే విషెస్ చెప్ప‌మ‌ని అడిగేవారని, ఒక్కోరోజు 75 వీడియోలు కూడా చేశాన‌ని ఆమె పేర్కొన్నారు. (చ‌ద‌వండి: వీటి పేర్లు చెప్పుకోండి చూద్దాం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement