సింగర్ కౌసల్య ( ఫైల్ ఫోటో )
కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒకరకంగా అది వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీలు కరోనాతో పోరాడుతుండగా తాజాగా ప్రముఖ సింగర్‌కు సైతం ఈ వైరస్ సోకింది. గాయని కౌసల్యకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది.
'నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీని లక్షణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజుల నుంచే నాకు జ్వరంగా ఉంది. కనీసం బెడ్‌పై నుంచి కూడా లేవలేకపోతున్నాను. ఇప్పుడు గొంతు నొప్పి నన్ను ఎంతగానో ఇబ్బందిపెడుతోంది. నిన్నటి నుంచే దీనికి మందులు వాడటం మొదలుపెట్టాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి' అని కౌసల్య చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment