Singer Kousalya
-
కరోనా బారిన సింగర్, బెడ్‌పై నుంచి లేవలేని స్థితి
కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒకరకంగా అది వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటికే టాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు కరోనాతో పోరాడుతుండగా తాజాగా ప్రముఖ సింగర్‌కు సైతం ఈ వైరస్ సోకింది. గాయని కౌసల్యకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. 'నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీని లక్షణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజుల నుంచే నాకు జ్వరంగా ఉంది. కనీసం బెడ్‌పై నుంచి కూడా లేవలేకపోతున్నాను. ఇప్పుడు గొంతు నొప్పి నన్ను ఎంతగానో ఇబ్బందిపెడుతోంది. నిన్నటి నుంచే దీనికి మందులు వాడటం మొదలుపెట్టాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి' అని కౌసల్య చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Kousalya Potturi (@singerkousalya) -
సింగర్ కౌసల్యతో ఇంటర్వ్యూ
-
నా భర్త వేధిస్తున్నాడు: గాయని కౌసల్య
-
నా భర్త వేధిస్తున్నాడు: గాయని కౌసల్య
సెలబ్రిటీలకు సైతం వేధింపులు తప్పడంలేదు. తన భర్త వేధిస్తున్నాడంటూ గాయని కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్లో ఈ మేరకు ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. గత కొంత కాలంగా తన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా తన భర్తపై 498ఎ సెక్షన్ కింద ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు మూడు విడతలుగా ఇద్దరికీ కౌన్సెలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు గతంలో కౌన్సెలింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయినా బాలసుబ్రహ్మణ్యంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆమె ఫిర్యాదు మేరకు అతడిపై 506, 507 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తానేమీ చేయలేదని, కావాలనే ఫిర్యాదు చేస్తోందని బాలసుబ్రహ్మణ్యం పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కౌసల్య సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. గుంటూరు మహిళా కళాశాలలో ఇంగ్లీషు లిటరేచర్, కర్ణాటక సంగీతాల్లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం పద్మావతి యూనివర్సిటీలో శాస్త్రీయ సంగీతంలో పీజీ చేశారు. చిన్ననాటి స్నేహితుడైన బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు తెలుస్తోంది. 1999లో 'మీ కోసం' సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించారు. పలు స్టేజి కార్యక్రమాలలో కూడా ఆమె తరచు పాటలు పాడుతుంటారు. -
మత్సరం లేని మంచి మనిషి
సంగీత దర్శకుడు చక్రి చనిపోయారన్న వార్త నాకు ఇప్పటికీ షాకింగ్ గానే ఉంది. వాళ్ళింట్లో వాళ్ళందరికీ నేను బాగా సన్నిహితురాలిని. చక్రి గారి అక్కను నేను కూడా వాణి అక్క అనే పిలుస్తాను. సోమవారం ఉదయం చక్రి గారి శ్రీమతి శ్రావణి నాకు ఫోన్ చేసి, అపోలో హాస్పిటల్లో ఉన్నా మంటూ వెక్కివెక్కి ఏడుస్తూ చెప్పేసరికి నాకు ఒక్క క్షణం విషయం అర్థం కాలేదు. హార్ట్‌బీట్ లేదని చెప్పారంటూ శ్రావణి చెప్పిన మాటతో హడావిడిగా అపోలోకు బయల్దేరా. ఈ లోగా చక్రి ఇక లేరనే వార్త తెలిసింది. నిశ్చేష్టురాలినయ్యా. అది నిజం కాకుండా ఉంటే బాగుండనుకున్నా. నిజానికి, గాయనిగా నన్ను వెండితెరకు పరిచయం చేసింది సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గారు - ‘నీ కోసం’ సినిమాతో. ఆయన చిత్రాలు మూడింటికి పాడాక, చక్రి తన తొలి చిత్రం ‘బాచి’లో పాడించారు. గమ్మత్తేమిటంటే, ఆ తరువాత నుంచి ఇటీవల మూడేళ్ళ క్రితం దాకా చక్రి గారి సినిమాలన్నిటిలో నేను పాడా. ఆయన సంగీతంలో పాడిన ‘మళ్ళి కూయవే గువ్వా...’ పాట నా కెరీర్‌కు పెద్ద బ్రేక్ అయింది. ఇప్పటికి నేను 400 దాకా పాటలు పాడితే, అందులో 300 చక్రి స్వరసారథ్యంలో పాడినవే. పైగా, ఆయన సినిమాలో ఒక్క పాట పాడినా, అది పెద్ద హిట్టయ్యేది. అలాగే, గాయకుడు హరిహరన్ గారి కాంబినేషన్లో నేను పాడిన పాటలన్నీ చక్రి స్వరపరచినవే. వీలైనంత వరకు స్థానికులను ప్రోత్సహించాలన్నది చక్రి గారి స్థిరాభిప్రాయం. ఆ క్రమంలో ఆయన ఎంతోమంది గాయకులనూ, గీత రచయితలనూ పరిచయం చేశారు. నిజానికి, నేను ఆయనకు అభిమాన గాయనిని. ‘నేను నీ ఫ్యాన్‌ను’ అని ఎప్పుడూ అనేవారు. అయినా, ఒక దశలో మరింత మంది కొత్తవాళ్ళను ప్రోత్సహించ దలిచి, నాతో పాడించడానికి కొంత విరామం ఇచ్చారు. ఆ మాటే నాకూ చెప్పారు. అందుకే, ‘సింహా’, ‘శ్రీమన్నారాయణ’ తరువాత మూడేళ్ళుగా ఆయన చిత్రాల్లో నా గొంతు వినిపించలేదు. అయినప్పటికీ, మా మధ్య స్నేహానికి అది అడ్డు కాలేదు. ఒక సందర్భంలో ఆయనకు ఎక్కువ పాటలు పాడినా, ఇప్పుడు పాడకపోయినా ఆ తేడాలేమీ చూపించకుండా ఎప్పటి లానే ఉండడం చూసి, ఆ విషయంలో ఆయన నన్నెంతో అభిమానించారు... ఆ మాటే నాతోనూ అన్నారు. అలాగే, నేను స్వయంగా సంగీత దర్శకురాలినైనా ఆయన ఈర్ష్యపడలేదు. మత్సరం చూపలేదు. ఆయనది చాలా కూల్ మనస్త్తత్త్వం. స్నేహితులైనవారిని ఎవరినీ వదులుకోలేని మంచి గుణం. ఈ డిసెంబర్ 31న చేసే షోలో పాడాల్సిందిగా కోరారు. సరేనన్నాను. మొన్న ‘మేము సైతం’ కార్యక్రమంలో కలిసినప్పుడు ఆయన కొద్దిగా ఆయాసపడుతుండడం చూశా. కొద్దిగా డిప్రెషన్లో కూడా ఉన్నట్టనిపించారు. భోజనానికి అందరం వెళుతున్నామన్నా రాలేదు. తిండి తగ్గించి, ఉడకబెట్టిన కాయగూరలు తింటున్నాన న్నారు. ఇంతలోకే ఇలా జరిగింది. ఆయన మృత దేహం చూసేంత వరకు ఈ వార్త నిజం కాకుండా ఉంటే ఎంత బాగుండు అనుకున్నా. కానీ, దేవుడు నిర్దయుడు. మంచివాళ్ళను ముందే తీసుకెళ్ళిపోతాడు. (సంభాషణ - రెంటాల) -
ఇది నమ్మలేని విషయం : కౌసల్య
-
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: సీతాకోకచిలుక ... సోయగాల చినుక ముద్దు ముద్దుగున్నవే నువ్వు ఓసి కన్నెగోపిక తుళ్లి తుళ్లి పడక కొంగు ముడివేసుకో నువ్వు ఆమె: కొనికా కెమెరాలో బందీలే అవుదామా కొల్లేటి సరసుల్లో స్నానాలే చేద్దామా బృం: జింగిచక హ జింగి జింగిచక (4) ॥ చరణం : 1 అ: ఓ రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి నింగిని చూసేద్దామా జాబిలమ్మను చేరి జోల పాడేద్దామా ఆ: చేపలనడిగి మొప్పలు తెచ్చి ఈతలు కొట్టేదాము సాగరాలే దాటి సాటి లేరందాము అ: మొదటి చూపుకే అలలా పుట్టుకొచ్చు ఈ ప్రేమ ఆ: చివరి వరకు ఊపిరిగా తోడు ఉండదా ప్రేమ అ: ఓ... పంచెవన్నెల చిలక రెక్కపై పచ్చతోరణం ప్రేమ ఆ: తామరాకుపై నీటిబొట్టులా తళుకుమంటది ప్రేమ ॥ చరణం : 2 అ: ఓ వానజల్లులో దోసిలి పట్టి గజగజ వణికేద్దామా పడవల బొమ్మలు చేసి చిటుకున వదిలేద్దామా ఆ: చిరుతల వేగం అరువుకు అడిగి గబగబ ఉరికేద్దాము ఊరులన్నీ తిరిగి జోరు చూపిద్దాము అ: రెండు గుండెల నడుమ రాయబారమీ ప్రేమ ఆ: నిండుకుండలా ఎపుడూ తొణికిపోదు ఈ ప్రేమ అ: ఓ... కోనసీమలో కొబ్బరాకులా ముద్దుగుంటది ప్రేమ ఆ: అరకు లోయలో చిలిపిగాలిలా కమ్ముకుంటది ప్రేమ ॥ చిత్రం : ఔను...వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002) రచన : భాస్కరభట్ల రవికుమార్ సంగీతం : చక్రి, గానం : చక్రి, కౌసల్య, బృందం -
గీత స్మరణం
ఏమి ఈ భాగ్యమో నేస్తమా... స ప ద ప సనిసా... ఏమి ఈ భాగ్యమో నేస్తమా నేనే నిండగా ఆ ఎండే పండగా ఈ వేసవే కోమలం శీతలం ఆ చల్లని చంద్రుని మండలం ఈ మందిరం సుందరం అందలం ఆ అంబరం సంబరం సంగమం ఏమి ఈ భాగ్యమో నేస్తమా... గానం : కౌసల్య ------------------------ ఆమె: ఎన్నెన్నో వర్ణాలు... అన్నింట్లో అందాలు ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఒక టైతే మిగిలేది తెలుపేనండీ నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం నాకోసం మీ ఇష్టం వదలొద్దండీ మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపోండిక ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా ఎన్నెన్నో వర్ణాలు... అతడు: నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండీ బాగుంది మీ టేస్టూ నాకెంతో నచ్చేట్టు మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు అందుకే నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా అందుకె నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా కలా నిజం నీకోసమే అనుక్షణం ఉల్లాసమే ॥ గానం : ఎస్.పి.బాలు, కౌసల్య ఆమె: పొగడమాకు అతిగా చేసెయ్యమాకు పొగడపూల లతగా రాసినావు చాలా ఆ రాతలంత నేను ఎదిగిపోలా నువ్వనే వచ్చింది నా నోట చనువుగ పిలుపులో తడబాటు ఆ మాట పలుకగ తెలుసుకుంటే పొరబాటు అతడు: నువ్వు అంటూ పిలుపు నాకెంతో నువ్వు దగ్గరైన తలపు పరిచయాల మలుపు దాచేసుకున్న మాటలన్నీ తెలుపు చిగురులే వేసేను ఈ కొమ్మ హొయలుగ పూవులై పూసేను ఈ జాబు చదవగ ఊహలేవో ఉదయించే ॥ గానం : ఎస్.పి.బాలు, కౌసల్య ------------------------ చిత్రం : ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002) రచన : సాయి శ్రీహర్ష, సంగీతం : చక్రి