గీత స్మరణం
గీత స్మరణం
Published Wed, Aug 7 2013 11:52 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
ఏమి ఈ భాగ్యమో నేస్తమా...
స ప ద ప సనిసా...
ఏమి ఈ భాగ్యమో నేస్తమా
నేనే నిండగా ఆ ఎండే పండగా
ఈ వేసవే కోమలం శీతలం
ఆ చల్లని చంద్రుని మండలం
ఈ మందిరం సుందరం అందలం
ఆ అంబరం సంబరం సంగమం
ఏమి ఈ భాగ్యమో నేస్తమా...
గానం : కౌసల్య
------------------------
ఆమె: ఎన్నెన్నో వర్ణాలు... అన్నింట్లో అందాలు
ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు
ఒక టైతే మిగిలేది తెలుపేనండీ
నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం
నాకోసం మీ ఇష్టం వదలొద్దండీ
మీ మది తొందర చేసే బాటను వీడక
మీరు సాగిపోండిక
ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా
ఎన్నెన్నో వర్ణాలు...
అతడు: నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం
పడలేను ఏ జోక్యం అంతేనండీ
బాగుంది మీ టేస్టూ నాకెంతో నచ్చేట్టు
మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు
అందుకే నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా అందుకె నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా
కలా నిజం నీకోసమే అనుక్షణం ఉల్లాసమే
॥
గానం : ఎస్.పి.బాలు, కౌసల్య
ఆమె: పొగడమాకు అతిగా చేసెయ్యమాకు పొగడపూల లతగా
రాసినావు చాలా ఆ రాతలంత నేను ఎదిగిపోలా
నువ్వనే వచ్చింది నా నోట చనువుగ
పిలుపులో తడబాటు ఆ మాట పలుకగ
తెలుసుకుంటే పొరబాటు
అతడు: నువ్వు అంటూ పిలుపు నాకెంతో నువ్వు దగ్గరైన తలపు
పరిచయాల మలుపు దాచేసుకున్న మాటలన్నీ తెలుపు
చిగురులే వేసేను ఈ కొమ్మ హొయలుగ
పూవులై పూసేను ఈ జాబు చదవగ
ఊహలేవో ఉదయించే
॥
గానం : ఎస్.పి.బాలు, కౌసల్య
------------------------
చిత్రం : ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
రచన : సాయి శ్రీహర్ష, సంగీతం : చక్రి
Advertisement
Advertisement