
సాక్షి, హైదరాబాద్ : పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం మజిలి. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట లిరికల్ వెర్షన్‌ను చిత్రం యూనిట్ సోమవారం విడుదల చేసింది. చైతన్య ప్రసాద్ రచించిన ఈ పాటను గాయని చిన‍్మయి శ్రీపాద చాలా హృద్యంగా ఆలపించారు.
కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్న ఈ మూవీలో రెండో హీరోయిన్ గా నటిస్తున్న దివ్యాంశ కౌశిక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి గోపీసుందర్ స్వరాలను సమకూర్చారు.
Comments
Please login to add a commentAdd a comment