ఆమె గాత్రం మాధుర్యంగా ఉండటమే కాదు గళంలో ఆవేశమూ ఉంటుంది. పాడటానికి మాత్రమే సవరించే గొంతు.. ఏదైనా నిగ్గదీసి అడగడానికి సైతం వెనుకాడదు. ముఖ్యంగా ఆడవారి పట్ల జరుగుతున్న వివక్షను నిలదీసేందుకు ఆమె ఎప్పుడూ ముందుంటుంది. ఆవిడే ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద. అయితే ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో, అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది.
మరోవైపు ఎంతోమంది తమకు ఎదురైన చేదు అనుభవాలను, జరుగుతున్న అఘాయిత్యాలను చిన్మయికి చెప్పుకుని బాధపడుతుంటారు. అలా అనేక మంది బాధలను, వారి నిస్సహాయ స్థితిని చిన్మయి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేవారు. ఆదివారం నాడు మదర్స్‌డే సందర్భంగా ఆమెకు ఓ స్పెషల్ మెసేజ్ వచ్చింది.
"ప్రియమైన చిన్మయి.. చాలామంది పిల్లలు వారికేదైనా సమస్య రాగానే తల్లికి చెప్పుకుందామని చూస్తారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఏదైనా అమ్మతోనే పంచుకుంటారు. కానీ లైంగిక వేధింపుల విషయానికి వచ్చేసరికి మాత్రం వాటిని కన్నతల్లితో కూడా చెప్పుకోలేక బాధపడుతుంటారు. కానీ అలాంటి చేదు విషయాలను కూడా మేం నీతో చెప్పుకోగలిగాం. ఆ ధైర్యాన్ని నువ్వే మాకు అందించావు. అందుకే నీతో అన్నీ షేర్ చేసుకున్నాం. హ్యాపీ మదర్స్‌డే" అని వచ్చిన మెసేజ్ చూసి చిన్మయి ఎమోషనల్ అయింది. ఈ ఒక్క మెసేజ్‌తో తన జీవితానికి సార్థకత లభించినట్లు అయిందని భావోద్వేగానికి లోనైంది.
చదవండి: ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్ కోసం చెప్పినట్టు ఆడరు
Comments
Please login to add a commentAdd a comment