ఈ కామర్స్ సైట్కు హీరో పంచ్ | Actor Rahul Ravindran Slams Snap deal | Sakshi
Sakshi News home page

ఈ కామర్స్ సైట్కు హీరో పంచ్

Published Thu, Aug 17 2017 12:28 PM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM

ఈ కామర్స్ సైట్కు హీరో పంచ్

ఈ కామర్స్ సైట్కు హీరో పంచ్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ ఈ కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ కు పంచ్ ఇచ్చాడు. ఇటీవల ఈ సైట్ ప్రకటించిన ఓ సేల్ కు సంబంధించి ట్విట్టర్ లో చేసిన పోస్ట్ పై రాహుల్ స్పందించిన తీరు ఆకట్టుకుంది. ఐశ్వర్యారాయ్ పరిగెడుతున్న వీడియోను పోస్ట్ చేసి స్నాప్ డీల్, ఆ వీడియోకు 'మీరు ఎంత షాపింగ్ చేశారో మీ భర్తకు తెలిసే లోపే డోర్ దగ్గరకు పరిగెత్తండి' అనే కామెంట్ ను జోడించింది.

ఈ ట్వీట్ పై స్పందించిన రాహుల్ రవీంద్రన్ 'గత ఏడాది నా సంపాదన కన్నా.. నా భార్య సంపాదనే ఎక్కువ.. తన ఆన్ లైన్ షాపింగ్ తన సంపాదన తోనే చేస్తోంది. కాబట్టి పరిగెత్తాల్సిన అవసరం లేదు' అంటూ ట్వీట్ చేశాడు. రాహుల్ ట్వీట్ పై స్పందించిన ఆయన భార్య ఇలాంటి భర్తనే ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది అంటూ ట్వీట్ చేసింది. రాహుల్ కామెంట్ చేసిన తరువాత స్నాప్ డీల్ తన ట్వీట్ ను తొలగించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement