పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని.. ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు బాధితులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపిస్తున్నారు. 18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అంతేకాదు పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా... ‘ దీనికి ఒక పరిష్కారం ఉంది. నువ్వు వైరముత్తును పెళ్లి చేసుకో. గత కొన్ని రోజులుగా నువ్వు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. స్టుపిడ్ నీకేం పనిలేదా. ఎప్పుడూ ఆయన(వైరముత్తు) గురించే మాట్లాడతావు. నువ్వు బీజేపీ వ్యక్తివని మాకు తెలుసు’ అంటూ ద్వేషపూరిత కామెంట్ చేశాడు.
ఇందుకు స్పందించిన చిన్మయి... ‘ మీ ఐడియా చాలా బాగుంది. కానీ నాకు నచ్చలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా తనకు అండగా నిలుస్తూ భర్త రాహుల్ రవీంద్రన్ గతంలో రాసిన లేఖను ట్వీట్ చేశారు. ‘ పనికిలేని వాళ్లంతా నా టైమ్‌లైన్‌లో చెత్త రాస్తున్నారు. నా భార్య కారణంగా మీకేదో ఇబ్బంది కలుగుతోందని అర్థమవుతోంది. ఎందుకంటే తనో ప్రత్యేకమైన వ్యక్తి. మాట్లాడే ధైర్యం కలది. మగ అహంకారం చూపి తనను భయపెట్టాలని చూస్తున్నారు. ప్రపంచం మారుతోందన్న విషయాన్ని మీరు అంగీకరించరు. సమానత్వం వచ్చేదాకా తనలాంటి గొంతులు మరింతగా హోరు పెంచుతాయి. ప్రేమించే, జాగ్రత్తగా చూసుకునే, నిస్వార్థంగా ఇతరుల కోసం జీవించే మహిళను నేను భార్యగా పొందాను. మీరు కూడా మీ వ్యక్తిత్వానికి తగిన భార్యను వెతుక్కోండి. ఆమె లాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లు మీలాంటి సంకుచిత వ్యక్తులను ఎంచుకుంటారా అనేదే కాస్త సందేహంగా ఉంది’ అంటూ రాహుల్ రవీంద్రన్ తన భార్య ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారికి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ‘నా భర్త స్ట్రాంగెస్ట్’ అని చిన్మయి ఈ లేఖను మరోసారి ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయిపై విషం చిమ్మిన నెటిజన్ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. ‘బాధితులకు ఎంత మంచి సలహా ఇచ్చావురా నాయనా. అలాంటి వాళ్లు మనింట్లో ఉన్నా కూడా ఇలాగే చెప్పాలి. ఎంతైనా నువ్వు గ్రేట్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
What an idea. Sorry not interested. https://t.co/DsURMwT9b6
— Chinmayi Sripaada (@Chinmayi) April 15, 2019
❤️❤️❤️❤️❤️💪🏻💪🏻💪🏻💪🏻
My husband strongest. https://t.co/EEAJzSHopn
— Chinmayi Sripaada (@Chinmayi) October 17, 2018
Comments
Please login to add a commentAdd a comment