యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన, వీడియో వైరల్‌ | Actor Cool Suresh Forces Garland On Woman Event Host, Mansoor Ali Khan Apologises On His Behalf - Sakshi
Sakshi News home page

Cool Suresh Viral Video: స్టేజీపై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి

Published Wed, Sep 20 2023 12:29 PM | Last Updated on Wed, Sep 20 2023 1:01 PM

Actor Cool Suresh Forces Garland on Anchor, Video Viral - Sakshi

ఇది భయంకరమైన ప్రవర్తన.. ఇలాంటివారిపై ఎవరూ చర్యలు తీసుకోరు. పైగా దీన్ని వివాదంగా మార్చవద్దని ఆ అమ్మాయి నోరే మూయిస్తారు. అక్కడ ఉన్న కొందరు అబ్బా

కొందరు చేసే తిక్క పనుల వల్ల అవతలివారు ఇబ్బందిపడుతుంటారు. తాము చేసేది తప్పా? ఒప్పా? అని క్షణం కూడా ఆలోచించకుండా అప్రతిష్ట మూటగట్టుకుంటారు. తాజాగా తమిళ నటుడు కూల్‌ సురేశ్‌ స్టేజీపై ఉన్న మహిళా యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇతర చిత్రాల ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు సురేశ్‌. ఈ క్రమంలో తాజాగా సరక్కు సినిమా మ్యూజిక్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు పక్కనే ఉన్న యాంకర్‌ మెడలో పూలమాల వేశాడు.

చేసింది తప్పని గద్దించిన నటుడు
దీంతో ఇబ్బందిగా ఫీలైన సదరు యాంకర్‌ చిరాకుగా ఆ మాలను తీసి పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె అనుమతి లేకుండా అలా దండ వేసేయడం సంస్కారమేనా? అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కూల్‌ సురేశ్‌ ప్రవర్తనకుగానూ అదే స్టేజీపై ఉన్న నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా సురేశ్‌ను సైతం క్షమాపణలు చెప్పాలని కోరాడు. దీంతో సురేశ్‌ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం మొదటి నుంచి మేము సరదాగానే మాట్లాడుకుంటున్నాం.. అని తన తప్పిదాన్ని కవర్‌ చేసేందుకు ప్రయత్నించాడు.  

ఆ చప్పట్లేంటి? చిన్మయి ఆగ్రహం
మధ్యలో మన్సూర్‌ అలీ కలగజేసుకుంటూ ఏదైతేనేం.. నువ్వు చేసిన పని తవ్వు అని నొక్కి చెప్పడంతో సురేశ్‌ క్షమాపణలు చెప్పాడు. కానీ నెట్టింట మాత్రం నటుడి ప్రవర్తనను ఏకిపారేస్తున్నారు. తాజాగా సింగర్‌ చిన్మయి సైతం దీన్ని తప్పుపట్టింది. 'ఇది భయంకరమైన ప్రవర్తన.. ఇలాంటివారిపై ఎవరూ చర్యలు తీసుకోరు. పైగా దీన్ని వివాదంగా మార్చవద్దని ఆ అమ్మాయి నోరే మూయిస్తారు. అక్కడ ఉన్న కొందరు అబ్బాయిలైతే అతడు పూలమాల వేస్తుంటే చప్పట్లు కొడుతున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

చదవండి: అక్కినేని శతజయంతి వేడుకలు.. కాంస్య విగ్రహం ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement