హాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులపై బాధితురాళ్ల బహిరంగ వెల్లడింపులతో సరిగ్గా ఏడాది క్రితం మొదలైన ‘మీ టూ’ మహిళా మహోద్యమం.. ఇన్నాళ్లకు మెల్లిగా బాలీవుడ్‌కూ ధైర్యాన్నిచ్చింది! పదేళ్ల క్రితం నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఇప్పుడు బయట పెట్టడంతో, ఆ స్ఫూర్తితో.. మరికొంతమంది బాలీవుడ్ మహిళా ప్రముఖులు తమ జీవితంలోనూ జరిగిన అలాంటి చేదు అనుభవాలను ఒకరొకరుగా బహిర్గతం చేస్తున్నారు.