Helen Mirren
-
'సొంతబిడ్డలు వద్దనుకొని ఇప్పుడు ఏడుస్తున్నాను'
లండన్: తనకు సొంతపిల్లలు వద్దని నిర్ణయించుకున్నానని, పిల్లల్ని కనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు విజేత హెలెన్ మిర్రెన్(70) అన్నారు. అయితే, ఆ దశ తన జీవితంలో లేనందుకు మాత్రం చాలా బాధపడ్డానని, కన్నీటి పర్యంతం అయ్యానని తెలిపారు. అయితే, కొద్ది సేపటికే ఆ బాధను అధిగమించి సంతోషంగా మారిపోయానని అన్నారు. 1986 నుంచి ప్రముఖ దర్శకుడు టేలర్ హ్యాక్ ఫార్డ్ తో సహజీవనం ప్రారంభించిన ఆమె ఆయనను 1997లో వివాహం చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు కుమారులు కూడా. కానీ, వారినే తన పిల్లలుగా భావించాను తప్ప సొంతంగా బిడ్డలు కావాలని మాత్రం అనుకోలేదని అన్నారు.'నేను పిల్లల్ను ప్రేమిస్తాను. వాళ్లు చాలా ఫన్నీ.. స్వీట్. కానీ నేనెప్పుడు నాకు పిల్లలు కావాలనుకోలేదు. కానీ, నేను ఇలా చెప్పిన మాట కూడా ఒక అబద్ధమేనని ప్యారెంట్ హుడ్ చిత్రం చూసిన తర్వాత తెలిసింది. ఆ సినిమా చూస్తూ తన జీవితంలో ఆ భాగ్యం లేకుండా పోయినందుకు కనీసం 20 నిమిషాలపాటు వెక్కివెక్కి ఏడ్చేశాను. కానీ, తర్వాత తేరుకున్నాను' అని ఆమె తెలిపారు. ఎవరి జీవితమైనా తండ్రిగాగానీ, తల్లిగాగానీ మారిపోకుండా ఆగకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. -
నాకు అందులో నటించాలని ఉంది
లాస్ ఎంజిల్స్: తనకు ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ 8లో నటించాలని ఉందని ప్రముఖ హాలీవుడ్ నటి హెలెన్ మిర్రెన్ (69) అన్నారు. ఈ చిత్రాలను అమితంగా ప్రేమించే ఆవిడ అవకాశం ఇస్తే 8వ సిరీస్లో విలన్ పాత్ర పోషించాలని ఉందని, అందులో దుమ్ములేచిపోయేలా కారు నడపాలని ఉందని పేర్కొంది. సొంతంగా కారు నడుపుతూ వెళుతుంటే ఆ మజానే వేరని, టాప్ గేర్ ఉన్నప్పుడు ఆ ఆనందం చెప్పలేమని అన్నారు. ఫాస్ట్ ఫ్యూరియస్ 8లో నటించాలనుకోవడం తన కల అని, తప్పకుండా నటిస్తానని తెలిపారు. మరో హాలీవుడ్ ప్రముఖ నటుడు విన్ డీసెల్కు ప్రత్యేక అభిమాని అయిన ఆమె డీసెల్ అంటే తనకు చాలా ఇష్టమని, తానెప్పుడు అతడిని ప్రేమిస్తూ ఉంటాని, నిజానికి అతడు చాలా గొప్పవాడంటూ కితాబిచ్చింది. ఫన్ ఎక్కువగా ఏ చిత్రాల్లో ఉంటే ఆ చిత్రాలు తనకు అమితంగా ఇష్టమని చెప్పింది. ఫాస్ట్ ఫ్యూరియస్ చిత్రం సీక్వెల్లో భాగంగా వస్తున్న ఫాస్ట్ ప్యూరియస్ 7 ఏప్రిల్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
అది అతిథి పాత్ర మాత్రమే..
జుహీ చావ్లా ముంబై: ‘ద హండ్రెడ్ ఫూట్ జర్నీ’లో తనది కేవలం అతిథి పాత్ర మాత్రమేనని నటి జుహీ చావ్లా పేర్కొంది. సినిమాలో ఓం పురి, హెలెన్ మిర్రెన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని, తాను కేవలం రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తానని చెబుతోంది. ఈ సినిమాతో జుహీ హాలీవుడ్ తెరంగేట్రం చేయనుందని వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. సినిమా మొత్తంలో తాను కేవలం రెండుమూడు నిమిషాలు మాత్రమే కనిపిస్తానని, అదీ ప్రారంభ సన్నివేశంలో మాత్రమేనని స్పష్టం చేసింది. హాలీవుడ్ చిత్రంలో ఈ చిన్న పాత్రలో నటించడం ఏమంత గొప్ప విషయంగా తాను భావించడంలేదని చెప్పింది. అయితే కనిపించేది కొద్దిసేపయినా తన పాత్రను దర్శకుడు మలిచిన తీరు అద్భుతంగా అనిపించిందని చెప్పింది. ఈ సినిమాలో నటిస్తున్నట్లు ముందు తనకు కూడా తెలియదని, అకస్మాత్తుగా అవకాశం వచ్చిందని, అంతే వేగంగా తాను నిర్ణయం తీసుకొని అంగీకరించేశానని, నటించేశానని చెప్పింది. కమల్ హాసన్, ఓం పురి వంటివారి స్థాయికి సరిపడిన పాత్రలు సినిమాల్లో ఉండడంలేదన్న విషయాన్ని జుహీ అంగీకరించింది. ఇప్పట్లో నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ నటించిన ‘ఎ వెడ్నస్ డే’ సినిమా తనకు చాలా బాగా నచ్చిందని, అందులో నటీనటుల స్థాయికి సరిపడే పాత్రలు దొరికాయనిపించిందని చెప్పింది. అయితే అటువంటి పాత్రలు ఎప్పుడూ లభిస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని అభిప్రాయపడింది. ప్రేక్షకులకు ఎంతసేపూ డ్యాన్సులు, పాటలు, శృంగార సన్నివేశాలు, ఫైట్లు, ప్రేమ కథలే కావాలని, దీంతో మంచి కథలున్న చిత్రాలు తెరకెక్కడం లేదని, అయితే హాలీవుడ్లో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంటుందని చెప్పింది. ద హండ్రెడ్ ఫూట్ జర్నీలో ఓం పురి పాత్ర అద్భుతమని, ఈ సినిమాతో ఓం పురికి హాలీవుడ్లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని జోస్యం చెప్పింది.