childern
-
రేపటి భావి భారత ఆశా దీపాలు వీళ్లే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి పిల్లలే రేపటి భావి భారత ఆశా దీపాలు అంటూ తన ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన. బాలల దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా.. బాల్యం.. మళ్లీ ఎప్పటికీ తిరిగిరాని, మరిచిపోలేని మధుర జ్ఞాపకం. బాల్యంలో ఉన్న మన పిల్లలను ఆనందంగా, ఆరోగ్యంగా ఎదగనిద్దాం. వాళ్లే రేపటి భావి భారత ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. బాల్యం.. మళ్లీ ఎప్పటికీ తిరిగిరాని, మరిచిపోలేని మధుర జ్ఞాపకం. బాల్యంలో ఉన్న మన పిల్లలను ఆనందంగా, ఆరోగ్యంగా ఎదగనిద్దాం. వాళ్లే రేపటి భావి భారత ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2024 పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి ఏదైనా ఉందంటే.. అది చదువు మాత్రమే.కేవలం పిల్లల చదువు మాత్రమే పేదల తలరాతను మార్చగలదని బలంగా నమ్మి.. గత ఐదేళ్లు ఆ దిశగా అడుగులు వేసిన @ysjagan గారుపిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.#ChildrensDay#YSJaganForQualityEducation pic.twitter.com/xS9e0J0nmh— YSR Congress Party (@YSRCParty) November 14, 2024 -
సోషల్ మీడియా షోకేస్‌లో.. బాల్యం!
బాల్యం.. ఎవరికైనా అమూల్యం! ఎక్కడైనా అద్భుతం! పిచ్చుక గూళ్లు, దాగుడుమూతలు, కోతికొమ్మచ్చి ఆటలు పిల్లలందరికీ ప్రియం! పెద్దలు ఆ ఆనందంలోకి తొంగి చూడ్డంలో తప్పు లేదు .. ఆ తుళ్లింతలను కంటినిండా నింపుకోవడం పొరపాటు కాదు! ఆ పసితనాన్ని ఫ్రేమ్ చేసి ఆ మురిపాన్ని పంచుకోవడం నేరం అనిపించుకోదు! కానీ.. ఆ షేరింగ్‌లోనే బాల్యానికి సోషల్ మీడియా బురదంటుతోంది!ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఆన్లైన్ బుల్లీయింగ్‌కి గురవుతున్నారు. యూరప్‌లో 33 శాతం మంది బాలికలు, 20 శాతం మందిబాలురు.. ఆన్లైన్లో వచ్చే కంటెంట్‌తో డిస్టర్బ్ అవుతున్నారు. ఆఫ్రికా, ఆసియాలోని దేశాల్లో 20 శాతం మంది పిల్లలు ఆన్లైన్ అబ్యూజ్ లేదా లైంగిక దోపిడీకి గురవు తున్నారు. ఇవి రెండేళ్ల కిందటి లెక్కలు!ఇదీ ‘రియాలిటీ..తండ్రీకూతుళ్ల వీడియో మీద అబ్యూజివ్ కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఉందంతం ఈ కథనానికి నేపథ్యం. ఇలాంటివారి వల్ల ఎంటర్టైన్మెంట్ కమాడిటీస్గా మారుతున్న పిల్లల గురించి, పసిఛాయలు కోల్పోతున్న బాల్యం గురించి ఆలోచన అవసరం. పిల్లల్లోని ప్రతిభను మాత్రమే వినిపిస్తూ.. ప్రతి గడపలోని బాలలను ఆనందపరుస్తూ.. ప్రేరణనందించిన ∙రేడియో బాలానందం ఆత్మ ఇప్పుడేది? పిల్లలతో డాన్స్ చేయించే రియాలిటీ షోస్ వచ్చాయి. సర్కస్ ఫీట్లు, అసభ్యకరమైన స్టెప్పులతో పాపులర్ అయ్యాయి. క్రీడాస్ఫూర్తిని పెంపొందించాల్సిన ఈ పోటీలు గెలుపోటముల సెంటిమెంట్లను పండించే వేదికలుగా మారాయి. స్క్రిప్ట్ ఇచ్చి పిల్లల చేత డ్రామా చేయిస్తున్నాయి. అవి పెద్దలకు వినోదాన్ని పంచుతూ టీఆర్పీలను పెంచుతున్నాయి. దీనికున్న క్రేజ్ చూసి రియాలిటీ షోస్ కోసం డాన్స్ నేర్పే ఇన్స్టిట్యూట్లూ వెలిశాయి. ఈ డాన్స్ షోల స్క్రీన్ ప్లే వర్కవుట్ కావడంతో భార్యభర్తల పంచాయతీ సీన్లనూ చేర్చారు.. మరో రియాలిటీ షోగా! అందులోనూ పిల్లలు పావులే! కెమెరాల ముందు.. టీవీ జడ్జీల సమక్షంలో అమ్మ, నాన్న అలా తగవులాడుకుంటూంటే.. బెదిరిపోయి.. బిత్తర చూపులు చూస్తున్న ఆ పిల్లల మొహాలను జూమ్ చేసి ఆ పంచాయతీ కార్యక్రమాన్ని రక్తి కట్టించడం కనపడుతూనే ఉంది. ఇక్కడితో ఆగలేదు. కామెడీ షో పేరుతో అశ్లీల హాస్యాన్ని సేల్ చేసుకుంటున్న కార్యక్రమాల్లోనూ పిల్లలను భాగస్వాములు చేస్తున్నారు. ముద్దు ముద్దు మాటల చిన్నారులతో ముదురు, డబుల్ మీనింగ్ డైలాగులు పలికిస్తున్నారు. అంతేకాదు అంతులేకుండా కొనసాగే టీవీ సీరియళ్లలోనూ పిల్లల కోసం పాత్రలు క్రియేట్ అవుతున్నాయి వాళ్ల వయసుకు మించిన మాటలతో!సోషల్ మీడియా.. వైరస్.. వ్యూస్సోషల్ మీడియా ఆ రియాలిటీ షోస్‌ని రీల్స్‌గా, షాట్స్‌గా మార్చేసింది. పురిట్లోని పిల్లల ఏడుపు.. ఫీడింగ్, ఫార్టింగ్, నిద్దట్లోని వాళ్ల హావభావాల వీడియోలు యూట్యూబ్, ఇన్‌స్టాలో కోకొల్లలు. డాన్సింగ్ కాక్టస్‌ను చూసి బెదిరిపోయే పిల్లలు, బొమ్మకు అన్నం తినిపిస్తూ అది తినకపోతే దాన్ని కొట్టి పిల్లలను భయపెట్టి అన్నం తినిపించే పెద్దలు, బుడిబుడి అడుగులతో నీళ్లల్లో జారిపడే పిల్లలు, ఇల్లు పీకి పందిరేసే పనిలో దెబ్బలు తగిలించుకునే పిల్లలు, తోబుట్టువులతో తగవులాడే పిల్లలు, పెంపుడు జంతువులు ముద్దు చేస్తుంటే ఇబ్బంది పడే పిల్లలు.. ఇలా వాళ్లకు సంబంధించి ఏదైనా రీలే.. షాట్సే! ఇవి వేలల్లో కనిపిస్తాయి సోషల్ మీడియా నిండా! దురదృష్టవశాత్తు అవి పెద్దలకు కాలక్షేపమవుతున్నాయి! ఊసుపోక కాదు.. వాటిని చూడ్డమే పనిగా పెట్టుకున్న వ్యూయర్స్ ఉంటారు. పిల్లల టాలెంట్‌ని కాకుండా పెద్దల పైత్యాన్ని ప్రదర్శించేవే అధికం వాటిల్లో! అందుకే పిల్లల మీద మీమ్స్ నుంచి పిల్లలే పాత్ర«లయ్యే రీల్స్, షాట్స్ వరకు అన్నీ సోషల్ మీడియాలో సేలబులే! ఇటీవల వచ్చిన జైలరు సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో ‘ఆ.. నువ్వు కావాలయ్య పాట’ సోషల్ మీడియాలో వైరల్! దేశీలు, ఎన్నారైలు ఆ పాట మీద స్టెప్‌లేస్తూ తీసుకున్న వీడియో పోస్ట్‌లతో ఇన్‌స్టా, యూట్యూబ్‌లు ఊగిపోయాయి. అంతటితో ఆగకుండా ఆ పిచ్చి పనిని పిల్లల చేతా చేయించి సోషల్ మీడియాలో ప్రదర్శించి లైక్స్, కామెంట్స్, షేర్స్ లెక్కలు చూసుకున్నారు. పిచ్చిపని అని ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తోందంటే.. అదొక లైంగిక చర్యను సూచించే స్టెప్. దాన్ని చిన్న పిల్లల చేత వేయించి.. ఇన్‌స్టాలో చూపించి ఆనందపడినందుకు! పిల్లల ముద్దుమురిపాలు, ప్రతిభాపాటవాలను పదిమందికీ చూపించి వాళ్ల దీవెనలు, ప్రశంసలు అందుకోవాలని ఆశపడని అమ్మానాన్నలుండరు.కానీ వాళ్లను ఏ వేదిక మీద నిలబెడుతున్నామనే అవగాహన చాలా అవసరం. ఒకసారి వాళ్ల ఫొటోలో.. వీడియోలో ఆ ప్లాట్ఫామ్లోకి∙వెళ్లాక అవి ఫార్వర్డ్ అవడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోను వాటిని వెనక్కి తీసుకునే అవకాశం లేని వేదికలవి. అలాంటి వాటి మీద పిల్లలను ఆడించడం, పెద్దలే పిల్లల పేరు మీద ఇన్‌స్టా హ్యాండిళ్లు, యూట్యూబ్ చానళ్లు నిర్వహించడం, బూతు డైలాగులు, అసభ్యకరమైన, అమర్యాదకరమైన రీల్స్, షాట్స్ చేయిచండం సామాజిక ఉపద్రవం కాక మరింకేమిటి! ఆ చానళ్లకు లక్షల్లో వ్యూస్, సబ్స్క్రైబర్స్తో ఆదాయం తెచ్చుకుంటున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారుస్తున్నారు.బాల్యం.. వినోద వస్తువుసాంకేతిక ఊసు లేనప్పుడు కూడా వినోదం ఉంది. అందులోనూ పిల్లల భాగస్వామ్యం ఉంది. వాళ్ల మనోవికాసానికే అది ఉపయోగపడింది తప్ప వాళ్లను వినోద వస్తువులుగా మార్చలేదు. వాళ్ల ప్రతిభను మెరుగుపరచింది తప్ప పసితనాన్ని మరుగుపరచలేదు. ఇప్పుడు ఏం చేసైనా వినోదాన్ని పండించి .. డబ్బులు రాబట్టుకునే వేదికలు తయారయ్యాయి. వ్యక్తిగత గుట్టు ఎంత గడప దాటితే అంత ఎంటర్టైన్మెంట్. దానికి పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేదు. సోషల్ మీడియా పుణ్యాన పురిటి నుంచి టీన్స్ దాకా పిల్లలు ఎంటర్టైన్మెంట్ కమాడిటీస్ అయ్యారు.అమ్మ, నాన్నలతో కలసి ఆడుకుంటున్న వీడియోలు పెట్టినా, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగాన్ని పోస్ట్ చేసినా.. ఫ్రెండ్స్‌తో ఉన్నా, పిల్లలు కూర్చున్నా.. నిలబడ్డా, నవ్వినా, ఏడ్చినా, వణికినా, ధైర్యంగా కనపించినా, బుంగమూతి పెట్టుకున్నా, చిలిపితనం చిందించినా, చురుకుదనం ఉరకలేసినా.. అంతెందుకు ఏం చేసినా.. చేయకపోయినా వంకర వ్యాఖ్యానాలు, బెదిరింపులు, వేధింపులు, ట్రోలింగ్, రకరకాల పర్వర్షన్స్కి ఈజీ టార్గెట్స్‌గా మారారు. దీన్ని సమాజం నిర్లక్ష్యం చేసింది కనుకే ప్రణీత్ హనుమంతు తనలాంటి నలుగురితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ నాన్న, కూతురి వీడియో పోస్ట్‌ని అంత రోస్ట్ చేయగలిగాడు.పిల్లల హక్కులకు చట్టాలున్నాయి..!రియాలిటీ షోల పేరుతో పిల్లలను వినోద పరిశ్రమలో కార్మికులుగా చేసే దశ నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పిల్లలను వినోద వస్తువులుగా మార్చే దశ వరకు.. ఎక్కడా.. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల మీద మనకెలాంటి హక్కు లేదు. సమాజానికే కాదు కన్న తల్లిదండ్రులకూ లేదు! పరిణతి చెందిన ్రçపపంచం పెద్దల హక్కులే పిల్లల హక్కులని గుర్తించింది. అందుకే దాదాపు అన్ని దేశాల్లో పిల్లల హక్కులను పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాలున్నాయి. ఇంటర్నెట్ వచ్చాక పిల్లల భద్రత గురించే మొదట ఆలోచించాయి.అందుకే దాదాపు ప్రపంచ దేశాలన్నీ పిల్లల వ్యక్తిగత సమాచార గోప్యత పాటించాల్సిందేనని చట్టాల ద్వారా కట్టుదిట్టం చేశాయి. సొంత తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చెందిన ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టొద్దు. పౌరసత్వ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం దగ్గర తప్ప ఇంకెక్కడా బహిర్గతపరచాల్సిన అవసరంలేదు. ప్రభుత్వం కూడా ఆ వివరాలను తన ఏజెన్సీలు సహా ఇంకే ఇతర ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు.మన దగ్గరా పిల్లల హక్కులు, రక్షణ, భద్రత, గోప్యతకు సంబంధించి ప్రత్యేక చట్టాలున్నాయి. డిజిటల్ డేటాకు సంబంధించీ చట్టం ఉంది. ఇదేం చెబుతోందంటేæ.. పిల్లలను వాళ్ల వయసుకు తగని సన్నివేశాల్లో చూపించకూడదు. దీని కిందకు కుటుంబ తగాదాలు, స్త్రీ, పురుష సంబంధాల అంశాలు, భయం, భీతిగొలిపేవంటివన్నీ వస్తాయి. అలాగే మైనర్లను అసభ్యంగా, అశ్లీలంగా చూపించకూడదు. వారిని అవమానించేలా, కించపరచేలా, వేధించేలా ఉన్న ఫొటోలు, వీడియోలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టకూడదు.హింసాత్మకమైన, ప్రమాదకరమైన, హానికరమైన చర్యల్లో పిల్లలు పాలుపంచుకునేలా ఉన్న కంటెంట్, ఫొటోలు, వీడియోలు, వారిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసించడం, వారిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగించే దృశ్యాలను చూపించడం వంటివన్నీ నిషేధం. బాల్యాన్ని పదిలంగా ఉంచుదాం!‘ఎవరి పిల్లలైనా వాళ్లు పిల్లలు! బాల్యం పదిలంగా ఉంటేనే భవిష్యత్తు బంగారమవుతుంది. పిల్లలకు మనం ఏదిస్తే అదే తీసుకుంటారు. మనం ఏం చూపిస్తే అదే గ్రహిస్తారు. మనం ఏం చేస్తే దాన్నే అనుకరిస్తారు, అనుసరిస్తారు. అందుకే మనం జాగ్రత్త పడాలి’ అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్‌లు. సాంకేతికత ముంచెత్తుతున్న సమాచారాన్ని ఫిల్టర్ చేయలేం. సముద్రాన్ని మధించి అమృతాన్ని అందివ్వలేం! అలాగని ఆ డిజిటల్ స్కూల్‌కి దూరంగా ఉంచి పిల్లలను డిజిటల్లీ చాలెంజ్డ్ చేయలేం!ఈ పేరెంటింగ్‌ని ఒక్క తల్లిదండ్రుల నెత్తినే వేయకుండా సమష్టిగా పంచుకుందాం! తొలి అడుగు పేరెంట్స్ నుంచి రావాలి. పిల్లలు డిజిటల్ మీడియంలో ఎంతవరకు ఎక్స్పోజ్ కావాలి అనే విచక్షణతో మెదలాలి. ఆ ప్లాట్ఫామ్లో పిల్లలను ఎంటర్టైన్మెంట్ టూల్స్‌గా మలచకుండా పిల్లల మనోవికాసానికి దాన్నో టూల్‌గా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.కరోనా ఎఫెక్ట్‌గా ఆన్లైన్ పాఠాలు అనివార్యమై పిల్లలకు ఇంటర్నెట్తో మరింత ఫ్రెండ్షిప్ పెరిగింది. ఆ స్నేహంలో వాళ్లకున్న పరిమితులు, వాళ్లుండాల్సిన పరిధిని చూపించడం, ఆ మేర జాగ్రత్తపడటం టీచర్ల పని. ఏ ప్లాట్ఫామ్లో అయినా పైన చెప్పిన రీతిలో పిల్లలు కనిపిస్తే వెంటనే దాన్ని రిపోర్ట్ చేసి.. సదరు పోస్ట్‌లకు లైఫ్ లేకుండా.. అర్కైవ్స్‌లో దాక్కోకుండా చూడాల్సిన బాధ్యత మనది.. డిజిటల్ సొసైటీలో భాగమైన మనందరిది. ఈ ప్రయాణంలో మద్దతివ్వడానికి చట్టాలున్నాయి. స్పందించడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. దీని మీద అవగాహన కల్పించే కార్యక్రమాలను చూడాల్సింది ప్రభుత్వం. పిల్లలను వినోద వస్తువులుగా చూస్తూన్నాం! ఈ నేరం మనందరిదీ! ఆ తప్పును పేరెంటింగ్‌తో సరిదిద్దుకోవాలి. సమాజమంతా ఆ బాధ్యతను తీసుకోవాలి!జాగ్రత్తగా ఉండాలిపిల్లల ఫొటోలు పోస్ట్ చేయకండి అని భయపెట్టను. కానీ ఆ సమాచారం అంతటా వ్యాపించే చాన్స్ ఉంది కాబట్టి పిల్లల ఫొటోలు, వీడియోలు సహా ఎలాంటి వివరాలనైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎందులో ఏం పోస్ట్ చేసినా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి.ఆ వివరాలు ఫార్వర్డ్ అవడమే తప్ప డిలీట్ అయ్యే చాన్స్ ఉండదు. కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాచింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ శిక్షార్హమైన నేరం. పిల్లల మీద అబ్యూజివ్ కామెంట్స్ అనేవి జీరో టాలరెన్స్ నేరం. ఇలాంటివేవైనా ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే 100కి గానీ 1930కి గానీ డయల్ చేయండి. ఇంకో విషయం.. ఇలాంటి అబ్యూజివ్ కామెంట్స్‌ని ట్వీట్, పోస్ట్ చేయడమే కాదు వాటిని రీ ట్వీట్, ఫార్వర్డ్ చేసినా నేరమే. – శిఖా గోయల్, ఏడీజీపీ సీఐడీ, డైరెక్టర్ తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో, డైరెక్టర్ టీఎస్ ఎఫ్ఎస్సెల్, ఏడీజీపీ విమెన్ సేఫ్టీ వింగ్ఆలోచించాలి.. చిన్నపిల్లల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ మీ స్నేహితులతో పంచుకోవాలి అనుకుంటే నిజ జీవితంలో మీకు పరిచయమైన వారిని మాత్రమే మీ సామాజిక మాధ్యమాలలో ఫ్రెండ్ లిస్ట్‌లో చేర్చుకోండి. అలా చేసినప్పటికీ ఫొటోలు, వీడియోల్లో వ్యక్తిగత సమాచారం, పిల్లల స్కూల్, స్పోర్ట్స్ లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తెలిసే వీల్లేకుండా చూసుకుంటే కొంతవరకు సేఫ్. స్కూల్ బస్, మీ కారు, బైక్ నంబర్లు, ఇంటి పరిసరాల ఆనవాళ్లు మొదలైనవీ సోషల్ మీడియాలో తెలియనివ్వకుండా జాగ్రత్త పడితే మంచిది.అంతేకాదు పిల్లలకు ఏం నేర్పిస్తున్నామనే స్పృహ కూడా ఉండాలి. పిల్లలతో వయసుకు మించిన చేష్టలు, మాటలు, పాటలతో రీల్స్, షాట్స్ చేయించడం పెద్దలకు సరదాగా ఉండొచ్చు. కానీ అవి పిల్లలపై చూపించే ప్రభావం గురించి ఆలోచించాలి. ఇలాంటివాటితో ఎన్నో తప్పులను నార్మలైజ్ చేస్తున్నారు. ‘మా పిల్లలు మా ఇష్టం’ అంటూ బాల్యాన్ని పాడుచేస్తున్న తల్లిదండ్రులూ లేకపోలేదు. ఇంతకుముందున్న చట్టాలు, ప్రస్తుతం వచ్చిన చట్టాల ప్రకారం కూడా పిల్లల గోప్యతకు భంగం వాటిల్లేలా ముఖ్యంగా ఇంటర్నెట్లో అలాంటి పనులకు పాల్పడినవారికి కఠిన శిక్షలున్నాయి. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్వీటినీ దృష్టిలో పెట్టుకోవాలి..పోక్సో, జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం.. పిల్లలు సురక్షితమైన వాతావరణంలో లేరని తెలిస్తే తల్లిదండ్రుల వద్దనుంచైనా సరే పిల్లలను తీసుకొని సేఫ్ హౌస్‌లో ఉంచవచ్చు. ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ , 2023లోని సెక్షన్ 9 ప్రకారం.. చిన్న పిల్లలకు సంబంధించిన వివరాల సేకరణ, గోప్యతపై మూడురకాల నిబంధనలున్నాయి. అవేంటంటే..– పిల్లల సమాచారానికి సంబంధించి తల్లిదండ్రుల ధ్రువీకరణ, సమ్మతిని పొందడం– పిల్లల శ్రేయస్సుకనుగుణంగా వారి డేటాను ప్రాసెస్ చేయడం– పిల్లలను ట్రాకింగ్ లేదా వాళ్ల ప్రవర్తనపై పర్యవేక్షణ, పిల్లలను లక్ష్యంగా చేసుకున్న ప్రకటనలపై నిషేధం.పిల్లల సమాచారం లేదా ఐడెంటిటీని తెలియపరచేవిధంగా ఆన్లైన్లో సమాచారాన్ని ఉంచే వారెవరికైనా వాళ్లు తల్లిదండ్రులైనా సరే పై నిబంధనలు వర్తిస్తాయి. వాటిని ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ చట్టం కింద రూల్స్‌ని రూపొందించే ప్రక్రియలో ప్రభుత్వం ఉంది.ఆన్లైన్లో పిల్లల రక్షణ, పిల్లలందరికీ డిజిటల్ లెర్నింగ్‌ని అందుబాటులోకి తేవడం.. యూనిసెఫ్ ప్రధాన లక్ష్యాలు . ఈ విషయమై అది అన్ని దేశాల్లో దృష్టిపెడుతోంది. 2022, అక్టోబర్‌లో బ్రసెల్స్‌లో పలు దేశాల పాలసీ మేకర్స్, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు,పేరెంట్స్, యువతతో కలసి ‘సేఫర్ ఇంటర్నెట్ ఫోరమ్’ పేరుతో ఒక సదస్సునూ నిర్వహించింది.యురోపియన్ యూనియన్ తమ దేశాల్లో.. ఆన్లైన్లో మైనర్స్ భద్రత కోసం ‘డిజిటల్ సర్వీస్ యాక్ట్’ని రూపొందించింది. ఇది పిల్లలను టార్గెట్ చేసే ప్రకటనలు, ఆల్గరిథమ్స్ని నిషేధించి పిల్లలకు సురక్షితమైన డిజిటల్ స్పేస్‌ని క్రియేట్ చేసేందుకు తోడ్పడుతోంది. అంతేకాదు యూరోపియన్ యూనియన్ ‘స్ట్రాటజీ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్’కి డిజిటల్ వింగ్ అయిన ‘బెటర్ ఇంటర్నెట్ ఫర్ కిడ్స్ స్ట్రాటజీ’ తమ దేశాల్లోని ప్రతి చిన్నారి ఆన్లైన్లో భద్రంగా, గౌరవప్రదంగా సాధికారత సాధించేందుకు యూరప్ అంతటా సేఫ్ ఇంటర్నెట్ సెంటర్స్‌ని ఏర్పాటు చేసింది. ఈ స్ట్రాటజీ కిందే యురోపియన్ కమిషన్ .. పిల్లల వయసుకు అనుగుణంగా డిజిటల్ సేవలు, వాటి ఉత్పత్తుల రూపకల్పనకు కోడ్ ఆఫ్ కండక్ట్‌ని తయారుచేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో పిల్లలనూ భాగస్వాములను చేయనుంది. ఆన్లైన్లో పిల్లల భద్రత కోసం మిగిలిన దేశాలూ ఈ బాటలో నడవాలని యూనిసెఫ్ అభిప్రాయపడుతోంది.మానసిక రుగ్మతలుగానే చూడాలి..సామాజిక మాధ్యమాలలో చూస్తున్న వింతపోకడల వెనుక దిగ్భ్రాంతి కలిగించే మానసిక రుగ్మతులు దాగున్నాయి. పిల్లల సేఫ్టీ సైతం కాంప్రమైజ్ అయ్యేలా పిల్లలపై నేరపూరిత చర్యలకు, వ్యాఖ్యలకు పాల్పడటం అలాంటి రుగ్మతల్లో ఒకటి. మితిమీరిన స్వార్థం, చట్టం పట్ల గౌరవలేమి, ‘వాళ్లు వీడియోలు చేస్తే తప్పులేదు కాని మేము స్పందిస్తే తప్పొచ్చిందా’ అనే మతిలేని వాదనలతో వారిని వారు సమర్థించుకోవడం వంటివీ రుగ్మతలుగానే చూడాలి. వీళ్లిలా తయారవడానికి కారణం కుటుంబ వ్యవస్థలోని లోపాలతోపాటు సమాజంలోని లోపాలు, ప్రిజుడీస్ కూడా! దీన్ని సరిదిద్దుకునే బాధ్యతను తమ తమ స్థాయిల్లో అందరూ తీసుకోవాలి!వీళ్లు సినిమా నుంచి వైరలైన పోస్ట్ దాకా పిల్లలు, పెద్దలు తేడా లేకుండా, లింగభేదం చూపకుండా ఎవరినైనా కామెడీ, డార్క్ కామెడీ పేరుతో రివ్యూ చేస్తారు. ఏ మర్యాదా లేకుండా రోస్ట్ చేస్తారు.– పిల్లలకు సంబంధించి ఏటా ఫిబ్రవరిని సురక్షితమైన, సానుకూలమైన ఇంటర్నెట్ అడ్వొకసీ నెలగా గుర్తిస్తున్నారు. – 2023లో ఛిౌఝp్చటజ్టీ్ఛఛిజి ఆన్లైన్లో పిల్లల డేటా భద్రతా చట్టాలకు సంబంధించి 50 దేశాల్లో సర్వే నిర్వహించింది.– పిల్లల భద్రత, ప్రైవసీకి కట్టుదిట్టమైన చట్టాలున్న దేశాల్లో మొదటి స్థానంలో ఫ్రాన్స్, 2వ స్థానంలో స్వీడెన్, 3వ స్థానంలో ఫిన్లండ్, డెన్మార్క్, చెక్ రిపబ్లిక్, బెల్జియం, ఆస్ట్రియా, జర్మనీ, యూకే, 4వ స్థానంలో సౌది అరేబియా, 5వ స్థానంలో భారత్, 6,7,8,9,10 స్థానాల్లో బ్రెజిల్, చైనా, ఇండోనేషియా, ఈజిప్ట్, హాంకాంగ్ కనిపిస్తాయి. -
ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు!
రాజస్థాన్‌లోని బాడ్మేర్లో విద్యుదాఘాతానికి నలుగురు బలయ్యారు. పిండిమరకు విద్యుత్ ప్రవహించిన నేపధ్యంలో వీరు ఒకరిని కాపాడబోయు మరొకరు మృతి చెందారు. మృతులలో ఇద్దరు చిన్నారులతోపాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బాడ్మేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అర్జున్‌సింగ్ ఇంటిలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంటిలో అర్జున్‌సింగ్ లేడు. అతని భార్య పిండిమరలో గొధుమలను ఆడిస్తుండగా, ఆమె విద్యుదాఘాతానికి గురయ్యింది. బాధతో తల్లి విలవిలలాడుతుండగా, వారి ఇద్దరి పిల్లలను ఆమెను పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. బాధితుల అరుపులు విన్న అర్జున్ సింగ్ బంధువు హఠెసింగ్ అక్కడికు వచ్చి, వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్ని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్ అంజుమ్ తాహిర్ సమా మాట్లాడుతూ పిండిమరకు విద్యుత్ ప్రవాహం జరిగి, దానిని ముట్టుకున్న నలుగురు మృతి చెందారని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇది కూడా చదవండి: నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు! -
టీటీడీ కీలక నిర్ణయం.. నడక మార్గంలో ఆంక్షలు ఇవే..
సాక్షి, తిరుమల: చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు నడక మార్గాల్లో చిన్నారుల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నారులకు టీటీడీ అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. ఇటీవల తిరుమలకు నడకదారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్లమార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. రేపటి(సోమవారం) నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్ని తర్వాతే చిన్నారులను పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతించనున్నట్టు టీటీడీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండవ ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్‌లకు నో ఎంట్రీ అని స్పష్టం చేసింది. మరోవైపు.. తిరుమలలో చిరుత కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి లక్షిత పై దాడిచేసిన చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు ప్రాంతాలలో బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. చిరుత సంచారంపై నిఘా వేశారు. ఇందుకోసం పోలీసు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. చిరుత జాడను కనిపెట్టడానికి దాదాపు 500 కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత భయంతో నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతోంది టీటీడీ అధికారులు. ఇది కూడా చదవండి: తిరుమల నడకమార్గంలో హైఅలర్ట్ జోన్ ప్రకటన -
‘దత్తత’కు మార్గం సులువు..
నేరడిగొండ: శిశువు ‘దత్తత’కు ప్రభుత్వం సులువైన మార్గం తీసుకొచి్చంది. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధత ప్రకారం పిల్లలను దత్తత తీసుకునే అవకాశం కల్పించింది. గతంలో చాలామంది అడ్డదారులు తొక్కి శిశువులను దత్తత తీసుకున్న ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఇకపై అలాంటి చర్యలకు దిగితే న్యాయపరంగా పోలీసు కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. దత్తత కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రక్రియను పూర్తిచేసి శిశువును దత్తత తీసుకునే వెసులుబాటు కల్పించింది. శిశువుల విక్రయాలు దత్తత పేరుతో గతంలో ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో శిశువులను విక్రయించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతోపాటు ఆడపిల్లలపై వివక్షతో భ్రూణహత్యలు జరగడంతో పాటు చెత్తకుప్పల్లో పడేస్తున్న విషయం విధితమే. దీన్ని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా పూర్తిస్థాయిలో ఫలితం లేకుండా పోయింది. చిన్నారులను దత్తత తీసుకునే ప్రక్రియ గతంలో చాలా సంక్లిష్టంగా ఉండేది. అనేక రకాల పత్రాలు పొందుపర్చాల్సి వచ్చేది. దీంతో చాలా మంది దంపతులు అడ్డదారుల్లో శిశువులను దత్తత తీసునేవారు. అలా కొనుగోలు చేసిన వారిలో చాలా మంది న్యాయ సమస్యలు, కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది. దత్తత విధానం.. శిశువు దత్తత తీసుకునే దంపతులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే శిశువును దత్తత తీసుకునే చట్టపరమైన అవకాశం ఉంటుంది. దంపతులు, శిశువు వివరాలని్నంటిని గోప్యంగా ఉంచుతారు. దంపతుల ఫొటో, పాన్‌కార్డు, జనన ధ్రువపత్రాలు, నివాస, ఆదాయ, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు లేవంటూ వైద్యాధికారి జారీ చేసిన పత్రం, వివాహ రిజిస్ట్రేషన్ తదితర ఆరు రకాల పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దంపతులకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. వారి సీనియారిటీ ప్రకారం దరఖాస్తులు ప్రస్తుత దశ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటే దత్తత ఇస్తారు. శిశువు, లింగం వివరాలు, వయస్సు, ఏ ప్రాంతానికి చెందిన శిశువు అవసరం తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు దత్తత ఇచ్చే అధికారాన్ని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు దాఖలు పర్చారు. నూతన విధానం అమలు చేసిన తర్వాత శిశువుల దత్తత కోసం దంపతులు ముందుకొస్తునట్లు అధికారులు పేర్కొంటున్నారు. కావల్సిన ధ్రువపత్రాలు శిశువును దత్తత తీసుకునే దంపతులు ఇద్దరు కూడా పలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఆదాయ ధ్రువపత్రం, పెళ్లి రిజిస్ట్రేషన్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్, జనన ధ్రువపత్రాలు, జంట ఫొటోలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పత్రాలను ఐసీపీఎస్ కార్యాలయంలో సమర్పించాలి. వీటితో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్, డీడబ్ల్యూఅండ్ సీడీఏ ఆదిలాబాద్ పేరిట రూ.6 వేల డీడీ తీయాల్సి ఉంటుంది. Cara.nic.in వెబ్సైట్ పారెంట్ లాగిన్‌లో రెసిడెంట్ ఇండియన్ పారెన్్టలో దత్తత కోరే తల్లిదండ్రుల వివరాలన్నీ పొందుపర్చాలి. అనంతరం అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. Praspective Adoptive Pareents(PAPs) పొందిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను భద్రపర్చుకొని సీనియారిటీని ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.6 వేలు, దత్తత తీసుకునే సమయంలో రూ.40 వేలు, దత్తత పొందిన ఆరు నెలలకు రూ.8 వేలు ప్రభుత్వానికి డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దత్తత కోసం ఇప్పటివరకు 269 దరఖాస్తులు జిల్లా కేంద్రంలో 2005లో శిశుగృహను ఏర్పాటు చేశారు. శిశువుల దత్తత కోసం ఇప్పటివరకు 269 మంది దంపతులు దరఖాస్తులు చేసుకున్నారు. 108 మంది శిశువులను దత్తత ఇచ్చారు. 73 మంది బాలికలు, 36 బాలుర శిశువులను అందజేశారు. మరో 183 మంది వెయిటింగ్లో ఉన్నారు. ఇందులో 96 మంది శిశువులను భారతదేశానికి, 12 మందిని ఇతర దేశాలకు దత్తత ఇచ్చారు. పారదర్శకంగా ప్రక్రియ దత్తత ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. శిశువును దత్తత తీసుకునే వారు మొదట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పైరవీలకు ఆస్కారం లేకుండా చూస్తున్నాం. సీరియల్ ప్రకారం పక్షపాతం లేకుండా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తాం. దరఖాస్తు పరిశీలన అనంతరం చిన్నారులను దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది. – రాజేంద్రప్రసాద్, డీసీపీఓ, ఆదిలాబాద్ -
బాలలు భళా.. తమదైన మార్క్‌తో సత్తా చాటారు..
ర్యాంకుల కోసం పరుగెత్తడం. ఒకరితో ఒకరు పోటీ పడటమే చదువుల లక్ష్యంగా మారిన ప్రస్తుత తరుణంలో ఎంతోమంది చిన్నారులు చదువుతో పాటు నచ్చిన రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. వైవిధ్యంగా, విభిన్నంగా ఆలోచిస్తున్నారు. సినిమాలు, సంగీతం, ఆటలు.. ఇలా ఏ రంగమైనా సరే సృజనాత్మకతను సమున్నతంగా ఆవిష్కరిస్తున్నారు. వీరి సృజనకు తల్లిదండ్రులు పట్టం కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో వైవిధ్యాన్ని, సృజనాత్మకతను చాటుతున్న నగరంలోని కొందరు చిన్నారులపై కథనం.. నటన అద్భుతం.. ‘అక్షర’ సంగీతం.. ఆటమిక్ ఎనర్జీ సైంటిస్ట్ చంద్రశేఖర్, ఆశాలత దంపతుల రెండో కూతురు అక్షర. రాజన్న, బాహుబలి వంటి చిత్రాల్లో తన అద్భుత గాత్రంతో అలరించిన అమృతవర్షిణి చెల్లెలు. ఇప్పుడు బేగంపేట్‌లోని కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది అక్షర. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తూ మేటి బాల నటిగా ప్రశంసలనందుకొంటోంది. సర్దార్ గబ్బర్‌సింగ్, స్పైడర్, బ్రహ్మోత్సవం, సర్కారువారి పాట, భాగమతి వంటి 25కు పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘అహ నా పెళ్లంట’ అనే ఓ మ్యూజికల్ ఆల్బమ్‌ను కూడా సొంతంగా రూపొందించింది. ఎన్సీసీలోనూ సత్తా చాటుకుంటోంది. ‘సినిమాలో నటించడం అభిరుచి మాత్రమే. డాక్టర్ కావాలనేదే నా ఆశయం’ అంటోంది అక్షర. నగరానికి చెందిన కపిల్, చాణక్య, విశ్వతేజ అనే బాలురు ‘అచీవర్’ అనే ఓ బాలల చిత్రంలో నటించారు. ఇటీవల కాలంలో విడుదలవుతున్న సినిమాల్లో పిల్లలకు నచ్చే ఎలాంటి ఇతివృత్తాలు లేకపోవడంతో దర్శకుడు తల్లాడ సాయికృష్ణ ఈ సినిమాను రూపొందించారు. చదువుకొనే వయసులోనే సామాజిక సేవను కూడా ఒక అభిరుచిగా, బాధ్యతగా భావించే ముగ్గురు పిల్లలు ప్రశాంతమైన హైదరాబాద్‌లో ఓ ఉగ్రవాద ముఠా బాంబు పేలుడుకు చేసిన కుట్రను అడ్డుకుంటారు. ఉగ్రవాదులు స్కూల్లో, ఆలయంలో, మార్కెట్లో పేల్చేందుకు సిద్ధం చేసిన బాంబులను తమకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో నిరీ్వర్యం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. బాలల చిత్రాల పోటీల కోసం పంపించనున్నట్లు సాయికృష్ణ తెలిపారు. ఫుట్‌బాల్‌తో ‘స్నేహం’ షేక్‌పేట్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న పొన్నాపల్లి స్నేహ ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా రాణిస్తోంది. ఐసీఎస్ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించిన ఈ చిన్నారి జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సంగీతంలోనూ ప్రావీణ్యం సంపాదించింది. ‘నాన్న సారథి టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ‘ఫుట్‌బాల్ పట్ల ఉన్న ఇష్టాన్ని గమనించిన అమ్మా, నాన్న నన్ను ప్రోత్సహించారు. అక్క శ్వేత బాగా పాడుతోంది. నేను మాత్రం ఫుట్‌బాల్ ఆటలోనే మరిన్ని విజయాలను సాధించాలని నిర్ణయించుకున్నాను’ అని వివరించింది స్నేహ. -
బంధువుతో వివాహేతర సంబంధం.. భర్త బయటకు వెళ్లగానే..
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారంటూ.. బిడ్డలకు విషమిచ్చిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపం కులకాచి ప్రాంతానికి చెందిన జగదీష్ (34) తాపీ మేస్త్రీ. ఇతని భార్య కార్తీక (24). ఈ దంపతులకు కుమార్తె కాంచన (04), కుమారుడు చరణ్ (02) ఉన్నారు. బుధవారం సాయంత్రం ఆడుకుంటున్న చరణ్, కాంచన హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. దీంతో బంధువులు ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలు విష పదార్థాలు తిని ఉన్నట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో భాగంగా కార్తీకకు బంధువు సునీల్ (21)తో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలిసింది. ఈ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న ఇద్దరు బిడ్డలకు కార్తీక పాయసంలో విషమిచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించింది. వీరిలో చరణ్ మృతి చెందగా కాంచన ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మార్తాండం పోలీసులు కార్తీకను గురువారం అరెస్టు చేశారు. -
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లల పై తక్కువే
-
ఇక 12 ఏళ్ల పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ .. ఎక్కడో తెలుసా?
సింగపూర్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. మొదటి దశలో కంటె సెకండ్‌వేవ్‌లో వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో, అనేక దేశాల్లోని ప్రజలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే, ఈ వైరస్‌ను ఎదుర్కొవడానికి వ్యాక్సిన్‌ను తప్పకుండా వేయించుకోవాలని డబ్ల్యూహెచ్‌వో ఇదివరకే సూచించింది. అదే విధంగా, వ్యాక్సిన్ తీసుకొనే వయస్సును కూడా తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, సింగపూర్ దేశం కరోనా వ్యాక్సిన్‌ను తీసుకునే వారి వయస్సును మరింత కుదించి వార్తల్లోకి నిలిచింది. ఈ దేశం రేపటి నుంచి (మంగళవారం) 12 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ను వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, అతి చిన్న వయసులోని వారికి వ్యాక్సిన్‌ను వేస్తున్న తొలి దేశంగా నిలిచింది. కాగా, సింగపూర్ జాతీయ దినోత్సవమైన ఆగస్ట్ 9 నాటికి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ ను వేయించుకోవాలని ఆ దేశ ప్రధాని లీ సేన్లూంగ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సింగపూర్ జనాభాలో మూడవ వంతు అంటే.. 5.7 మిలియన్ల ప్రజలు మొదటి డోస్ ను వేయించుకున్నారని తెలిపారు. ఈ వైరస్ కట్టడికి నిబంధలను పాటించడం, టీకా వేసుకోవడంతో మాత్రమే ఎదుర్కొనగలమని అన్నారు. కొత్త కేసుల సంఖ్య తగ్గితే ఆంక్షల నుంచి క్రమంగా మినహాయింపులు ఇస్తామని తెలిపారు. రాబోయే మరో 2 నెలల్లో మరిన్ని కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్లను మరింత వేగంగా అందిస్తాయని పేర్కొన్నారు. అదే విధంగా, కరోనా పరీక్షల సంఖ్యను పెంచడం, వైరస్ బాధితులను ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫైజర్ బయోఎంటేక్, మోడరనా వ్యాక్సిన్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జాబితాలో ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా, సినోఫార్మ్ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతికి అనుమతిస్తున్నట్లు సెన్లూంగ్ తెలిపారు. సింగపూర్ ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన తర్వాత చైనా కు చెందిన సినోవాక్ బయోటేక్ నుంచి దాదాపు రెండు లక్షల వ్యాక్సిన్ డోసుల పంపిణికి అనుమతి ఇస్తామని తెలిపారు. కాగా, వ్యాపారానికి, సరుకు రవాణాకు కేంద్ర బిందువైన సింగపూర్‌లో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని లీ సేన్లూంగ్ అన్నారు. అదే విధంగా, వైరస్‌తో సహజీవనం అలవాటు చేసుకోవాలని సూచించారు. -
శానిటైజర్ పోసుకొని ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
-
పిల్లల ఊహాశక్తికి సరైన ఇంధనం.. ‘టిక్లింగ్ టేల్స్’
పిల్లల ఊహాశక్తికి సరైన ఇంధనం కథ. పిల్లల మెదళ్లను చురుగ్గా మార్చగలిగే సాధనం కథ కానీ, ఈ డిజిటల్ యుగంలో యంత్రాలతో కుస్తీ పడే పిల్లలకు కథ చేరువలో లేదు.నాయనమ్మ, తాతయ్య లేని చిన్న కుటుంబాలు.సంపాదనలో తల్లీదండ్రులవి తీరికలేని క్షణాలు. ఇలాంటి లోకంలో పిల్లల మానసిక శక్తి గురించి ఆలోచించారు డాక్టర్ శ్వేత.టిక్లింగ్ టేల్స్ అంటూ పిల్లలకోసం కథల పందిరి అల్లుతున్నారు. రాజస్థాన్‌లో పుట్టి పెరిగిన శ్వేత వృత్తిరీత్యా దంతవైద్యురాలు. తల్లి అయ్యాక మూడేళ్ల కొడుకు తను ఏం చెప్పినా ‘ఊ..’ కొట్టే విధానం ఆమెను కట్టిపడేసింది. ఎంతో తెలుసుకోవాలనే ఆరాటం గల ఆ చిన్న వయసు ‘కథ చెప్పవూ’ అని అడుగుతున్నట్టుగా అనిపించేది’ అంటారు శ్వేత. ఆ ఆలోచనే ఇప్పుడు వేలాది మంది పిల్లలకు కథలు చెప్పేలా చేసింది అంటారామె. అక్కణ్ణుంచే ‘టిక్లింగ్ టేల్స్’అంటూ లిటిల్ స్టార్స్‌కి కథల పందిరి వేస్తోంది. తల్లిదండ్రులకు కథలు చెప్పడంలో నైపుణ్యాలు చెబుతుంది. స్కూళ్లలో కథల వర్క్‌షాప్స్ నడుపుతోంది. పిల్లల పుట్టిన రోజులు, పాఠశాల వార్షికోత్సవాలు.. అది ఇది అని ఏమీ లేకుండా పిల్లలు ఎక్కడుంటే అక్కడ కథలతో దోస్తీ చేయిస్తుంది. రచయిత్రిగా, కథకురాలిగా, శిక్షకురాలిగా, కోచ్‌గా, టిక్లింగ్ టేల్స్ డైరెక్టర్‌గా డాక్టర్ శ్వేత అద్భుతమైన పాత్రలను పోషిస్తోంది. చదవని వారికి వినిపించే కథ ‘చిన్నతనం లో తల్లితో కలిసి భయం భయంగా లైబ్రరీకి వెళ్లిన తొలిరోజులను ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటుంది శ్వేత. అక్కడ తను చూసిన కథల పుస్తకాలు పఠనం పట్ల ఎలా ఆసక్తిని పెంచిందో చెబుతుంది. ఆ ఆసక్తే ఇప్పుడు ప్రతిభావంతులైన కథకుల బృందానికి నాయకత్వం వహించేలా చేసింది’ అంటోంది ఈ డాక్టర్. ‘బాగా చెప్పాలంటే బాగా చదవాలనే విషయాన్ని ఎప్పుడో గ్రహించాను. ఇప్పుడు పిల్లలను చూడండి. వారు ఎంతసేపూ వీడియో గేమ్స్ ఆడటమే చూస్తున్నాం. కథల పుస్తకాలు చదవడం అనేదే మనం చూడటంలేదు. ఈ తరం ఎక్కడికి వెళుతుందో అనే ఆందోళన నాది. నా కొడుకుతో కాసేపు సమయం గడిపినా వాడిని కథల్లోకి తీసుకెళ్లిపోతాను. నేను చదివిన విషయాలన్నీ వాడికి కథలుగా మార్చి చెబుతుంటాను. వాడిపై ఆ కథల ప్రభావం, ఫలితాన్ని చూసినప్పుడు తల్లిగా నా ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా మారిందో అర్ధమైంది. అప్పుడే మా ఇంటి నాలుగు గోడలు దాటి కథలు వినే పిల్లల సంఖ్య పెరగాలన్న విషయం గ్రహించాను. ఎక్కువమంది పిల్లలకు కథలు వినసొంపుగా చెప్పాలంటే నేను మరిన్ని పుస్తకాలతో ప్రేమలో పడాలి. ఈ వాస్తవాన్ని గ్రహించి ఇంట్లో పుస్తకాల లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాను. ఎవరైనా తల్లితండ్రులు ఈ సూత్రాన్ని పాటించవచ్చు’ అంటారు డాక్టర్ శ్వేత. ఈ కథాస్టార్ బృందంలో ఆరుగురు కథలు చెప్పే ప్రతిభావంతులైన తల్లులు ఉన్నారు. ఈ బృందం రేపటితరానికి కథలతోఎలాంటి మార్గం వేయాలో సమావేశాలు ఏర్పరచుకుంటారు. తాము చేయబోయే, చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రణాళికలు రచిస్తుంటారు. కథా ప్రపంచంలోకి ప్రయాణం ‘టిక్లింగ్ టేల్స్’ అంటూ కథలు చెప్పడం 2013 లో ప్రారంభించింది డాక్టర్ శ్వేత. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదామె. టిక్లింగ్ టేల్స్ ముఖ్య ఉద్దేశం పాఠకులను పెంచడం, పిల్లలను తిరిగి పుస్తకాల లోకంలోకి తీసుకురావడం, వారిని చదివించేలా చేయడం, కథ చెప్పే సెషన్ల తోపాటు, ఉపాధ్యాయులతో శిక్షణా కార్యక్రమాలు, పాఠశాల సెషన్లు ఏర్పాటు చేయడం వంటివీ ఉంటాయి. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కథ ‘కథలు వినడం ప్రతి బిడ్డ జన్మహక్కు. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పిల్లలకి మంచి ఆహారాన్ని ఇస్తారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవితం కోసం మనసు కూడా హెల్దీగా ఉండాలి. అందుకు ప్రతి బిడ్డకు మంచి ఆలోచన విధానం కలిగించాలి. కథలు ప్రతి బాల్యంలో అంతర్భాగం గా మారాలి. ఇంట్లో ఒక మేధావిని పెంచాలనుకుంటే ఆ బిడ్డకు అద్భుత కథలు చెప్పాలి. అలాగని ఉనికిలో లేని విషయాల గురించి చెప్పకూడదు. కథ ద్వారా ఏది మంచిది, ఏది మంచిది కాదనేది వారికి తెలిసిపోవాలి. కథలు చెప్పేటప్పుడు పిల్లలను తక్కువ అంచనా వేయవద్దు..’ అంటూ తల్లిదండ్రులకు, టీచర్లకు తన వర్క్‌సెషన్ల ద్వారా వివరిస్తారు డాక్టర్ శ్వేత. ప్రస్తుతం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న టిక్లింగ్ టేల్స్ వర్చువల్ ప్లానెట్ వెంచర్ ద్వారా కథా శ్రవణాన్ని అందిస్తోంది. పిల్లలకు పుస్తకాలు అందేలా చూడటంతోపాటు మ్యూజిక్‌తో కూడిన ఆడియో కథలనూ జతచేసి ఇస్తున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఆసక్తికరంగా ఆడియో కథల పుస్తకాల ద్వారా పదాల ఉచ్చారణ, పఠనం, శబ్దాన్ని నేర్పుతున్నారు. పిల్లలు కథను గుర్తుకు తెచ్చుకోవడానికి, తిరిగి ఆస్వాదించడానికి దేశవ్యాప్తంగా పప్పెట్ షోలను కూడా నిర్వహిస్తాం’ అని చెబుతున్నారు ఈ డాక్టర్. -
ఒక తల్లి పాము..70 పిల్ల పాములు..
నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామం దొమ్మరిగడ్డ వాడలో ఆదివారం పాములు కలకలం రేపాయి. మహ్మద్ మైబెల్లి ఇంటి పక్కన కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఈక్రమంలో వారు, వారికి పక్కనే ఉన్న రాతి కట్టడం వద్ద ఒక పాము కనిపించింది. వెంటనే పిల్లలు భయంతో కేకలు వేశారు. వారి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారు పాము కనిపించిన విషయాన్ని చెప్పారు. దీంతో , ఆ చుట్టుపక్కల గాలించారు. వారికి ముందుగా ఒక తల్లిపాము కనిపించింది. ఆ వెంటనే.. ఒకటి దాని వెనుక మరొకటి దాదాపు 70 పాములు బయటపడ్డాయి. భయపడిపోయిన గ్రామస్థులు వాటిని కట్టేలతో కొట్టి చంపేశారు. -
నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
-
నవ్వుల కాంతి
ఇంతటి పరిపూర్ణమైన నవ్వును ఏ లాఫింగ్ క్లబ్ నవ్వించగలుగుతుంది? వీళ్లకు ఇంతటి సంతోషాన్ని ఎవరిచ్చారు? ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపు ఇచ్చిందా? సరస్సులో విచ్చుకున్న కమలం రేకలు ఇచ్చాయా? ఒకరి భావం ఒకరికి ఎలా అర్థమై ఉంటుంది? అయినా.. భావాన్ని పంచుకోవడానికి భాష అక్కర్లేదు, బాల్యం ఉంటే చాలు కదా! ఈ చిన్నారులను చూడండి. పదాలు తప్ప వాక్యాలు మాట్లాడటమే అలవాటు కాని వయసే ఇంకా. అలతి అలతి మాటలైతేనే నాలుక తిరుగుతుంది. పదబంధాలనైతే విరగ్గొట్టి పలకాల్సిందే. విరిగే కొద్దీ పటికబెల్లంలా ఉండే తియ్యటి పలుకులవి. ఒకరి భావాలకు బదులివ్వడానికి ఒకరి మనసు ఎంతగా ఉద్వేగ పడుతోంది! భావం గుండెల్లో సుడులు తిరుగుతుంటుంది కానీ అన్నేసి భావనల్ని భాషించలేని వయసు. అయినా సరే.. ఒకరి మనసు మరొకరి మనసుకు తాకినట్లు.. మనసారా నవ్వుకుంటున్నారు. అనిర్వచనీయమైన స్నేహ పరిమళాలను గుబాళింప జేస్తున్నారు. గుండెల నిండా ఆనందం తొణికిసలాడుతుంటే పొంగిపొర్లుతున్న సంతోషాన్ని ఒడిసి పట్టుకోవడంతో.. విరిసిన నవ్వుల పువ్వులివి. ఈ భావ వీచికలు ఆరాధ్యకృతి (2), కాత్యాయిని (5). -
ప్రథమ పురుష
‘‘ఏమైంది, దానికి?’’ ‘‘గేటు వేస్తుంటే వేలు నలిగింది!’’ ‘‘వేలు నలగడం ఏమిటీ? ఎవరు గేటు వేశారు? ఎక్కడ గేటు వేశారు?’’ ‘‘మనింట్లోనేనండి!’’ ‘‘మనింట్లో గేటు లాగడం ఏమిటి? పైగా పిల్ల లాగడం ఏమిటి?’’ ‘‘అబ్బా స్కూల్ బస్ దిగింది. దిగి గేటు తీసుకుంది.’’ ‘‘స్కూల్ బస్సు దిగితే, నువ్వేం చేస్తున్నావు?’’ ‘‘అప్పుడే వంట ముగించుకుని, స్నానానికి వెళ్ళానండి!’’‘‘పిల్ల స్కూల్ నుంచి వస్తుందని తెలుసు కదా? స్నానానికి వెళ్ళడం ఏమిటి?’’ ‘‘టైముందనుకున్నానండి!’’ ‘‘టైముండటం ఏమిటే! స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారా? ఈరోజు బస్సు లేటవుతుందని?’’ ‘‘అలా కాదండి. పిల్ల వచ్చేలోపు స్నానం ముగించేయ్యొచ్చుకదా అని!’’ ‘‘రోజూ ఎలా చేస్తున్నావు?’’ ‘‘పిల్ల వచ్చింతర్వాత, దానికి అన్నం పెట్టి నేను స్నానానికి వెళ్తున్నానండి.’’ ‘‘మరి ఈ రోజు ఎందుకు ఆగలేకపోయావ్?’’ ‘‘చెబుతున్నాను కదండి టైముందికదా అని!’’ ‘‘ఎక్కడిది టైము? రోజూ వచ్చినట్టే వచ్చిందికదా ఈరోజు కూడా? లేటవ్వలేదుగా?’’ ‘‘లేటవ్వలేదండి’’ ‘‘మరి?’’ ‘‘....’’ ‘‘మాట్లాడవే! అలా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడతావేంటి!’’ ‘‘అన్నం కలుపుతా’’ ‘‘అన్నం కలపడం ఏమిటి?’’ ‘‘పిల్లకి అన్నం కలపాలి కదా!’’ ‘‘ఔను, ఐతే?’’ ‘‘అన్నంలో పప్పు’’ ‘‘పప్పు ఉడకలేదా?’’ ‘‘అది కాదండి!’’ ‘‘మరేవిటి?’’ ‘‘కూర కలుపుదాం అనుకున్నాను.’’ ‘‘కలిపావా?’’ ‘‘లేదండి!’’ ‘‘ఎందుకని?’’ ‘‘...’’ ‘‘మాట్లాడవేం?’’ ‘‘నిన్న మీరు తెస్తానన్నారు తేలేదు.’’ ‘‘ఏం తేలేదు?’’ ‘‘కంది పప్పు!’’ ‘‘సవాలక్ష సమస్యలతో నేను ఆఫీసులో ఏడుస్తా ఉంటే నీకు, నీ పిల్లకి పప్పు తేలేదన్నమాట. ఇప్పుడు పిల్ల వేలు నలగడానికి నేనే కారణం అంటున్నావా?’’ ‘‘అలా కాదండి. రోజూ దానికి పప్పు పెట్టమని మీరే కదా అన్నారు! పప్పు నిండుకుంది! అందుకని కూర కలుపుదామనుకున్నాను’’ ‘‘కలపాల్సింది! ఎందుకని కలపలేదు?’’ ‘‘కూరలేదు.’’ ‘‘కొంపలో కూరలేదా, కూరల్లేవా?’’ ‘‘కూరలున్నాయండి, బంగాళదుంపల్లేవు!’’‘‘అదేంటి?’’ ‘’’పిల్ల బంగాళాదుంప ఫ్రై అయితేనే తింటోందండి!’’ ‘‘చెప్పవే, చెప్పు. పప్పు తేలేదు.. బంగాళాదుంప తేలేదు.. ఇంకా?’’ ‘‘....’’ ‘‘ఫోనుందిగా? ఏ బిగ్ బాస్కెట్కో, అమెజాన్కో ఆర్డరివ్వొచ్చుగా’’ ‘‘మీరేగా ఎఫ్‌బిలో మునిగిపోతున్నానని వైఫై కనెక్షన్ పీకించేశారు! నా ఫోన్‌కి జీపీఆర్ఎస్ కూడా లేదు!’’ ‘‘మరి నన్ను చూడు, నా అందం చూడు, నా జడ చూడు, నా ఇది చూడు అని పోస్ట్‌లతో చంపేస్తున్నావ్గా! దానికి సొల్లుగాళ్ళంతా లైకులు, హార్టులూ! నాకెలాగుండాలే?’ ‘‘ఏదో టైంపాస్‌కి ఒక పోస్ట్ చేస్తే, దానికి ఇన్ని మాటలంటున్నారు!’’ ‘‘టైంపాస్ ఏమిటే? పెళ్ళి చేసుకున్నప్పుడే చెప్పా! వుద్యోగం చేసుకునే పిల్లొద్దు. నన్ను, నా పిల్లల్ని చూసుకునే పెళ్ళాం కావాలని! పిల్లని, నన్ను సరిగ్గా చూసుకుంటే నీకు ఇంకెక్కడిదే టైము? నీకు టైమెక్కువయికాదూ, ఈరోజు పిల్ల వేలు నలిగింది?’’ ‘‘అదేమి కాదు! పచ్చ కామెర్లోడికి అంతా పచ్చగానే కనపడుతుందంట!’’ ‘‘ఏమిటే కూసావ్?’’ ‘‘మీరు మీ కొలీగ్ అన్జెప్పి దాన్ని వాళ్లింటిదాకా రోజూ డ్రాప్ చెయ్యడం లేదా? పిల్లి పాలు తాగుతూ... లాగుంది! ఫ్లాట్‌లో పడి ఉంటాను కాబట్టి నాకు ఏం తెలీదనుకోకండి!’’ ‘‘నేను మగాడ్ని! నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా! నా ఇష్టం వచ్చినోళ్ళతో తిరుగుతా.....’’ ‘‘మాటలు జాగ్రత్తగా రానివ్వండి!’’ ‘‘ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? చెప్పు!’’ ‘‘నేనెళ్ళిపోతా!’’ ‘‘ఎక్కడికి వెళ్ళిపోతావ్?’’ ‘‘మా ఇంటికి!’’ ‘‘ఇంటికా, కాలేజి లవ్వర్ దగ్గిరకా?’’ ‘‘ఎవడండి లవరు? నాకెవ్వరు లేరు!’’ ‘‘లవరూ లేక, ఎవరూ లేక ఎక్కడికెళ్తావే?’’ ‘‘మా పుట్టింటికి పోతా.’’ ‘‘వెళ్తే మళ్ళీ రావు ఈ ఇంటికి!’’ ’’ ఈ బెదిరింపులకే!’’ ‘‘అంటే ఇది వరకు రానిచ్చాననేనా?’’ ∙∙ ‘‘హలో! అవున్రా నేనే. బావా అని పిలవకు! ఈ రాత్రి నీ చెల్లాయి నా ఇంట్లో గడపడానికి వీల్లేదు! వెంటనే దాన్ని తీసుకెళ్లిపో!’’ ‘‘...’’ ‘‘నేను వినను. బావా లేదు, గీవా లేదు. ఇదే ఆఖరు సారి! దానికి మొగుడంటే అలుసైపోయింది. నే విన్ను! అంతే! ’’ ∙∙ ‘‘డాడీ... మమ్మీ...’’ ‘‘ఏరమ్మా, ఆయన?’’ ‘‘లోపల పడుకున్నారమ్మా!’’ ‘‘అదేంటి?’’ ‘‘రాత్రి ఫ్రెండ్స్ తీసుకొచ్చారింటికి ఆయన్ని!’’ ‘‘రాత్రంతా ఆయనింటికి రాలేదా?’’ ‘‘లేదు, నాన్నగారండి!’’ ‘‘అమ్మా. తాతీ!’’ ‘‘బుజ్జీ... డాడి, తాతి టాకింగ్! మనం బయటికి వెళ్ళి ఐస్‌క్రీం తిందాం, ఏం?’’ ‘‘ఏరా! అసలే మీ అక్క దానికి సరిగ్గా తిండిపెట్టడం లేదు! ఇప్పుడు నువ్వు దిగావ్! ఐస్‌క్రీం అంటూ! జలుబు చేస్తుంది! ఐస్క్రీంలూ చాక్లెట్లు వద్దు!’’ ‘‘అలాగే, బావగారండి.’’ ‘‘ఈ నక్క వినయాలకేం గాని! దానికేమన్నా కొనిపెట్టావో చంపేస్తా!’’ ‘‘ఏదో అలసటతో ఆలస్యం అయిందంటండి! సరిగ్గా చూసుకోలేదు! కందిపప్పు జార్ నిండుకుంది! పిల్లేమో అన్నీ తినదాయే! మీరే కాస్త అల్లుడుగారికి నచ్చజెప్పండి!’’ ‘‘ఏమిటే నచ్చజెప్పడం! నువ్వు దాన్ని వెనకేసుకొచ్చావు ఇన్నాళ్ళు! ఇప్పుడు అది సంసారం చేసుకోవాలా వద్దా! కాస్త ఇంగితం ఉండొద్దు! పెళ్ళైపోయింది. తన కుటుంబం. మంచి, చెడూ చూసుకోవాలా, వద్దా?’’ ‘‘చిన్న పిల్లండి!’’ ‘‘చిన్న పిల్లేంటే! అయిదేళ్ళ పిల్లకి తల్లి! ఇంకా చిన్నపిల్లంటావ్! నువ్వు పెంచావుగా దాన్ని! నువ్వు తల్లివేగా? ఇదేనా మీ పెంపకం అని అడిగితే, నా తల ఎక్కడ పెట్టుకోను?’’ ‘‘అదేంటండి అలాగంటారు? మధ్యలో నేనేం చేశాను?’’ ‘‘నువ్వు దానికి కాస్త వంటా, వార్పు నేర్పుంటే బాగుండేది.’’ ‘‘మీరేగా దాని జీవితం బాగోవాలంటే బాగా చదవాలని, చదివించారు! అది ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకోనిచ్చారు.’’ ‘‘ఔనే, చదివించాను. వంట, గింటా నేర్పొద్దన్నానా?’’ ‘‘దానికి టైమెక్కడిదండి? టెంత్‌కి వచ్చినప్పట్నుంచి ట్యూషన్లు, స్పెషల్ క్లాసులు సరిపోయినవిగా! మీరేగా పాపం పిల్ల నలిగిపోతోందే, తరువాత చూద్దాం అని అన్నారు!’’ ‘‘ఔనే, అన్నాను. మరి కాలేజి రోజుల్లో ఏం చేసి తగలడ్డావ్?’’ ‘‘ఇప్పుడవన్నీ ఎందుకులేగాని, అల్లుడు గారు మట్టుకు అలా తిట్టొచ్చా? తప్పు కదండి!’’ ‘‘ఏం తప్పు? మనమ్మాయి చేసింది తప్పు. ఇది మొదటిసారా? పదోసారో, పదిహేనో సారో! ఆయనకి మట్టుకు విసుగు పుట్టదా? ఎన్నోసారి మనకి ఫోను చెయ్యడం? మనం పరిగెత్తుకుంటూ రావడం? ఆయన చెబుతునే ఉన్నాడు! నన్నూ, పిల్లని చూసుకునే భార్య కావాలి, అది చాలని. ఒక అత్తగారు లేదు! ఒక మామగారు లేరు! మరదళ్ళు లేరు! మరుదులు లేరు! వాళ్ళ ఆరడిల్లేవు! ఇద్దరంటే ఇద్దరు! భార్య, భర్త, పిల్ల! జాగ్రత్తగా చూసుకోవద్దు?’’ ‘‘మొగుడూ, పెళ్ళాలన్న తరువాత ఏమీ ఉండకుండా ఎలా ఉంటాయండి?’’ ‘‘అయితే ఏం చెయ్యమంటావ్?’’ ‘‘కాస్త నెమ్మదిగా విడమరిచి చెప్పండి, అల్లుడిగారికి. వింటారాయన.’’ ‘‘ఆ! వింటాడు, నేను విన్నానా?’’. - అనిల్ అట్లూరి -
వీడేం తండ్రిరా బాబు..!
సాక్షి, జైపూర్ : రాజస్థాన్‌లో ఓ తండ్రి దారుణంగా ప్రవర్తించాడు. కన్న బిడ్డలనే గొడ్డును బాదినట్లు బాదాడు. ఏమాత్రం జాలి దయ లేకుండా కొడుకును తాడుతో కట్టి సీలింగ్‌కు వేలాడ దీసి కొట్టగా అది చూసి పారిపోతున్న మూడేళ్ల తన కూతురుని కాలితో తన్ని కిందపడేసి కర్రతో చావు దెబ్బలు కొట్టాడు. ఈ దృశ్యాలను అతడి సోదరుడు వీడియో తీసి పోలీసులకు పంపించడంతో అతడిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని రాజాసమానంద్ అనే ప్రాంతంలో చైన్ సింగ్ (32) అనే వ్యక్తి ఉన్నాడు. అతడికి ఓ పాప, బాబు. వారిలో బాబుకి ఐదేళ్లుకు కాగా పాపకు మూడేళ్లు. అయితే, వారిద్దరు తమ ప్యాంట్లకు మట్టి అంటించుకున్నారనే కారణంతో చైన్ సింగ్ వారిపై దాడికి దిగాడు. కొడుకు చేతులను తాడుతో కట్టి సీలింగ్ వేలాడదీసి కొట్టగా కూతురును కాలితో తన్నాడు. వారు దెబ్బల బాధకు ఏడుస్తుంటే సోదరుడు వాట్టా సింగ్ మాత్రం వీడియో తీసి పోలీసులకు పంపాడు. కాగా, పిల్లలను కొడుతుంటే ఆపకుండా వీడియో తీసినందుకు పోలీసులు వాట్టా సింగ్‌ను కూడా అరెస్టు చేశారు. కాగా, చైన్ సింగ్ దాడి చేస్తుంటే అతడి భార్య కూడా భయంతో అతడిని అడ్డుకోలేకపోయిందట. జువెనైల్ యాక్ట్ కింద చైన్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి జైలులో వేశారు. -
నాగార్జున సాగర్.. ఒక అరుదైన ముచ్చట
నాగార్జున సాగర్.. ఇది ఒక ఆధునిక దేవాలయం. దాదాపు పన్నేండేళ్ల శ్రమకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చాలా భాగం హరితవనంగా మారడానికి ఈ ఆనకట్టే కారణం. నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లాల మధ్య కృష్ణా నదిపై నాగార్జున సాగర్ నిర్మించారు. ఇది దేశంలోనే అతి పెద్ద రాతికట్టడం. 1955-1967కాలంలో దీన్ని నిర్మించారు. దాదాపు 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయగల సామర్థ్యం ఉన్న ఈ జలాశయం 490 అడుగుల ఎత్తు కలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల వెడల్పు కలిగి 45 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇంత పెద్ద రాతి ఆనకట్ట నిర్మాణంలో యంత్రాలకంటే మనుషులే అమితంగా సేవలు అందించారు. పెద్దపెద్ద బండరాళ్లను, ఇనుప సామాన్లను కావిడ్లు వేసుకొని తమ భుజాలపై అంత ఎత్తుకు ఎక్కారు. ఒక చేత్తో కర్ర పొడుచుకుంటూ మరో చేత్తో భుజాలపై త్రాసులాగా తగిలించిన కావిడ్లపై పెద్ద పెద్ద బండరాళ్ల వేసుకొని ఆన కట్ట నిర్మాణానికి అందించారు. పదుల అంతస్తుల్లో నిర్మించిన పరంజీలు ఎక్కి మరీ ఈ సాహసం చేశారు. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే చిన్నచిన్న పిల్లలు కూడా ఈ ఆనకట్ట నిర్మాణంలో భాగస్వాములయ్యారు. తమ నెత్తిన సిమెంటు ఇసుకను, బండరాళ్లను కాళ్లకు చెప్పులు కూడా ధరించకుండా మిక్కిలి సంతోషంతో అందించారు. ఆనాటి పరిస్థితుల ప్రకారం తమ పొట్ట నింపుకునేందుకు అంతపెద్ద కష్టం చేసి ఉంటారేమోకానీ, వాస్తవానికి తాము చేస్తోంది ఒక చరిత్రోపకారం అనే విషయం ఆ అమాయక చిన్నారులకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ వయసులోనే అంతపెద్ద బరువులు మోసిన వారితో పోలిస్తే నేటి చిన్నారుల బలం బలాదురూ అవుతుందేమో..! -
నానమ్మతో జైలుకు..
జ్యోతినగర్ (కరీంనగర్): రామగుండం ఎన్టీపీసీలో ఓ మహిళ బలవన్మరణం చిన్నారులు నానమ్మతో జైలుకు వెళ్లేందుకు కారణమైంది. రామగుండం ఎన్టీపీసీకి చెందిన రామలింగేశ్వరావు,సునీత దంపతుల కుమారుడు రామోజీరావుకు కృష్ణా జిల్లా మైలవరంకు చెందిన కళ్యాణితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. కళ్యాణికి అమ్మానాన్నలు లేకపోవడంతో మేనమామలు వివాహం చేశారు. వీరికి యోగేంద్రవర్మ, బాలాదిత్య ఇద్దరు కుమారులున్నారు. ఈ నెల 1న కల్యాణి ఆత్మహత్య చేసుకుంది. అత్త, మామల ఇబ్బందులు ఆత్మహత్యకు కారణమని ఆమె లేఖ రాసింది. కల్యాణి మరణవార్తను తెలుసుకున్న బంధువులు భర్త, అత్త,మామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్ కళ్యాణి భర్త రామోజీరావుతో పాటు అత్త సునీత, మామ రాంలింగేశ్వరావులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. చిన్నారులను చేరదీసేందుకు కళ్యాణి బంధువులు వెనుకాడటంతో చిన్నారులు సైతం నానమ్మతో జైలుకు వెళ్లక తప్పలేదు. -
'నాన్నా.. నువ్వు అమ్మతో ఎందుకు ఉండట్లేదు?'
కోల్‌కతా: బంధాలు బరువైనవే.. కానీ వాటిని మోయడమంటేనే హృదయానికి ఇష్టం, అలా మోస్తున్న మనిషే అందరికీ అందంగా కనిపిస్తాడు కూడా. ముఖ్యంగా భావోద్వేగాల సమయంలో ఇవి మరింత భారంగా కనిపిస్తాయి. అప్పటికీ కూడా అలా పట్టుకొని ఉండేందుకే మనిషి మొగ్గుచూపుతాడు. కానీ, ప్రస్తుత పరిస్థితులు పూర్తి భిన్నంగా తయారవుతున్నాయి. ఓ పాటలో చెప్పినట్లు మాయమైపోతున్నడు మనిషన్నవాడు.. నిజమే కొన్ని చోట్ల మనిషి ఇప్పటికే మాయమయ్యాడు. అందుకే కొందరి జీవితంలో కన్నీళ్లు.. కష్టాలు. తాను లేని లోటును స్పష్టంగా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నా కొందరివి ఏమాత్రం కరగని కఠువు హృదయాలు. అలాంటి హృదయమే ఉన్న వ్యక్తి ఓ ఆరేళ్లపాపకు తండ్రిగా ఉంటే.. తమతో ఉండిపోండి నాన్నా అంటూ ఆ పాప కోరుకుంటున్నా అతడి నోట వెంట కనీసం ఒక్కమాట రాకుండా ఉంటే.. సరిగ్గా కోల్ కతా హైకోర్టులో ఈ సంఘటన దర్శనం ఇచ్చింది. ఓ ఆరేళ్ల పాప 'ఎందుకు నువ్వు రావడం లేదు? అమ్మతో ఎందుకు ఉండటం లేదు? మేం కోరుకుంటున్నట్లుగా మాతో ఉంటానని నువ్వు కోర్టులో చెప్పలేవా?' అంటూ ఓ తండ్రిని సాక్షాత్తు జడ్జి, న్యాయవాదుల ముందు ఏడుస్తూ ప్రశ్నించింది. అక్కడే ఉన్న తన చిన్నారి సోదరుడు కూడా ఏడుస్తూ 'మా అక్క మానాన్నతో ఉంటే నేను కూడా తనతోనే ఉంటాను' అంటూ ఏడ్వడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో వారిద్దరి చెంపలపై కన్నీళ్లు వస్తుండగా.. ఓ మూలకు నిల్చున్న వారి తల్లి వెక్కివెక్కి ఏడుస్తుంది. ఈ దృశ్యం చూసిన వారెవ్వరికీ అక్కడ నోట వెంట ఒక్క మాటా రాలేదు. ఇది పెళ్లి చేసుకొని విడిపోయి వేర్వేరుగా ఉంటున్న ఓ తల్లిదండ్రుల కేసుకు సంబంధించిన విషయం. ఈ దంపతులు ఇద్దరు తొలుత 2005లో కలుసుకున్నారు. ఇష్టంతో వివాహం చేసుకున్నారు. ఆమె హిందువు. కానీ, తన భర్త ఇష్టం మేరకు ఇస్లాంలోకి మారింది. పేరు కూడా మార్చుకుంది. 2010లో వారికి ఓ పాప.. 2012లో బాబు జన్మించాడు. అయితే, కాలక్రమంలో తన భర్త తీరు అనుమానాస్పదంగా మారడంతో ముందు జాగ్రత్తతో ఆమె తన పిల్లలతో కలసి సిలిగురిలో జీవిస్తోంది. తనతోపాటే ఉండాలని ఆమె అతడిని కోరింది. కానీ అందుకు అతడు నిరాకరించాడు. ఇలా వారిద్దరి మధ్య దూరం పెరిగి వాదనలు ప్రారంభమై చివరకు పిల్లలను పంచుకునేకాడికి వచ్చింది. అతడు 2016 ఫిబ్రవరిలో సిలిగిరి కోర్టుకు వెళ్లగా బాలికను తండ్రితో.. బాలుడిని తల్లితో ఉంచాలని జడ్జి చెప్పారు. అయితే, కూతురు కూడా తనతో ఉంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ మరో పిటిషన్ తల్లి వేసింది. అయితే ఈ కేసుపై మే 17న కేసు విచారించిన జడ్జి సమ్మర్ పూర్తయ్యే వరకు ఇద్దర్ని తల్లితో ఉంచేందుకు అనుమతిచ్చారు. ప్రస్తుతం సమ్మర్ అయిపోవడంతో మంగళవారం ఈ కేసు మరోసారి కోర్టులో వాదనలకు వచ్చింది. ఈ సందర్భంగా ఆ ఆరేళ్ల చిన్నారి తండ్రిని ఏడుస్తూ నిలదీసింది. -
పైన బాంబులు.. అండర్ గ్రౌండ్లో పాఠాలు
డెమాస్కస్: అది సిరియాలోని దారాయా అనే పట్టణం. నిత్యం బాంబు దాడులతో భయం కోరల్లో చిక్కుకున్న ప్రజలు. ఇప్పుడు అక్కడ పెద్దలు బతుకుదెరువుకోసం పాకులాడుతుండగా.. వారి బిడ్డలు మాత్రం తమ బతుకులు ఎందుకు ఇలా తయారయ్యాయని ఒక పెద్ద ప్రశ్నను మోస్తున్నారు. ప్రపంచం మొత్తానికి తమ వాస్తవ స్థితిగతులను తెలుసుకోవాలని నిర్ణయించుకొని దారాయా నగరంలోని చిన్నారులంతా ఆంగ్లం నేర్చుకునే పనిలో పడ్డారు. ప్రపంచం మొత్తానికి తెలిసిన భాష ఆంగ్లం కావడంతో ఆంగ్లాన్ని నేర్చుకునేందుకు కుస్తీపట్టడమే కాకుండా నేర్చుకున్న భాషతో తమ కష్టాలను వెల్లడిస్తున్నారు. వారి చేస్తున్న సాహసానికి ఓ సంస్థ కూడా తోడై ఒక డాక్యుమెంటరీగా ఓ వీడియోను కూడా రూపొందించింది. అందులో భాగంగా కొంతమంది పిల్లలు చెప్పిన అభిప్రాయాలు విడుదల చేసింది. అందులో ఉన్న అంశాలు ఏమిటంటే.. 'మేం ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ప్రాంతంలో మూడున్నరేళ్లుగా జీవిస్తున్నాం. పటణంలో జీవించినట్లుగానే అనిపిస్తుంది. కానీ, ఏదో ఒక సమయంలో తమకు నచ్చినవారినో.. నచ్చిన వస్తువునో కోల్పోతున్నాం. మా సమయం మొత్తం బాంబులు, విమాన దాడుల నుంచి తప్పించుకునేందుకు దాచుకోవడానికి సరిపోతుంది. ఎప్పుడు ఏ భవనంపై బాంబు పడుతుందో తెలియడం లేదు. అసలు మా దగ్గర సివిల్ వార్ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. మాకు పాఠాలు చెప్పే స్కూళ్లను అండర్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. అంటే మేమెంతో అపాయకరమైన స్థితిలో విద్యను అభ్యసిస్తున్నాం. మేం ఇప్పటికీ ఇంగ్లిష్ మాట్లాడలేకపోతున్నాం. కానీ మా టీచర్ సాయం చేస్తున్నారు' అని జహారా, హదాయా అనే పేర్లుగల తదితర పిల్లలు తమ వాస్తవ పరిస్థితులు వెల్లడించారు. -
'సొంతబిడ్డలు వద్దనుకొని ఇప్పుడు ఏడుస్తున్నాను'
లండన్: తనకు సొంతపిల్లలు వద్దని నిర్ణయించుకున్నానని, పిల్లల్ని కనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు విజేత హెలెన్ మిర్రెన్(70) అన్నారు. అయితే, ఆ దశ తన జీవితంలో లేనందుకు మాత్రం చాలా బాధపడ్డానని, కన్నీటి పర్యంతం అయ్యానని తెలిపారు. అయితే, కొద్ది సేపటికే ఆ బాధను అధిగమించి సంతోషంగా మారిపోయానని అన్నారు. 1986 నుంచి ప్రముఖ దర్శకుడు టేలర్ హ్యాక్ ఫార్డ్ తో సహజీవనం ప్రారంభించిన ఆమె ఆయనను 1997లో వివాహం చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు కుమారులు కూడా. కానీ, వారినే తన పిల్లలుగా భావించాను తప్ప సొంతంగా బిడ్డలు కావాలని మాత్రం అనుకోలేదని అన్నారు.'నేను పిల్లల్ను ప్రేమిస్తాను. వాళ్లు చాలా ఫన్నీ.. స్వీట్. కానీ నేనెప్పుడు నాకు పిల్లలు కావాలనుకోలేదు. కానీ, నేను ఇలా చెప్పిన మాట కూడా ఒక అబద్ధమేనని ప్యారెంట్ హుడ్ చిత్రం చూసిన తర్వాత తెలిసింది. ఆ సినిమా చూస్తూ తన జీవితంలో ఆ భాగ్యం లేకుండా పోయినందుకు కనీసం 20 నిమిషాలపాటు వెక్కివెక్కి ఏడ్చేశాను. కానీ, తర్వాత తేరుకున్నాను' అని ఆమె తెలిపారు. ఎవరి జీవితమైనా తండ్రిగాగానీ, తల్లిగాగానీ మారిపోకుండా ఆగకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. -
చేతులకు రక్తం వచ్చేలా..
గ్వాంగ్ డాంగ్: క్రమశిక్షణ పేరిట చిన్నారుల విషయంలో చైనా టీచర్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఏవో కారణాలమూలంగా తరగతులకు హాజరుకాలేని చిన్నారులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సాధారణంగా కాళ్లతో నడవడం అందరు చేస్తే పాఠశాలకు రావడం లేదనే ఆగ్రహంతో ఆ చిన్నారులను చేతులతో నడిపిస్తున్నారు. ఎంతలా అంటే రక్తాలు కారేంతగా.. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లోని జిజియాంగ్ మిడిల్ స్కూల్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడా స్కూల్ క్షమాపణలు చెప్పి వైద్య పరీక్షలు చేయించేందుకు సిద్ధమైంది. అయితే, తమ పాఠశాలలో అంత కఠిన శిక్షలు అస్సలు విధించమని, విద్యార్థులు పాఠశాలకు డుమ్మా కొట్టడం వల్లే కొన్ని కొన్ని చర్యలు తీసుకుంటాం తప్ప వారిని వేధించాలనేది తమ ఉద్దేశం కాదని చెప్పారు. అక్కడి స్థానికులు అధికారులు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. -
'ఆత్మహత్యలు వద్దంటూ చిన్నారుల ఆటాపాట'
హైదరాబాద్: నానాటికీ పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు నివారించేందుకు చిన్నారులు నడుంకట్టారు. చేవెళ్ల దగ్గర గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను నగరంలోని 'స్టేట్ స్కూల్'కు చెందిన చిన్నారులు పరామర్శించనున్నారు. బాలలదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి చిన్నారులు తెరతీశారు. ఆయా గ్రామాల్లోని రైతుల కుటుంబాలను సందర్శించినప్పుడు ఆ చిన్నారులు ప్రచారం చేయనున్న అంశాలివే.. అవేంటంటే.. 1. 'బతికి సాధించాలి. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. నిజానికి మహా పాపం. భార్యాపిల్లలను వీధిలోకి నెట్టినట్లు అవుతుంది'.. అంటూ దాదాపు గంటపాటు కాలికి గజ్జకట్టి బుడిబుడి చిందులతో పాట రూపంలో పాడుతూ రైతుల్లో ఆత్మ స్థైర్యం నింపుతారు. 2.'డబ్బులేకుండా అప్పుచేసి వాణిజ్యపంటలు పండించవద్దు. నష్టపోవద్దు. తక్కువ పెట్టుబడితో వర్షాదార పంటలను వేసుకోవాలి. పండ ఎండిపోయినా పశుగ్రామం మిగులుతుంది. వీలయినంతమేరకు పశుసంపద పెంచుకోవాలి. వడ్డీలకు డబ్బు తీసుకోవద్దు.. తీసుకున్నా వారు వేదిస్తే ఊరుకోవద్దు. ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి'.. అంటూ మార్గ నిర్దేశం చేస్తారు. 3. గ్రామంలోని ప్రతి భర్త చేత భార్యకు పసుపు కుంకుమ గాజులు చీర రవికె, పూలు (ఇతర మతాలవారకి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా) ఒక పల్లెరంలో పెట్టి ఇప్పిస్తారు. ఇందులోని శివపార్వతుల బొమ్మపై ప్రతి రైతుతో ఎంత కష్టం వచ్చినా నా భార్యకు పసుపు కుంకుమలు దూరం చేయను అని రైతు ప్రమాణం చేస్తారు. -
ఆ పిచ్చిలో పడకూడదనే..
లండన్: ప్రముఖ హాలీవుడ్ సుందరి కేట్ విన్స్లెట్ తన పిల్లలకు కొన్ని నిషేధాజ్ఞలు అమలుపరిచింది. వారు ఎట్టి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసింది. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలోకి తన ఇద్దరు పిల్లలను అనుమతించకుండా కట్టడి చేసింది. వారు అలా చేస్తే తమ అస్తిత్వాన్ని కోల్పోతారని, వారి సహజసిద్ధ లక్షణాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ పరిమితులు విధించినట్లు చెప్పింది. విన్స్లెట్కు మియా అనే టీనేజ్ కూతురు జో అనే 11 ఏళ్ల బాబు ఉన్నాడు. ఈ రోజుల్లో టీనేజి యువతుల్లో సోషల్ మీడియా ప్రభావం అమితంగా ఉందని, దాని పిచ్చిలో పడి వారికి అసలు ఏం కావాలో అనే విషయం మర్చిపోతున్నారని, ఆహారపు అలవాట్లలో కూడా తీవ్ర మార్పులు వస్తాయని అందుకే తన ఇంట్లో సోషల్ మీడియాను నిషేధించి.. తన పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. -
అప్పుతీర్చలేదని తల్లిబిడ్డల నిర్బంధం
అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుతీర్చలేదని ఓ వడ్డీ వ్యాపారస్తుడు తల్లి ఇద్దరు పిల్లలను నెలరోజులుగా నిర్బంధంలో ఉంచిన ఘటన జిల్లాలోని కదిరిలో జరిగింది. నెలరోజులపాటు ఆ వ్యాపారస్తుడు ఇబ్బందులు పెట్టినట్లు కూడా తెలిసింది. చివరకు ఈ విషయం పోలీసులకు తెలిసి వడ్డీ వ్యాపారస్తుడుని అరెస్టు చేయగా బాధితులకు విముక్తి లభించింది.