రాజస్థాన్‌లోని బాడ్మేర్‌లో విద్యుదాఘాతానికి నలుగురు బలయ్యారు. పిండిమరకు విద్యుత్ ప్రవహించిన నేపధ్యంలో వీరు ఒకరిని కాపాడబోయు మరొకరు మృతి చెందారు. మృతులలో ఇద్దరు చిన్నారులతోపాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బాడ్మేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అర్జున్‌సింగ్ ఇంటిలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంటిలో అర్జున్‌సింగ్ లేడు. అతని భార్య పిండిమరలో గొధుమలను ఆడిస్తుండగా, ఆమె విద్యుదాఘాతానికి గురయ్యింది. బాధతో తల్లి విలవిలలాడుతుండగా, వారి ఇద్దరి పిల్లలను ఆమెను పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు.
బాధితుల అరుపులు విన్న అర్జున్ సింగ్ బంధువు హఠెసింగ్ అక్కడికు వచ్చి, వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్ని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్ అంజుమ్ తాహిర్ సమా మాట్లాడుతూ పిండిమరకు విద్యుత్ ప్రవాహం జరిగి, దానిని ముట్టుకున్న నలుగురు మృతి చెందారని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు!
Comments
Please login to add a commentAdd a comment