హైదరాబాద్: నానాటికీ పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు నివారించేందుకు చిన్నారులు నడుంకట్టారు. చేవెళ్ల దగ్గర గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను నగరంలోని 'స్టేట్ స్కూల్'కు చెందిన చిన్నారులు పరామర్శించనున్నారు. బాలలదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి చిన్నారులు తెరతీశారు. ఆయా గ్రామాల్లోని రైతుల కుటుంబాలను సందర్శించినప్పుడు ఆ చిన్నారులు ప్రచారం చేయనున్న అంశాలివే..
అవేంటంటే..
1. 'బతికి సాధించాలి. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. నిజానికి మహా పాపం. భార్యాపిల్లలను వీధిలోకి నెట్టినట్లు అవుతుంది'.. అంటూ దాదాపు గంటపాటు కాలికి గజ్జకట్టి బుడిబుడి చిందులతో పాట రూపంలో పాడుతూ రైతుల్లో ఆత్మ స్థైర్యం నింపుతారు.
2.'డబ్బులేకుండా అప్పుచేసి వాణిజ్యపంటలు పండించవద్దు. నష్టపోవద్దు. తక్కువ పెట్టుబడితో వర్షాదార పంటలను వేసుకోవాలి. పండ ఎండిపోయినా పశుగ్రామం మిగులుతుంది. వీలయినంతమేరకు పశుసంపద పెంచుకోవాలి. వడ్డీలకు డబ్బు తీసుకోవద్దు.. తీసుకున్నా వారు వేదిస్తే ఊరుకోవద్దు. ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి'.. అంటూ మార్గ నిర్దేశం చేస్తారు.
3. గ్రామంలోని ప్రతి భర్త చేత భార్యకు పసుపు కుంకుమ గాజులు చీర రవికె, పూలు (ఇతర మతాలవారకి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా) ఒక పల్లెరంలో పెట్టి ఇప్పిస్తారు. ఇందులోని శివపార్వతుల బొమ్మపై ప్రతి రైతుతో ఎంత కష్టం వచ్చినా నా భార్యకు పసుపు కుంకుమలు దూరం చేయను అని రైతు ప్రమాణం చేస్తారు.
'ఆత్మహత్యలు వద్దంటూ చిన్నారుల ఆటాపాట'
Published Fri, Nov 6 2015 7:12 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement