రుణభారంతో రైతు బలవన్మరణం | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

రుణభారంతో రైతు బలవన్మరణం

Published Fri, Dec 18 2015 5:10 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Farmer commits suicide

చేవెళ్ల (రంగారెడ్డి) : అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిర్మలాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎండీ గఫూర్(50) తన ఎకరం పొలంలో క్యారెట్, కౌలుకు తీసుకున్న మూడెకరాల్లో పత్తి సాగు చేశాడు. వర్షాభావంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాగు కోసం చేసిన రూ.2.30 లక్షల అప్పులు తీర్చేదారి కానరాక మనస్తాపం చెంది శుక్రవారం ఉదయం పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆయనకు భార్య, కూతురు, ఇద్దరు కుమారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement