సాక్షి, రంగారెడ్డి: రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే రుణమాఫీపై తమ ఆందోళనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.
కోతలు లేకుండా రూ. 2 లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా చేవెళ్లలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రేవంత్ అనేక హామీలు ఇచ్చారని, ఒక్క సంతకంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారని గుర్తు చేశారు. రుణమాఫీ చేస్తామని అనేక దేవుళ్లపై ఒట్లు పెట్టిన సీఎం రేవంత్.. రుణమాఫీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రుణమాఫీ చేయకుండా దైవద్రోహానికి పాల్పడ్డారని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో దీనిపై ప్రశ్నిస్తే తమనే దబాయించారని, సభలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఏడిపించారని అన్నారు. రుణమాఫీ, హామీలపై సమాధానం చెప్పే దమ్ము సీఎం రేవంత్‌కు లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment