చేవెళ్ల : అప్పుల బాధకు మరో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో సారా సత్తయ్య (40) అనే రైతు పొలంలో పురుగుల ముందు తాగి ఆత్మహత్మ చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సత్తయ్యకు రెండెకరాల పొలం ఉండగా, మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పంటలు సరిగా పండకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికుల కథనం. సతయ్యకు భార్య సక్కుబాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
Published Fri, Nov 20 2015 2:12 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement