Sattaiah
-
కళాసమ్రాట్‌కు కన్నీటి వీడ్కోలు
సాక్షి, జనగామ: ఒగ్గు కథకు ప్రాణంపోసి.. ఓరుగల్లు కీర్తిని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లిన కళాసమ్రాట్ డాక్టర్ చుక్క సత్తయ్య అలియాస్ చౌదరపల్లి సత్తయ్య(82)కు వివిధ పార్టీల నాయకులు, కళారంగ ప్రముఖులు, కళాకారులు కన్నీటి వీడ్కోలు పలికారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, బంధువులు, కుటుంబసభ్యుల అశ్రునయనాల నడుమ శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఒగ్గు కథా పితామహుడైన చుక్క సత్తయ్య అనారోగ్యంతో బాధపడుతూ గురువారం జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం మాణిక్యపురంలో మృతి చెందారు. అయితే అంత్యక్రియలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆయన మృత దేహం వద్ద మల్లన్న పట్నం వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం కురుమ కులస్తుల ఆచార సంప్రదాయాల ప్రకారం ఒగ్గు డోలు విన్యాసాల మధ్య శ్మశానవాటికకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. సత్తయ్య వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన ఆయన చితికి పెద్దకుమారుడు అంజయ్య నిప్పంటించగా అంత్యక్రియలు నిర్వహించారు. నాయకులు, కళాకారుల నివాళులు.. సత్తయ్య మరణవార్త తెలుసుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది కళాకారులు, నాయకులు మాణిక్యపురానికి తరలివచ్చారు. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సత్తయ్య పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సత్తయ్య మృతదేహం వద్ద ప్రజా గాయకుడు గద్దర్ పాటపాడారు. అలాగే వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అరుణోదయ విమలక్క, ప్రముఖ కవి అందెశ్రీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిలతోపాటు కవులు, రచయితలు, ప్రజా సంఘాల నాయకులు సత్తయ్యకు నివాళులర్పించి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఒగ్గు కథకు సత్తయ్య చేసిన సేవలు చిరస్థాయిగా నిలవాలంటే హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సత్తయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాలో కళాతోరణం నిర్మించాలని పలువురు కళాకారులు కోరారు. యూనివర్సిటీల్లో ఒక విభాగానికి చుక్క సత్తయ్య పేరును పెట్టాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సత్తయ్య పేరు చిరస్థాయిగా నిలిచేలా చర్యలు నిజామాబాద్ ఎంపీ కవిత తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు.. ఒగ్గు కథనే తన జీవితంగా భావించుకుని దేశస్థాయిలో దానికి గుర్తింపు తీసుకువచ్చేలా చుక్క సత్తయ్య కృషి చేశారని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సత్తయ్య భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సత్తయ్య పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సత్తయ్య తన ప్రాణంగా భావించిన ఒగ్గు కథను బతికించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సత్తయ్య కుటుంబానికి అండగా నిలుస్తామని కవిత హామీ ఇచ్చారు. అలాగే, కొత్తగా సాధించుకున్న స్వరాష్ట్రంలో కళాకారులను గౌరవిస్తూ పింఛన్లు, జీవనభృతిని కూడా అందిస్తున్నామని ఎంపీ కవిత అన్నారు. -
విద్యుదాఘాతం తో రైతు మృతి
కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన చిట్ల సత్తయ్య(55) అనే పొలంలో విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. సత్తయ్య తన వ్యవసయ బావి వద్దకు వెళ్లి పొలానికి నీటిని పెట్టేందుకు విద్యుత్మోటర్ను ఆన్‌చేయగా స్టార్టర్ బాక్స్‌కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురయ్యూడు. కొంతసేపటికి అటువైపు వెళ్లిన కొందరు రైతులకు సత్తయ్య కిందపడి ఉండడాన్ని గమనించి, వెంటనే అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునే సరికే సత్తయ్య మృతి చెందాడు. -
పాముకాటుకు సర్పంచ్ భర్త మృతి
మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ ధనమ్మ భర్త పొలందాసు సత్తయ్య(43)ను పాము కాటేసింది. గ్రామంలోనే నాటువైద్యం చేయడంతో బాగా ఆలస్యమైంది. బైక్‌పై భువనగిరి తీసుకెళ్తుండగా రక్తప్రసరణ ఎక్కువై మార్గమధ్యంలో మృతిచెందాడు. -
కౌలు రైతు ఆత్మహత్య
వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక కల్కూరి సత్తయ్య(59) అనే కౌలు రైతు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోదావరిలో మునిగి వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లా రామగుండం జడ్పీటీసీ కందుల సంధ్యారాణి మరిది కందుల సత్తయ్య(40) ప్రమాదవశాత్తు గోదావరిలో పడి గల్లంతయ్యాడు. మంచిర్యాల గోదావరి ఒడ్డున బుధవారం జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన సత్తయ్య తిరిగి వస్తుండగా నీట మునిగి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని రక్షించడానికి ప్రయత్నించేలోపే నీట మునిగి మృతిచెందాడు. -
వడదెబ్బతో గీతకార్మికుడి మృతి
వీణవంక మండలం కనపర్తి గ్రామంలో చెప్పాళ్ల సత్తయ్య(60) అనే గీతకార్మికుడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. -
కలుషిత నీరు తాగి 25 గొర్రెలు మృతి
ఓ గుంటలో కలుషిత నీరు తాగి బుధవారం 25 గొర్రెలు మృతిచెందాయి. ఈ సంఘటన చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో చోటుచేసుకుంది. పశువైద్యాధికారులు వచ్చి గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. తనకు ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఇప్పించాలని గొర్రెల యజమాని సత్తయ్య వేడుకున్నారు. -
ఆటో బోల్తా..ఒకరి మృతి
భువనగిరి మండలం రాయగిరి శివారులో సోమవారం సాయంత్రం ఓ ఆటో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో యాదగిరిగుట్టకు చెందిన దండు సత్తయ్య(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..మరో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటో భువనగిరి నుంచి ఆలేరు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
చేవెళ్ల : అప్పుల బాధకు మరో అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో సారా సత్తయ్య (40) అనే రైతు పొలంలో పురుగుల ముందు తాగి ఆత్మహత్మ చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సత్తయ్యకు రెండెకరాల పొలం ఉండగా, మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పంటలు సరిగా పండకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికుల కథనం. సతయ్యకు భార్య సక్కుబాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్యాచారానికి యత్నం..కాళ్లు విరిగాయి..
కరీంనగర్ : అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో వృద్ధురాలు చికిత్స పొందుతోంది. సత్తయ్య అనే వ్యక్తి ...ఆమెపై అత్యాచారానికి యత్నించగా వృద్ధురాలు పెద్దగా కేకలు పెట్టింది. ఇంతలో అక్కడకు వైద్య సిబ్బంది చేరుకోవటాన్ని గమనించిన అతడు ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి దూకాడు. దాంతో సత్తయ్య కాళ్లు విరిగాయి. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
భూ వివాదంలో యువకుడి దారుణహత్య
పాపన్నపేట : భూ వివాదంలో యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని శానాయిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కాగా తోటి ఇల్లరికపు అల్లుడే ఈ దారుణానికి ఒడిగట్టాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని శానాయిపల్లి గ్రామానికి చెందిన బక్కొళ్ల హన్మయ్యకు కొంతకాలం క్రితం నర్సమ్మతో వివాహం జరిగింది. ఆమెకు దుర్గమ్మ అనే కూతురు జన్మించాక అనారోగ్య పరిస్థితుల్లో ఆమె కన్ను మూసింది. అనంతరం హన్మయ్య పోచమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాక.. గంగమణి అనే కుమార్తె జన్మించింది. ఈ క్రమంలో మొదటి భార్య కుమార్తె దుర్గమ్మను మెదక్ మండలం ముత్తాయికోట గ్రామానికి చెందిన సత్తయ్యతో వివాహం చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. అనంతరం రెండో భార్య పోచమ్మ కుమార్తె గంగమణిని శానాయిపల్లి గ్రామానికి చెందిన అంతయ్య, మల్లవ్వల దంపతుల కుమారుడు ఏసయ్య (30)తో పెళ్లి చేసి వారిని కూడా ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో సత్తయ్య, ఏసయ్యల మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ నెల 24న ఏసయ్య కుమారులు ప్రభు, ప్రశాంత్‌లను వారి పెద్దనాన్న అయిన సత్తయ్య దూషించాడు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య కక్షలు పెరిగాయి. కాగా గురువారం రాత్రి ఏసయ్య తన పొలానికి నీరు పారబెట్టేందుకు కాపాలా వెళ్లాడు. శుక్రవారం ఉదయం తెల్లవారే సమయానికి ఆయన ఇంటికి రాకపోవడంతో భార్య గంగమణి తన పెద్ద కొడుకు ప్రభును పొలం వద్దకు పంపింది. అక్కడికి వెళ్లే సరికి ఏసయ్య తలకు తీవ్రగాయాలై చనిపోయి ఉన్నాడు. సత్తయ్యనే హంతకుడా? కాగా తోడల్లుడు సత్తయ్య గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్లి అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తెల్లవారు జామున సత్తయ్య చేతికి రక్తం అంటిన విషయాన్ని ఆయన భార్య దుర్గమ్మ గుర్తించి ఆ విషయమై నిలదీసింది. అంతలోనే ఏసయ్య తన పొలం వద్ద హత్యకు గురైన విషయం దుర్గమ్మకు తెలియడంతో ఆమె తన భర్త సత్తయ్యను నిలదీస్తూ ఏసయ్య హత్యకు సత్తయ్యనే కారకుడని ఆరోపించింది. ఈ మేరకు పాపన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మెదక్ సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని సత్తయ్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సంగారెడ్డి నుంచి వచ్చిన డాగ్‌స్క్వాడ్ గ్రామంలో కలియ తిరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు సత్తయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా ఏసయ్య మృతి పట్ల గ్రామస్తులంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సత్తయ్యను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలను సవరించాలి
పరిగి: ఆర్టీసీ యాజమాన్యం మొండివైఖరిని విడనాడాలని, ఉద్యోగుల జీతభత్యాల సవరణ వెంటనే చేపట్టాలని టీఎన్‌ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సిద్దిఖి, పరిగి డిపో అధ్యక్షుడు సత్తయ్య, గ్యారేజ్ కార్యదర్శి ఖుద్బుద్దీన్ అన్నారు. టీఎన్‌ఎంయూ పిలుపు మేరకు గురువారం కార్మికులు పరిగి డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరిపై మండిపడ్డారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామంటూ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. జీతభత్యాల సవరణ పూర్తి చేయకుండా కేవలం ఐఆర్‌తో సరిపెట్టడం సరికాదని పేర్కొన్నారు. జనవరి నుంచి డీఏ ఎరియర్స్ చెల్లించని కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా గుర్తింపు సంఘం ప్రేక్షక పాత్ర వహిస్తూ యాజమాన్యానికి వత్తాసు పలుకుతోందని వారు విమర్శించారు. కాలం చెల్లిన బస్సులతో గ్యారేజి ఉద్యోగులపై అధిక పనిభారం పడుతోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీఎన్‌ఎంయూ సంఘం నాయకులు వెంకటయ్య, షరీఫ్, రమేష్, ఖదీర్, షర్భలింగం, రాంచందర్ పాల్గొన్నారు.