ఓ గుంటలో కలుషిత నీరు తాగి బుధవారం 25 గొర్రెలు మృతిచెందాయి.
ఓ గుంటలో కలుషిత నీరు తాగి బుధవారం 25 గొర్రెలు మృతిచెందాయి. ఈ సంఘటన చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో చోటుచేసుకుంది. పశువైద్యాధికారులు వచ్చి గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. తనకు ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఇప్పించాలని గొర్రెల యజమాని సత్తయ్య వేడుకున్నారు.