
అత్యాచారానికి యత్నం..కాళ్లు విరిగాయి..
కరీంనగర్ : అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో వృద్ధురాలు చికిత్స పొందుతోంది. సత్తయ్య అనే వ్యక్తి ...ఆమెపై అత్యాచారానికి యత్నించగా వృద్ధురాలు పెద్దగా కేకలు పెట్టింది. ఇంతలో అక్కడకు వైద్య సిబ్బంది చేరుకోవటాన్ని గమనించిన అతడు ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి దూకాడు. దాంతో సత్తయ్య కాళ్లు విరిగాయి. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.