attempt to rape
-
ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై..
సాక్షి,చిన్నశంకరంపేట(మెదక్): ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై పద్నాగేళ్ల బాలుడు లైంగిక దాడికిపాల్పడిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చిన్నారిని ఇంటికి తీసుకెళ్లిన బాలుడు లైంగికదాడికి పాల్పడగా చిన్నారి కేకలు వేయడంతో పక్క ఇంటిలోఉన్న చిన్నారి తల్లి పరుగున వచ్చి బాలుడిని మందలించింది. చిన్నారి తల్లిదండ్రులు చిన్నశంకరంపేట పోలీస్‌లను ఆశ్రయించారు. పాపను మెదక్ ఏరియా ఆస్పత్రికి వైద్య పరీక్షలకు పంపించినట్లు పోలీస్‌లు తెలిపారు. కాగా బాలుడు పరారీలో ఉన్నాడని తెలిసింది. మరో ఘటనలో.. యువతి అదృశ్యం నారాయణఖేడ్: కుటుంబం పొలం పనులకు వెళ్లిన సమయంలో ఓ యువతి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం నారాయణఖేడ్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నా రాయణఖేడ్ మండలం శేరితండాకు చెందిన ఓ మహిళ అక్టోబర్ 29న తన కూతురును ఇంటిలో ఉంచి కొడుకు, కోడలితో కలిసి అల్లాపూర్ శివారులో కౌలుకు తీసుకున్న చేలో పత్తిని తెంచడానికి వెళ్లింది. పొలం నుంచి సాయంత్రం ఇంటికి రాగా కూతురు కనిపించలేదు. చుట్టుపక్కలవారిని, బంధువులను విచారించినా ఆమె ఆ చూకీ తెలియలేదు. దీంతో యువతి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించడంతో.. బయటకు వెళ్లి.. -
గురువే... పశువై..
పెద్దఅంబర్‌పేట: తల్లిదండ్రుల తర్వాత కంటికిరెప్పలా కాపాడుతూ విద్యాబుద్ధుల్ని నేర్పించాల్సిన గురువే పశువయ్యాడు. చదువుకునేందుకు తన వద్దకు వచ్చిన ఓ విద్యార్థినిపై కన్నేసి గురువు పదానికే కళంకం తెచ్చాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. భార్య సహకారంతో ఓ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కీచక దంపతుల చెరనుంచి తప్పించుకుని బయటపడిన బాలిక ఈ విషయాన్ని బయటకు చెబితే ఏమవుతుందోనన్న భయంతో రెండేళ్లపాటు మౌనాన్ని ఆశ్రయించింది. ఆతర్వాత జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో చెప్పి వారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండ లం బాటసింగారం గ్రామంలో ఉన్న జానెట్ జార్జి మెమోరియల్ రెసిడెన్షియల్(ప్రైవేట్) పాఠశాలలో కొలవెంటి ప్రసాద్‌రావు(51) ఇన్చార్జి హెచ్ఎంగా, అతని భార్య సారథి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో 2017లో 8వ తరగతి చదుతున్న ఓ బాలిక(15)పై హెచ్ఎం ప్రసాద్‌రావు కన్నేశాడు. తరచూ రాత్రి సమయాల్లో బాలిక ఉంటున్న గదికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.వారానికి ఒకటి, రెండుసార్లు తన గదిలోకి పిలు చుకుని అత్యాచారం చేసేవాడు. దీనికి ప్రసాద్‌రావు భార్య సారథి సహకరిస్తుండేది. దంపతుల మాట వినకపోతే ఇంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో హాస్టల్ నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కుటుంబీకులు, బంధువుల సహకారంతో శుక్రవారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, షీటీం సాయంతో హాస్టల్‌పై దాడి చేసి ప్రసాద్‌రావు దంపతులను అరెస్టు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బాధితులు తక్షణమే రాచకొండ పోలీస్ వాట్సాప్ నంబర్: 94906 17111 లేదా 100 నంబర్లను సంప్రదించాలని సీపీ సూచించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ప్రసాద్‌రావుకు ఉరిశిక్ష విధించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
సాక్షి, నాగులుప్పలపాడు : తనపై అత్యాచారం యత్నం చేయడమే కాక నిందితుల బంధువులు కూడా సూటిపోటి మాటలు అనడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ఉప్పుగుండూరులో చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్న మద్దిపాడు ఎస్సై రాజేష్ సమాచారం మేరకు ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన లచ్చంశెట్టి వెంకటేశ్వర్లుకు నవ్య (20)తో 4 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి ఉప్పుగుండూరు గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఈ నెల 1వ తేదీన తన ఇంటి సమీపంలోని సంగు వెంకటప్రసాద్, సాయి, మహేష్ అనే యువకులు నవ్య ఒక్కతే ఉన్న సమయంలో ప్రవేశించి అత్యాచార ప్రయత్నం చేశారు. ప్రతిఘటించిన ఆమె ఆ యువకులపై నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆ ముగ్గురు యువకుల తల్లులు గంగు పద్మ, భూదిరి పద్మ, అనమర్లపూడి సరోజినితో పాటు వారి బంధువులు సంగు వెంకటరత్నం, సైదులు, లక్ష్మీ అనే వారు నవ్య ఇంటిపైకి వచ్చి తీవ్రమైన పదజాలంతో దూషణ చేస్తున్నారు. తన పట్ల అవమానకరంగా ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన నవ్య మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. తన మరణానికి కారకులైన వారి పై సూసైడ్ లేఖ రాసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించగా మృతి చెందినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
యువతిపై అత్యాచారయత్నం
కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం అశోక్ అనే యువకుడు ఇంట్లో పనిచేయడానికి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు ఇంట్లో చెప్పడంతో బంధువులు, కుటుంబీకులు యువకుడిపై దాడికి యత్నించారు. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగక రోడ్డుపై ఆందోళనకు పూనుకున్నారు. -
ఐటీ ఇంజనీర్ దుండగులను ఎదిరించినా..
ఆమె ఎక్కడో రాజస్థాన్ నుంచి గుర్‌గ్రామ్ వచ్చి ఉద్యోగం చేసుకుంటోంది. ఎప్పటిలాగే సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి వచ్చిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకోడానికి ఫోన్ సిగ్నల్ కోసం అటూ ఇటూ తిరుగుతుండగా.. ఒక ఎస్‌యూవీలో వచ్చిన కొందరు దుండగులు ఆమెను లోపలకు లాగేయబోయారు. అయితే ఆమె దాన్ని గట్టిగా ప్రతిఘటించి, కేకలు పెట్టినా చుట్టుపక్కల వాళ్లు వినోదం చూస్తూ ఉండిపోయారు తప్ప ఏ ఒక్కరూ ఆమెను కాపాడేందుకు ముందుకు రాలేదు. ఈ ఘటన గుర్‌గ్రామ్‌లోని ఇఫ్కో చౌక్‌లో రాత్రి 7 గంటల సమయంలో జరిగింది. బాధితురాలు (26) సైబర్సిటీలోని ఒక ఐటీ సంస్థలో కన్సల్టెంటుగా పనిచేస్తోంది. అప్పుడే జైపూర్ నుంచి వోల్వో బస్సులో దిగింది. క్యాబ్ బుక్ చేసుకుందామని ఫోన్ తీస్తే సిగ్నల్ సరిగా లేదు. దాంతో దగ్గర్లో ఉన్న బస్టాపు వద్దకు వెళ్లింది. ఆ సమయానికి అంతా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తుంటారు. బాగా బిజీగా కూడా ఉంది. అయినా ఒక స్కార్పియోలో వచ్చిన కొందరు వ్యక్తులు ఆమెను చెయ్యిపట్టి లోపలకు లాగేయబోయారు. వాళ్లను గట్టిగా ప్రతిఘటిస్తూ, కేకలు కూడా పెట్టింది. ఎవరూ రాకపోయినా ధైర్యం కోల్పోక తానే అక్కడి నుంచి తప్పించుకుంది. తన కాలును కారు తలుపు మీద ఆనించి గట్టిగా వెనక్కి లాక్కుంది. అంతసేపూ అరుస్తూనే ఉంది. ఇంతలో సిగ్నల్ పడటంతో వాళ్లు ఆమెను రోడ్డు మీదకు తోసేసి, అక్కడి నుంచి పారిపోయారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆమె ఫేస్బుక్లో వివరంగా పోస్ట్ పెట్టింది. తాను ఎంత అరిచినా కాపాడేందుకు ఒక్కరూ ముందుకు రాలేదని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని తొలుత అనుకున్నా, తర్వాత మళ్లీ తల్లిదండ్రులకు తెలిస్తే ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చేయమంటారని ఊరుకుంది. జరిగిన ఘటనను తలుచుకుని ప్రతిరోజూ ఏడుస్తూనే ఉన్నట్లు చెప్పింది. ఏం జరిగిందో అర్థం చేసుకోడానికి కొంతసేపు పట్టిందని, తర్వాత ఎక్కువ మంది మహిళలు ఉన్నచోటుకు వెళ్లానని వివరించింది. ఆన్లైన్లో ఫిర్యాదు చేద్దామని అనుకున్నా, కారు నెంబరు తదితర వివరాలు చూడలేదని, దాంతో ఊరుకున్నానని చెప్పింది. -
మరో ఆప్ నేత అరెస్ట్
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో నేతను అరెస్ట్ చేశారు. దళిత మైనర్ బాలికపై లైంగికదాడి యత్నం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న పంజాబ్‌కు చెందిన ఆప్ విద్యార్థి విభాగం నాయకుడు హర్దీప్ సింగ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న హర్దీప్ను ఈ రోజు సంగ్రుర్ జిల్లా ధిండ్సా గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హర్దీప్ సన్నిహితుడుగా భావిస్తున్నారు. ఓ ఫొటో స్టూడియో నడుపుతున్న హర్దీప్ వద్దకు ఫొటో తీయించుకునేందుకు వెళ్లగా, తనపై దారుణానికి ప్రయత్నించినట్టు బాధిత బాలిక ఆరోపించింది. కాగా రాజకీయ కుట్రతోనే తనను కేసులో ఇరికించారని హర్దీప్ అన్నాడు. ఆప్ నాయకులపై ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రేప్ కేసులో ఢిల్లీ ఆప్ నేత సందీప్ కుమార్ మంత్రి పదవిని పోగొట్టుకుని, పార్టీ నుంచి ఉద్వాసనకు గురికావడంతో పాటు అరెస్ట్ కాగా, మరో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆప్ టికెట్ పొందిన దేవ్ మనే అనే నాయకుడు తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించింది. -
ఆప్ నేత వద్దకు అమ్మాయి ఫొటో కోసం వెళ్తే..
చండీగఢ్: వరుస వివాదాలు, కేసులు, తీవ్ర ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. వివాదాల్లో కూరుకుపోతున్న ఆప్ నాయకుల సంఖ్య పెరిగిపోతోంది. రేప్ కేసులో ఢిల్లీ ఆప్ నేత సందీప్ కుమార్ మంత్రి పదవిని పోగొట్టుకుని, పార్టీ నుంచి ఉద్వాసనకు గురికావడంతో పాటు అరెస్ట్ కాగా, మరో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్‌లోనూ ఆప్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆప్ టికెట్ పొందిన దేవ్ మనే అనే నాయకుడు తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించగా, తాజాగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న విద్యార్థి విభాగం నాయకుడు హర్దీప్ సింగ్‌పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. ప్రస్తుతం హర్దీప్ పరారీలో ఉన్నాడు. సంగూర్కు చెందిన హర్దీప్ తనపై లైంగికదాడికి యత్నించినట్టు ఓ మైనర్ దళిత బాలిక ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంగూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితురాలు తన చెల్లెలితో కలసి పాస్ పోర్టు సైజు ఫొటోలు తీయించుకునేందుకు హర్దీప్ స్టూడియోకు వెళ్లగా.. హర్దీప్ డార్క్ రూమ్‌లో ఆమెపై లైంగికదాడికి యత్నించాడు.ఆమె గట్టిగా అరవడంతో ఆయన అక్కడి నుంచి బయటకుపారిపోయాడు. ఆప్ నేతలు హర్దీప్పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కేజ్రీవాల్ గత ఫిబ్రవరిలో హర్దీప్ గ్రామానికి వెళ్లారు. ఆప్ అగ్రనేతలు కొందరు ఆయన ఇంట్లో బసచేశారు. కేజ్రీవాల్‌తో హర్దీప్ దిగిన ఫొటో బయటకు రావడంతో ఆప్‌లో దుమారం రేపుతోంది. పంజాబ్‌లో ఆప్ నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసింది. దీనికి తోడు తాజా కేసులు ఆప్‌కు ఇబ్బందికరంగా మారాయి. -
యువతిపై అత్యాచారయత్నం
కేకేనగర్: యువతిపై కొందరు యువకులు అత్యాచారం జరపడానికి యత్నించినట్లు ఫేస్బుక్లో సమాచారం వెలువడడంతో యువకుడి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. చెన్నై క్రోంపేటకు చెందిన ఫొటోగ్రాఫర్ వసంతపాల్ మోడలింగ్ వృత్తికూడా చేస్తున్నాడు. ఇతడు తన ఫేస్బుక్లో చెన్నైలో ఒక థియేటర్లో రజిని నటించిన కబాలి సినిమా చూసి తన మిత్రులతో పాటు టీనగర్లో మద్యం సేవించి ఆ తరువాత రాత్రి సమయంలో ఆలందూర్ రోడ్డు మార్గంలో వస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో చీకటి ప్రాంతంలో ఒక యువతి కేకలు విని తాను అక్కడకు వెళ్లగా ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారం జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నడు. వెంటనే వారిని అడ్డుకోగా ఆ ముగ్గురు తనపై కత్తులతో దాడి చేసి గాయపరిచి పారిపోయారని వివరించారు. అక్కడకు ఆటోలో వచ్చిన డ్రైవర్ ఆమెను ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడని పేర్కొన్నాడు. ఈ సమచారం ఫేస్బుక్లో దావానంలా వ్యాపించింది. దీనిపై పోలీసు అధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణ జరిపారు. సంఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించారు. అతడిని విచారణకు ఎప్పుడు పిలిచినా స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని హెచ్చరించి వదిలేశారు. -
వివాహితపై దుండగుడి అత్యాచారయత్నం
కృష్ణా: ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని నందిగామ అశోక్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. వివాహిత బిగ్గరగా కేకేలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళను ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాలుడిపై అత్యాచారయత్నం.. తీవ్రగాయాలు
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. పదేళ్ల బాలుడిపై 16 ఏళ్ల అమ్మాయి అత్యాచారయత్నం చేయడంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. కాన్పూర్ సమీపంలోని కుల్హౌలి అనే గ్రామంలో తన పక్క ఇంట్లో ఉండే పిల్లాడిని మంచి మాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లిన ఆ అమ్మాయి అతడితో బలవంతంగా శృంగారానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో అతడి మర్మావయవాలకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగింది. దాంతో అతడిని కాన్పూర్‌లోని హాలెట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఐపీసీలోని ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు. బాధితుడితో పాటు నిందితురాలు కూడా మైనరే కావడంతో ఫిర్యాదు నమోదు చేయడం కష్టంగా మరిందని కాన్పూర్ సీనియర్ ఎస్పీ శలభ్ మాథుర్ అన్నారు. న్యాయ నిపుణులు మాత్రం.. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే పోస్కో చట్టంలోని 8వ సెక్షన్ కింద కేసు పెట్టొచ్చని చెబుతున్నారు. -
కీచక ఉపాధ్యాయుడు
► మహిళపై అత్యాచారయత్నం ► దేహశుద్ధి చేసిన మహిళ, బంధువులు పోరుమామిళ్ల: మండలంలోని మంగనపల్లె ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు మంగళవారం ఓ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగనపల్లె పాఠశాల పక్కనే వంట కోసం నిర్మించిన గది నిరుపయోగంగా ఉండటంతో అక్కడే నివసిస్తున్న ఓ కుటుంబం అందులో ధాన్యం, ఇతర వస్తువులు ఉంచుకున్నారు. రోజు లాగే మంగళవారం మధ్యాహ్నం ఆ ఇంటికి చెందిన మహిళ వంటగదిలోకి వెళ్లి ధాన్యం తీసుకుంటుండగా, సదరు ఉపాధ్యాయుడు ఆ గదిలోకి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. వెంటనే ఆ మహిళ ప్రతిఘటించి పాదరక్షలతో దేహశుద్ధి చేసింది. దీంతో అతను పాఠశాల వదిలి మోటార్‌బైక్‌పై పొరుగూరికి వెళ్లి అక్కడి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్యను మోటార్‌బైక్‌పై ఎక్కించుకుని తిరిగి వస్తుండగా మంగనపల్లె వద్ద ఆ మహిళ భర్త, బంధువులు మరోమారు దాడి చేసినట్లు తెలిసింది. ఉపాధ్యాయుడి భార్య ప్రాధేయపడటంతో వారు వదిలేసినట్లు తెలుస్తోంది. కాగా, అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఉపాధ్యాయుడు ఇటీవల అధికార పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా రాజీ యత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. -
రేపిస్టులను ఎదిరించి.. బయటపడింది
ఒకటికి రెండుసార్లు రేపిస్టులను ఎదిరించి.. ధైర్యంగా నిలబడిన యువతి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచింది. దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో 24 ఏళ్ల భూటాన్ యువతి సోనమ్ అర్ధరాత్రి తనకు బాగా తెలిసిన దుండగుల బారి నుంచి తనను తాను రక్షించుకుంది. భూటాన్‌కు చెందిన సోనమ్ ఆరు నెలల క్రితం బెంగళూరుకు వచ్చి, హెబ్బగొడి ప్రాంతంలో బ్యుటీషియన్‌గా పనిచేస్తోంది. ఆదివారం రాత్రి ఆమె ఒక బర్త్‌డే పార్టీకి వెళ్లింది. అక్కడ ఒక నిందితుడు ఆమెను సిగరెట్ కాల్చమన్నారు. సరేనని కాలుస్తూ ఆమె ఫ్లాట్‌లోకి వెళ్లింది. అక్కడ మరో ఇద్దరు ఉన్నారు. లోపలకు వెళ్లాక అక్కడ ఒక స్నాక్స్ పార్లర్లో పనిచేస్తున్న నిందితులు ముక్తియార్, ఖదీమ్, బాబు అనే ముగ్గురూ ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. వీళ్లు ముగ్గురూ అసోంకు చెందినవారు. ఆ తర్వాత ఆమెపై లైంగిక వేధింపులు మొదలుపెట్టారు. అయితే, ఆ ఫ్లాట్‌లోకి వెళ్లడానికి ముందే ఆమె తన బోయ్ఫ్రెండుకు ఫోన్ చేసింది. దాంతో అనుమానం వచ్చిన అతడు.. పదే పదే ఆమెకు ఫోన్ చేస్తున్నా, ఆమె ఆన్సర్ చేయలేదు. నిందితులు ముగ్గురూ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఆమె వాళ్లను ఎదిరించి, ఫ్లాట్ నుంచి బయటకు పరుగెత్తింది. ఒక వ్యక్తిని సాయం కోరగా, ఆమె భాష అతడికి అర్థం కాలేదు. వెనక వస్తున్నవాళ్లు ఆమె స్నేహితులనుకుని, వాళ్లకే అప్పగించేశాడు. దాంతో నిందితులు ఆమెను మళ్లీ ఫ్లాట్‌లోకి లాక్కెళ్లారు. రెండోసారి కూడా ఆమె వారి నుంచి తప్పించుకుని.. ఈసారి ఓ జంట వద్దకు వెళ్లింది. వాళ్లు వెంటనే పోలీసులను పిలిచారు. దాంతో నిందితులు ఫ్లాట్‌లోకి వెళ్లిపోయారు. కానీ పోలీసులు వాల్లను చూసి వెంటనే పట్టుకుని అరెస్టు చేశారు. నిందితులతో పాటు బాధితురాలికి కూడా వైద్యపరీక్షలు చేయించారు. తనపై అత్యాచారం జరగలేదు కానీ, వాళ్లు లైంగికంగా వేధించినట్లు భూటాన్ యువతి తెలిపింది. సాంకేతికంగా అత్యాచారం జరగకపోయినా.. నిందితులకు కఠిన శిక్ష పడేందుకు వాళ్లపై అత్యాచారం కేసు పెట్టినట్లు ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీసులు తెలిపారు. -
భారత కెప్టెన్ అత్యాచారయత్నం చేయలేదు..
లుధియానా: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని అతని చిరకాల స్నేహితురాలు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) స్పష్టం చేసింది. సర్దార్ పై చేసిన ఆరోపణలపై ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కాలేదని లూధియానా కమిషనర్ జేఎస్ ఔలక్ తెలిపారు. ఆ యువతితో సర్దార్ ఓ రాత్రి గడిపాడంటూ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన అమ్మాయి కూడా ఇంగ్లండ్‌లో హాకీ క్రీడాకారిణి. మహిళా ప్లేయర్ భైనీ సాహిబ్ లో ఓ రాత్రి అతడిని కలవడానికి వెళ్లగా తనపై హత్యాచారయత్నం చేశాడని లుధియానా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై విచారణ పూర్తయిందని ఆ వివరాలను ఆయన వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే భారత కెప్టెన్ పై ఆరోపణలు చేసిందని, ఆమె చెప్పిన దాంట్లో ఇసుమంతైనా నిజం లేదని వివరించారు. సర్దార్, తాను ప్రేమించుకున్నామని, అతనికి కాబోయే భార్యనని భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి గతంలో వెల్లడించింది. కొన్ని నెలల కిందట భారత్ కు వచ్చిన ఆమె.. సర్దార్ వేధిస్తున్నాడని గత ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'భారత హాకీ కెప్టెన్ సర్దార్ తనను బ్లాక్ మెయిల్ చేశాడు.. మానసికంగా, శారీరకంగా వేధించాడు' అంటూ చాలా ఆరోపణలు చేసింది. సర్దార్‌పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాల్సిందిగా లుధియానా అప్పటి పోలీస్ కమిషనర్ పరమ్‌రాజ్ సింగ్ ఆదేశించారు. ఆ యువతితో తనకు పరిచయం ఉందని, ఆమె పేర్కొన్న వాటిలో వాస్తవాలు లేవని మొదటి నుంచి సర్దార్ చెబుతూనే ఉన్నాడు. మరోవైపు సర్దార్ పై ఫిర్యాదు చేసిన అనంతరం తనకేం పట్టనట్లుగా ఆమె ఇంగ్లండ్ వెళ్లిపోవడం అప్పట్లో అనుమానాలకు దారితీసింది. -
భారత హాకీ కెప్టెన్‌పై అత్యాచారయత్నం కేసు
లుధియానా: భారత హాకీ సంఘంలో ఎప్పటి నుంచో వివాదాలు ఉండగా, తాజాగా భారత హాకీ జట్టు కెప్టెన్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ తనపై అత్యాచారయత్నం చేశాడని అతని చిరకాల స్నేహితురాలు ఆరోపించింది. లుధియానా పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. సర్దార్, తాను ప్రేమించుకున్నామని, అతనికి కాబోయే భార్యనని భారత సంతతికి చెందిన బ్రిటన్ అమ్మాయి వెల్లడించింది. ఇటీవల భారత్ వచ్చిన ఆమె.. సర్దార్ వేధిస్తున్నాడని ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'సర్దార్ బ్లాక్ మెయిల్ చేశాడు. మానసికంగా, శారీరకంగా వేధించాడు' అని ఆరోపించింది. కాగా సర్దార్ సింగ్‌పై పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సర్దార్‌పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాల్సిందిగా లుధియానా పోలీస్ కమిషనర్ పరమ్‌రాజ్ సింగ్ ఆదేశించారు. 2012 నుంచి భారత హాకీ జట్టుకు సర్దార్ నాయకత్వం వహిస్తున్నాడు. హరియాణా పోలీస్ శాఖలో డీఎస్పీ హోదాలో ఉన్నాడు. ఇక సర్దార్‌పై ఆరోపణలు చేసిన అమ్మాయి కూడా ఇంగ్లండ్‌లో హాకీ క్రీడాకారిణి. 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా వీరిద్దరికీ పరిచయమైనట్టు ఆమె చెప్పింది. తామిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, అయితే పెళ్లి చేసుకోవడానికి సర్దార్ సింగ్ నిరాకరించాడని ఆరోపించింది. గతంలో సర్దార్ స్వగ్రామంలోని అతని ఇంటికి కూడా వెళ్లినట్టు చెప్పింది. 'నాలుగేళ్లుగా మా మధ్య అనుబంధముంది. మేం ప్రేమించుకున్నాం. నేను అతనికి కాబోయే భార్యను. అయితే నాకు నమ్మకద్రోహం చేశాడు. ఇది నా హృదయాన్ని గాయపరిచింది. ఇప్పటికే మా పెళ్లి జరగాల్సింది. మూణ్నెళ్లుగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు అతను సమాధానం ఇవ్వడం లేదు. సర్దార్ మోసగాడు. అతని వయసు, కులం గురించి తప్పు చెప్పాడు. అంతేగాక నన్ను బెదిరించాడు. అతని జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది. అతనిపై ఫిర్యాదు చేశా. కోర్టులో పోరాడుతా' అని ఆ అమ్మాయి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె ఇంగ్లండ్ వెళ్లిపోయింది. -
ఏలూరులో అమానుషం
-
ఎక్స్‌రే తీయించుకోడానికి వెళ్తే.. అత్యాచారయత్నం!
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమానుషం జరిగింది. వైద్యం కోసం వచ్చిన యువతిపై దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రబుద్ధుడు. భీమవరం సమీపంలోని వీరవాసరం గ్రామానికి చెందిన యువతి తనకు కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో చికిత్స కోసం ఏలూరులోని ఆశ్రం మెడికల్ కాలేజిలో ఏప్రిల్ 28వ తేదీన చేరింది. వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీయించాలని సూచించారు. ఎక్స్‌రేలో ఉన్నదాన్ని బట్టి ఆమెకు చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఎక్సేరే తీస్తానంటూ ల్యాబ్ అసిస్టెంట్ రాజు ఎక్స్ రే రూంలోకి తీసుకెళ్లాడు. అనంతరం యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో జరగబోయే దారుణాన్ని పసిగట్టిన యువతి గట్టిగా అరుచుకుంటూ బయటకు వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే అతడు ముందుగానే తలుపు గడియ పెట్టాడు. అయినా ఆమె ఎలాగోలా తప్పించుకుంది. తల్లితో కలిసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
రోగిపై అత్యాచార యత్నం
ల్యాబ్ అసిస్టెంట్‌పై కేసు నమోదు ఏలూరు అర్బన్ :వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన యువతిపై ల్యాబ్ అసిస్టెంట్ అత్యాచార యత్నానికి ఒడిగట్టిన ఉదంతమిది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి నాలుగేళ్లుగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతోంది. తల్లిదండ్రులు ఆమెను భీమవరంలోని ఒక వైద్యునికి చూపించి మందులు వాడుతున్నారు. యువతికి మెరుగైన చికిత్స చేయించాలని వైద్యుడు సూచించడంతో ఆమెను ఈనెల 28న ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో గురువారం యువతికి ఎక్స్‌రే తీయించమని అక్కడి వైద్యులు చెప్పడంతో ఆమె తల్లి అందుకు సొమ్ము చెల్లించేందుకు వెళ్లింది. ఇదే అదునుగా రాజు అనే ల్యాబ్ అసిస్టెంట్ ఆ యువతి వద్దకు వెళ్లి మీ అమ్మ రావడం ఆలస్యమవుతుందని చెప్పాడు. ఈలోగా ఎక్స్‌రే తీస్తానని ల్యాబ్‌లోకి తీసుకెళ్లాడు. తలుపులు వేసి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఇది గమనించిన యువతి అతడిని తోసివేసి తలుపులు తెరుచుకుని బయటకు పరుగులు పెట్టింది. ఇదే సమయంలో అటుగా వస్తున్న తల్లి ఏం జరిగిందని అడగ్గా, ఆ యువతి విషయం చెప్పి బావురుమంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ల్యాబ్ అసిస్టెంట్ రాజుపై అత్యాచార యత్నం కేసు నమోదు చేసినట్టు ఏలూరు రూరల్ పోలీసులు తెలిపారు. -
అత్యాచారయత్నం కేసులో ప్రిన్సిపాల్ అరెస్టు
తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన కేసులో ఓ స్కూలు ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ ప్రాంతంలో జరిగింది. పరస్ నాథ్ యాదవ్ (55) అనే సదరు ప్రిన్సిపాల్‌పై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. సంతకం చేయించుకోడానికి ఆ అమ్మాయి ప్రిన్సిపాల్ గదికి వెళ్లినప్పుడు అతడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడని తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. -
బాలికపై వృద్ఢుడి అత్యాచారయత్నం
చెర్లోపల్లిలో కామాంధుడికి దేహశుద్ధి నిందితుడిని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు పుత్తూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదు పుత్తూరు : మద్యం మత్తులో ఉన్న వృద్ధుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక అమ్మమ్మ(అవ్వ) సాహసం చేసి మనుమరాలిని సురక్షితంగా కాపాడుకున్న సంఘటన శుక్రవారం పుత్తూరు పట్టణ పరిధిలోని చెర్లోపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు నిందిడుడికి దేహశుద్ధి చేసి పుత్తూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ రామాంజనేయలు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని చెర్లోపల్లిలో నివాసం ఉంటున్న గుణ శేఖర్‌రెడ్డి(64) అనే వృద్ధుడు సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉన్న బాలిక(4)ను పిలిచి చాక్ లెట్ ఇస్తానని నమ్మబలికాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు ఆ బాలికను ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. గమనించిన అంగన్వాడి ఆయా బాలిక ఇంటి వద్దకు వెళ్లి విచారించింది. విషయాన్ని బాలిక అమ్మమ్మకు చెప్పింది. సమాచారం అందుకున్న ఆమె గుణశేఖర్రెడ్డి ఇంటికి వెళ్లింది. మూసివున్న ఇంటి తలుపు తెరవాలని కేకపెట్టింది. అయినా తెరవకపోవడంతో ఆమే తలుపు గడియను ఏదో రకంగా తీసేసింది. అప్పటికే ఆ బాలిక ఒంటిపై దుస్తులులేవు. అఘాయిత్యం చేయబోతున్న అతడి నుంచి మనుమరాలిని విడిపించుకుంది. ఈ దశలో ఆమెపై నిందితుడు దాడి చేశాడు. దీంతో ఆమె అరుపులు కేకలు పెట్టడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. -
వివాహితపై అత్యాచార యత్నం
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఉద్యోగం కోసం చెన్నైకి చేరుకున్న వరంగల్ వివాహిత మోసపోయింది. మాయమాటలు చెప్పి చెన్నైకి తీసుకువచ్చిన కుటుంబ స్నేహితుడే ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. తెలంగాణలోని వరంగల్‌కు చెందిన వివాహిత ఇంజనీరింగ్ పట్టభద్రురాలు కావడంతో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ స్నేహితుడు శ్రీనివాస్ (40) ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి కొన్నిరోజుల క్రితం చెన్నైకి తీసుకువచ్చాడు. ఎగ్మూరులోని ఒక అతిథి గృహంలో ఆమెకు బస ఏర్పాటు చేశాడు. సినిమా పరిశ్రమతో సంబంధాలు కలిగి ఉండడంతో ఉద్యోగం కంటే సినిమాలో వేషాలు మేలని నమ్మబలికాడు. అనంతరం ఆమెతో శారీరక సంబం ధం పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో అత్యాచారం యత్నం చేశాడు. అక్కసుతో ఆమెను చిత్రవధకు గురిచేయసాగాడు. బుధవారం సాయంత్రం శ్రీనివాస్ బయటకు వెళ్లిన సమయంలో అతిథి గృహం నుంచి తప్పించుకుని ఎగ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చే యడంతో నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. వరంగల్‌కు సమాచారం ఇచ్చి ఆమెను బంధువులకు అప్పగించారు. -
యువతిపై అత్యాచారయత్నం, ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని మల్కాజ్‌గిరిలో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగిన ఘటన సోమవారం వెలుగుచూసింది. ఇద్దరు యువకులు మరియమ్మ అనే యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
అత్యాచారానికి యత్నం..కాళ్లు విరిగాయి..
కరీంనగర్ : అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో వృద్ధురాలు చికిత్స పొందుతోంది. సత్తయ్య అనే వ్యక్తి ...ఆమెపై అత్యాచారానికి యత్నించగా వృద్ధురాలు పెద్దగా కేకలు పెట్టింది. ఇంతలో అక్కడకు వైద్య సిబ్బంది చేరుకోవటాన్ని గమనించిన అతడు ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి దూకాడు. దాంతో సత్తయ్య కాళ్లు విరిగాయి. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
శృంగారానికి నిరాకరించిందని.. పొడిచి చంపేశారు!
గుజరాత్లో దారుణం జరిగింది. తమతో శృంగారానికి నిరాకరించిందన్న కారణంతో.. బాగా తాగి ఉన్న కొంతమంది గూండాలు 22 ఏళ్ల యువతిని కత్తితో పొడిచి చంపేశారు. ఈ దాడిలో ఆమె స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నారన్‌పురా రైల్వే క్రాసింగ్ సమీపంలో జరిగింది. గాయపడిన యువకుడు, మృతురాలి తల్లిదండ్రులు ఏమైనా చెబితే దాన్నిబట్టి కేసు దర్యాప్తు ముందడుగు వేస్తుందని పోలీసులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని రాయగఢ్ ప్రాంతానికి చెందిన బీర్బల్ ప్రసాద్ (26) అనే యువకుడికి అహ్మదాబాద్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో కొంతకాలం క్రితం నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్నాళ్ల తర్వాత పెళ్లికూతురి తండ్రి.. ఆ సంబంధం వద్దనుకుని నిశ్చితార్థం రద్దుచేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత కూడా ఆమె బీర్బల్తో స్నేహం కొనసాగిస్తోంది. అతడు అప్పుడప్పుడు అహ్మదాబాద్ వచ్చి వెళ్తుండేవాడు. అలాగే వచ్చి రాత్రి కాసేపు మాట్లాడుకున్న తర్వాత.. తిరిగి 10.30 ప్రాంతంలో వెళ్తుండగా ఆమె పీజీ అకామడేషన్ తలుపులు వేసి ఉన్నాయి. దాంతో మరికాసేపు వాళ్లు మాట్లాడుకుంటూ గడిపారు. అదే సమయంలో తాగిఉన్న నలుగురు అక్కడకు వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. తమతో శృంగారానికి రమ్మని పిలవగా, ఆమె నిరాకరించింది, స్నేహితుడు కూడా వాళ్లను అడ్డుకున్నాడు. వెంటనే వాళ్లు ఆమెను, అతడిని కత్తితో పొడిచారు. ఆమెను పలుమార్లు పొడవడంతో తీవ్రంగా గాయపడింది. బీర్బల్ పోలీసులకు ఫోన్ చేయగా, వారు ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. -
వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారయత్నం
ఆస్పత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది ఒకరు అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. ప్రస్తుతం ఎండీ చదువుతున్న ఆ విద్యార్థిని ఆస్పత్రిలోని విశ్రాంతి గదిలో నిద్రపోతుండగా.. సిబ్బందిలో ఒకరు వచ్చి ఆమెపై అత్యాచారయత్నం చేసినట్లు సియాని గేట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. రవి అనే పారిశుధ్య ఉద్యోగి తెరిచి ఉన్న కిటికీ గుండా లోనికి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు ఇన్స్పెక్టర్ అశోక్ సిసోదియా తెలిపారు. అయితే ఆమె వెంటనే సాయం కోసం అరవడంతో ఇతర సిబ్బంది పరుగున అక్కడకు చేరుకున్నారు. వాళ్లు వస్తున్న విషయం తెలిసి రవి వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. -
కామాంధుడి దాష్టీకం
* బాలికకు ఆశ్లీల చిత్రాలు చూపిస్తూ అత్యాచారయత్నం *మనస్తాపంతో బాలిక ఆత్మహత్య *పోలీసుల అదుపులో నిందితుడు * వరంగల్ జిల్లాలో ఘటన ధర్మసాగర్: అభం శుభం తెలియని బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లిన యువకుడు అశ్లీల చిత్రాలు చూపించి అత్యాచారయత్నం చేశాడు. స్థానికులు ఆమెను రక్షించగా.. అత్యాచార యత్నంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం సోడాషపల్లిలో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బాలిక (14) మల్లికుదుర్ల ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆదివారం బాలిక తల్లిదండ్రులు బంధువుల అంత్యక్రియలకు వెళ్లడంతో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి చెందిన రేనుకుంట్ల సదానందం(30) బాలిక ఒంటరిగా ఉండటంతో ఆమెకు మాయమాటలు చెప్పి, తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికకు అశ్లీల చిత్రాలు చూపించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. స్థానిక యువకులు గమనించి, సదానందంను బంధించారు. తనపై అత్యాచారయత్నం జరగడంతో ఆ బాలిక మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు మంటలు ఆర్పి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తీవ్రగాయాలతో బాధపడుతున్న బాలిక సోమవారం ఉదయం మృతి చెందింది. కాగా విద్యార్థిని ఆత్మహత్య వివరాలు వెల్లడించటానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు సదానందంపై నిర్భయతోపాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
మహిళపై ఆధ్యాత్మిక గురువు అత్యాచార యత్నం:అరెస్ట్
కటక్: మరో ఆధ్యాత్మిక గురువు వివాదంలో చిక్కుకున్నాడు. జైపూర్ జిల్లాలోని ఛండీఖోల్ లో కైబాల్యా ఆశ్రమం నిర్వహిస్తున్న సచిత్రా పరిదా ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పూజ చేయాలని ఆ మహిళకు మాయమాటలు చెప్పి లైంగిక చర్యలకు తెరలేపాడు. దీంతో ఆ మహిళ ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ మహిళ తన భర్తతో కలిసి పరిదాను కలుస్తుండేది. ఈ క్రమంలోనే అతని ప్రవర్తనపై అనుమానం కల్గిన ఆ మహిళ ఆశ్రమానికి వెళ్లడం మానేసింది. అయితే తాజాగా శనివారం పరిదా నుంచి ఆ మహిళకు పిలుపువచ్చింది. తన ఇంటిదగ్గర పూజ చేయాలని ఆ పిలుపులో సారాంశం. ఒకవేళ ఆ పూజ చేయించుకోకపోతే త్వరలోనే నీ భర్త చనిపోతాడంటూ దొంగ స్వామిజీ హెచ్చరించాడు. ఆ స్వామిజీ మాటలతో భయపడిన మహిళ అతని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో తన భర్తకూడా ఇంటిలో లేకపోవడంతో ఒంటరిగానే అతని వద్దకు వెళ్ళింది. దీన్ని అదునుగా తీసుకున్న స్వామిజీ ఆ మహిళను లైంగికంగా లొంగదీసుకోవాలని యత్నించాడు. దీంతో అసలు విషయాన్నిగ్రహించిన మహిళ అక్కడ ఉన్న అలారాన్ని మోగించడంతో చుట్టుప్రక్కల వారు అక్కడకు చేరుకుని పరిదాను చితకబాదారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ ఐ సుజాతా జెనా స్పష్టం చేశారు. -
చిన్నారిపై అత్యాచార యత్నం
బెంగళూరు : చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన సంఘటన బెంగళూరు నగర శివార్లలోని నెలమంగల గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు నెలమంగల సమీపంలోని విశ్వేశ్వరపుర గ్రామ పంచాయతీ సభ్యుడు సజ్జురుద్దిన్. అతని తండ్రి యాసిన్సాబ్(58). శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో యాసిన్సాబ్ చాక్లెట్ ఇప్పిస్తామని ఓ రెండేళ్ల బాలికను తన ఇంటిలోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేయడానికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కిటికీలో నుంచి చూడగా విషయం వెలుగు చూసింది. గ్రామస్తులు యాసిన్సాబ్ను పట్టుకుని చితకబాదారు. చీకటిలో అతను తప్పించుకుని పరారైనాడు. బాలికను నెలమంగలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలికపై లైంగి క దాడి యత్నం జరిగిందని అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక ను ఐసీయూలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న సజ్దురుద్దీన్ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని సంప్రదించి కేసు లేకుండా చేయడానికి విఫలయత్నం చేశారు. కూలి పనులు చేసుకుని జీవించే బాలిక కుటుంబ సభ్యులను బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ అంతు చూస్తామని రాజకీయ నాయకులు బెదిరించినట్లు సమాచారం. ఓ రాజకీయ నాయకుడు పోలీసులకు ఫోన్ చేసి కేసు నమోదు చేయకండని, బాలిక కుటుంబ సభ్యులకు రూ.రెండు లక్షలు అందిస్తామని బేరాలు చేసినట్లు తెల్సింది. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. -
మైనర్‌పై అత్యాచార యత్నం
నిందితుడు పంచాయతీ కార్యదర్శి పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు నిర్భయ చట్టం కింద కేసు నమోదు మాకవరపాలెం: మాయమాటలతో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించిన ఓ కార్యదర్శి చివరికి కటకటాలపాలయ్యాడు. ఇంటికి పిలిచి మోసగించేందుకు నిందితుడు చేసిన ప్రయత్నాన్ని పసిగట్టిన బాలిక తప్పించుకుని విషయం తల్లిదండ్రులకు చేరవేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాకవరపాలెం మండలం పెద్దిపాలెం పంచాయతీ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ రామారావు తెలిపిన వివరాలు ఇవీ. పెద్దిపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగరావు స్థానికంగా నివాసముంటున్నాడు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలికను తన ఇంటికి పిలిచాడు. ఆమెకు ఎగ్‌పఫ్ ఇచ్చి తినమన్నాడు. అనంతరం నిన్ను పట్నం తీసుకు వెళ్తానని ఆశచూపి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక తప్పించుకుని ఇంటికి పరుగుతీసింది. అన్నం కూడా తినకుండా రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది. ఉదయం ఆమెను గమనించిన తండ్రి ఎందుకు ఏడుస్తున్నావంటూ ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. దీంతో కుమార్తెను తీసుకుని అతను స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన కార్యదర్శిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెద్దిపాలెంలో ఎస్ఐ విచారణ అత్యాచార యత్నంపై అందిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.రామారావు పెద్దిపాలెంలో విచారణ నిర్వహించారు. కార్యదర్శి ఉంటున్న ఇంటితోపాటు బాలిక ఇంటి చుట్టు పక్కల వారిని పిలిచి విచారణ చేశారు. వారు చెప్పిన విషయాలను నమోదు చేసుకున్నారు. కార్యదర్శిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
ఆఫ్రికన్ యువతిపై అత్యాచారయత్నం
-
ఆఫ్రికన్ యువతిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి సంచలన సంఘటన జరిగింది. చదువుకోడానికి దేశం కాని దేశం వచ్చిన ఆఫ్రికన్ యువతి మీద ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దాంతో ఆ యువతి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆఫ్రికా ప్రాంతానికి చెందిన యువతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెను ఒక యువకుడు గత కొంత కాలంగా బైకుపై వెంటపడి, వేధిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తాను బంజారాహిల్స్ నుంచి టోలిచౌకి వెళ్తుండగా అతడు వెంటపడి, తనపై అత్యాచార యత్నం చేశాడని ఆమె ఫిర్యాదుచేసింది. దాంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆమె బైకు నెంబరు కూడా ఇవ్వడంతో వివరాలు త్వరగానే తెలిసే అవకాశాలున్నాయి. -
బాత్రూంలో అత్యాచారయత్నం: వెనుదిరిగిన విమానం
హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు సహచర ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం చేయడంతో.. విమానం వెనుదిరగాల్సి వచ్చింది. మైఖేల్ టనోయె (29) అనే ప్రయాణికుడు విమానం టేకాఫ్ తీసుకున్న దాదాపు రెండు గంటల తర్వాత బలంతంగా బాత్రూంలోకి వెళ్లాడు. అక్కడ జపాన్‌కు చెందిన ఓ ప్రయాణికురాలి దుస్తులు విప్పి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. అయితే ఆమె ఎలాగోలా బాత్రూంలో ఉన్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు.దాంతో విమాన సిబ్బంది తలుపు బలవంతంగా తీసే ప్రయత్నం చేశారు. అయితే అతడు తలుపులకు అడ్డంగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. చివరకు తలుపుకు ఉన్న స్క్రూలు విప్పదీసి తలుపు తీయగలిగారు. హొనొలులు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్‌లోని కన్సాయ్ నగరానికి ఆ విమానం వెళ్తోంది. హవాయికి చెందిన మైఖేల్ టనోయె తన తల్లితో కలిసి ఆ విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడి మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అందుకే మందులు వాడుతున్నామని ఆమె చెప్పారు. ఈ సంఘటన తర్వాత బయటకు వచ్చిన అతడికి ఆమె ఏవో టాబ్లెట్లు ఇవ్వగా, కొద్దిసేపటికే నిద్రలోకి జారిపోయాడు. తర్వాత విమానాన్ని వెనక్కి తిప్పగా, హొనొలులులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇలా విమానంలో అత్యాచారయత్నం చేసినందుకు అతడికి భారీ శిక్షే పడే అవకాశం ఉంది. -
ఏడేళ్ల బాలికపై అత్యాచార యత్నం
నిలదీసిన బాలిక తల్లిపై మూకుమ్మడి దాడి పోలీసుల అదుపులో యువకుడు రావికమతం : ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను కొత్తకోట ఎస్ఐ శిరీష్‌కుమార్ శనివారం తెలిపారు. రావికమతం మండలం కిత్తంపేట గ్రామానికి చెందిన దాడి మణికంఠ(17) అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి బుధవారం సాయంత్రం ఇంట్లోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో రోదిస్తూ తల్లికి వివరించింది. వారు ఆ బాలికను నర్సీపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి శుక్రవారం రాత్రి ఇంటికి తీసుకువచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన మణికంఠను ఆ బాలిక తల్లి నలుగురిలో మందలించింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు అతని పెద్దలతో వచ్చి బాలిక తల్లిపై మూకుమ్మడి దాడి చేశారు. బాధితులు కొత్తకోట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. మణికంఠను అదుపులోకి తీసుకుని, దాడికి పాల్పడిన మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. నర్సీపట్నం రూరల్ సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హఫీజ్‌పేటలో యువతిపై సామూహిక అత్యాచారయత్నం
హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారయత్నం చేశారు. ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళంకు చెందిన యువతిపై ఆటో డ్రైవర్, అతని స్నేహితులు ముగ్గురు కలసి సామూహిక అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు వేల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ** -
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
- యువకుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు - పోలీసులకు అప్పగింత ఏలూరు (వన్‌టౌన్) : ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడో ప్రబుద్ధుడు. ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లగా ఐదేళ్ల చిన్నారి ఒంటరిగా ఉంది. పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామానికి చెందిన నార్మాన కోటేశ్వర్రావు (21) విద్యుత్ మీటర్ బిల్లు రీడింగ్ నమోదు కోసం ఆ ఇంటికి వచ్చాడు. బాలిక ఒంటరిగా కనిపించడంతో ఆమె తల్లిదండ్రుల కోసం ఆరా తీశాడు. వారు ఆస్పత్రికి వెళ్లారని తెలుసుకుని కోటేశ్వర్రావు ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యచారానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, అతడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనిపై త్రీటౌన్ ఎస్సై పి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకటో తరగతి పాపపై అత్యాచారయత్నం
ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాపపై బడిలో అత్యాచారయత్నం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఈ దారుణం జరిగింది. గోకవరం రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల చిన్నారి పాఠశాలలో బాత్రూమ్కు వెళ్లగా, అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్న అప్పారావు బాత్రూమ్ తలుపు వేసి ఆమె పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అత్యాచార యత్నం కూడా చేశాడు. దాంతో భయపడిన ఆ చిన్నారి కేకలు పెట్టడంతో వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. పాప వెంటనే ఉపాధ్యాయురాలికి తెలిపినా పట్టించుకోలేదు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావు పరారీలో ఉండటంతో పోలీసులు పాఠశాల ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
యువతిపై అత్యాచారయత్నం
ఇద్దరిపై కేసు నమోదు ములుగు : యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఇరువురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ ఖరీంపాషా గురువారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని అచ్చాయిపల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువతి రంగారెడ్డి జిల్లా తూంకుంట సాయితేజ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. కళాశాలకు ప్రతిరోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తోంది. అందులో భాగంగా గురువారం కూడా కళాశాలకు వెళ్లిన యువతి సాయంత్రం నాలుగు గంటలకు తునికి బొల్లారంలో బస్సు దిగింది. అనంతరం అచ్చాయిపల్లికి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. దీనిని గమనించిన అదే గ్రామానికి చెందిన కనువుకుంట్ల మల్లేశం, జలాల్పురం శ్రీకాంత్‌లు యువతిని వెంబడించారు. మార్గమధ్యలో బాలికను చెట్లపొదల్లోకి లాగి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో యువతి వారిని నోరుతో కొరికి తప్పించుకుని సమీపంలో ఉన్న మామ వద్దకు పరుగులు తీసి విషయాన్ని చెప్పింది. ఈ మేరకు బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లో ప్రేమికులను బెదిరించి.. అత్యాచారాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఫెయిజల్ దయాని ఆధ్వర్యంలో 30మంది యువకులు ఒక ముఠాగా ఏర్పడి దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రెండు నెలల క్రితం పహాడీషరీఫ్ షాహిన్‌నగర్ ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌లోకి చొరబడి దంపతులపై దాడి చేసి బంగారం, నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పక్కాప్లాన్లో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో ముఠా అకృత్యాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ముఠా నాయకుడితోపాటు మిగిలిన సభ్యుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పల్లవి హత్యకేసు: వాచ్‌మన్‌కు జీవిత ఖైదు
ముంబైలో యువ మహిళా న్యాయవాది హత్య కేసులో ఆమె నివసించిన భవన వాచ్‌మన్‌కు కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. 2012లో పల్లవీ పురకాయస్థ అనే న్యాయవాది దారుణ హత్యకు గురి కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె ఫ్లాట్ బయట, పక్కింటివాళ్ల డోర్ బెల్ మీద కూడా రక్తపు మరకలు ఉండటంతో ఆమె హంతకుడి బారి నుంచి తప్పించుకుని సాయం కోసం పరుగులు తీసినట్లు రుజువైంది. (చదవండి: న్యాయవాది హత్య: వాచ్‌మనే హంతకుడు!!) ఆమె నివసించే భవన వాచ్‌మన్ సజ్జాద్ అహ్మద్ పఠాన్ (22) ఆమెను చంపినట్లు కోర్టులో రుజువైంది. జాతీయస్థాయి స్విమ్మర్ కూడా అయిన పల్లవి వడాలా ప్రాంతంలోని 'హిమాలయన్ హైట్స్' అపార్టుమెంట్ 16వ అంతస్థులో 2012 ఆగస్టు 9న హత్యకు గురైంది. పదేపదే తనవైపు చూడొద్దని ఆమె హెచ్చరించడంతోనే సజ్జాద్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో చంపేశాడు. పక్కింటివాళ్ల డోర్ బెల్ మోగించినా, తలుపు వద్ద ఆమె కనిపించకపోవడంతో వాళ్లు తియ్యలేదు. ఇంతలో సజ్జాద్ వచ్చి పల్లవి గొంతుకోసి చంపేశాడు. ఈ కేసులో మొత్తం 40 మంది సాక్షులను కోర్టు విచారించింది. లా కాలేజీలో పల్లవితో ప్రేమలో పడి.. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అవిక్ సేన్ గుప్తా కూడా సాక్ష్యం ఇచ్చారు. గత సంవత్సరం నవంబర్ నెలలో అతడు అనారోగ్యంతో మరణించాడు. -
న్యాయవాది హత్య: వాచ్‌మనే హంతకుడు!!
ముంబైలో యువ న్యాయవాది హత్య కేసులో ఆమె నివసించిన భవన వాచ్‌మన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. అతడికి విధించే శిక్షను జూలై 3వ తేదీన నిర్ధరించనుంది. ముంబై మహానగరంలో 2012లో పల్లవీ పురకాయస్థ అనే న్యాయవాది దారుణ హత్యకు గురి కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె ఫ్లాట్ బయట, పక్కింటివాళ్ల డోర్ బెల్ మీద కూడా రక్తపు మరకలు ఉండటంతో ఆమె హంతకుడి బారి నుంచి తప్పించుకుని సాయం కోసం పరుగులు తీసినట్లు రుజువైంది. ఈ హత్యకేసులో ఆమె ఉన్న భవన వాచ్‌మన్ సజ్జాద్ అహ్మద్ పఠాన్ (22) ఆమెను చంపినట్లు కోర్టులో రుజువైంది. జడ్జి ఈ విషయాన్ని వెల్లడించేటప్పుడు అతడు మౌనంగా తల ఊపుతూ ఉండిపోయాడు తప్ప ఎలాంటి భావాలు పలికించలేదు. జాతీయస్థాయి స్విమ్మర్ కూడా అయిన పల్లవి వడాలా ప్రాంతంలోని 'హిమాలయన్ హైట్స్' అపార్టుమెంట్ 16వ అంతస్థులో 2012 ఆగస్టు 9న హత్యకు గురైంది. పదేపదే తనవైపు చూడొద్దని ఆమె హెచ్చరించడంతోనే సజ్జాద్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో చంపేశాడు. పక్కింటివాళ్ల డోర్ బెల్ మోగించినా, తలుపు వద్ద ఆమె కనిపించకపోవడంతో వాళ్లు తియ్యలేదు. ఇంతలో సజ్జాద్ వచ్చి పల్లవి గొంతుకోసి చంపేశాడు. ఈ కేసులో మొత్తం 40 మంది సాక్షులను కోర్టు విచారించింది. లా కాలేజీలో పల్లవితో ప్రేమలో పడి.. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అవిక్ సేన్ గుప్తా కూడా సాక్ష్యం ఇచ్చారు. గత సంవత్సరం నవంబర్ నెలలో అతడు అనారోగ్యంతో మరణించాడు. -
మహిళపై కారులో యువకుల అత్యాచారయత్నం
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచార యత్నానికి యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మహిళను కారులో తీసుకు వెళ్లి యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇద్దరు యువకులు ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళా డాక్టర్ పై అత్యాచారయత్నం
-
వైద్య విద్యార్థినిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగింది. ఓ గెస్ట్‌హౌస్‌లో వైద్య విద్యార్థినిపై ఒరిస్సాకు చెందిన ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. వైద్య పరీక్ష రాసేందుకు బాధిత యువతి కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చింది. గెస్ట్ హౌస్ లో పని చేసే క్లీనింగ్ బాయ్ ఈ ఘటనకు పాల్పడటంతో వైద్య విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాలికపై వ్యక్తి అత్యాచారయత్నం
హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం ఓ బాలికపై వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారయత్నాన్ని బాలిక అడ్డుకోవటంతో వ్యక్తి ఆమెను గాయపరిచాడు. ప్రస్తుతం బాలిక ఒంటిపై కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి హత్య
గుంటూరు: జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. పోలానికి వెళ్లిన ఓ యువతిపై గంగయ్య అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి అతని బారినుంచి తప్పించుకోని జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు నిందితుడు గంగయ్యను దారుణంగా కొట్టిచంపినట్టు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సోదరిపై అత్యాచారయత్నం, రిమాండ్‌కు తరలింపు
హైదరాబాద్ : సభ్య సమాజం సిగ్గుపడేలా సొంత చెల్లెలిపై లైంగిక దాడికి యత్నించిన కీచక సోదరుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ రవి కథనం ప్రకారం... ఇందిరా నెహ్రూ నగర్‌కు చెందిన నర్సింగ్ (30) బైక్ మెకానిక్. అతను తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుండగా... ఇంటి పక్కనే చెల్లెలి కుటుంబం కూడా నివాసం ఉంటోంది. కాగా ఏడాది నుంచి చెల్లెలు ఉంటున్న ఇంటి స్థలం విషయంలో అన్నాచెల్లెలి మధ్య గొడవ జరుగుతోంది. ఈ సందర్భంగా పలుమార్లు చెల్లెలు అని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించటమే కాకుండా సొంత బావను ఇంట్లో నుంచి బయటకెళ్లగొట్టాడు. గత నెల 29న చెల్లెలు ఒక్కటే ఇంట్లో ఉండగా టీవీ సౌండ్ పెంచి ఆమెపై నర్సింగ్ లైంగిక దాడికి యత్నించటంతో ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సింగ్పై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
విద్యార్ధినిపై నలుగురు కీచకుల అకృత్యం
నల్గొండ: కొన్నిగంటల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకబోతున్న తరుణంలో నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మిర్యాలగూడలో మంగళవారం చోటుచేసుకుంది. విద్యార్థినిని కిడ్నాప్ చేసిన దుండగులు చౌటుప్పల్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఓ లారీ డ్రైవర్ వచ్చి బాలికను కాపాడినట్టు తెలిసింది. అప్పటికీ బాలిక ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపటికీ తేరుకున్నక వివరాలు చెప్పడంతో బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారయత్నం
విశాఖపట్నం: యలమంచిలిలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఆ బాలికపై అత్యాచారం చేయడానికి ఇద్దరు యువకులు ప్రయత్నించారు. ఇద్దరూ మద్యం తాగిన మైకంలో అత్యాచారయత్నం చేశారు. స్థానికులు వారిని పట్టుకొని పో్లీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులు ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. నిందితులలో ఒకరు ఆర్మీ ఉద్యోగి కాగా, మరొకరు కోపరేటివ్ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఆర్మీ ఉద్యోగి సెలవుపై ఇక్కడికి వచ్చాడు. -
వదినపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించడంతో దారుణహత్య
పెద్దశంకరంపేట, న్యూస్‌లైన్: ఓ కామాంధుడు వదినపై అత్యాచారయత్నానికి పాల్పడడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి నిందితుడు పరారయ్యాడు. ఈ సంఘటన పెద్దశంకరంపేటలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జోగిపేట సీఐ సైదానాయక్, ఎస్ఐ సత్యనారాయణ కథనం మేరకు.. నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన కాశమోళ్ల సుజాత (27), రమేష్ దంపతులు బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం పెద్దశంకరంపేటకు వలస వచ్చారు. స్థానిక పెట్రోల్ బంక్ సమీపాన గుడిసె వేసుకుని రోకళ్లు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారం క్రితం జీవనోపాధి కోసం రమేష్ పెద్ద నాన్న కుమారుడైన చందర్ కూడా వీరికి జతకట్టాడు. వీరితో కలిసి రోకళ్ల తయారీలో పాలుపంచుకునే వాడు. ఇదిలా ఉండగా రమేష్‌కు జ్వరం రావడంతో మంగళవారం ఉదయం చికిత్స నిమిత్తం నారాయణఖేడ్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి స్వగ్రామమైన రుద్రారానికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన చందర్ ఆ రోజు మద్యం సేవించి అర్ధరాత్రి వదిన వరసైన సుజాత నోటికి లుంగీ, టీ షర్టు చుట్టి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. కాగా భర్త రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతురాలికి ఏడాది వయసు ఉన్న కుమారుడున్నాడు. మృతదేహం వద్ద బంధువుల రోదనలు అక్కడున్న వారిని కలిచివేసింది. -
చున్నీతో చంపిన గిరిజన యువతిపై కేసు నమోదు
మద్యం మత్తులో తనపై అత్యాచారానికి యత్నించిన మృగాడి మెడకు చున్నీ బిగించి, రాయితో కొట్టి చంపినందుకు గిరిజన యువతిపై కేసు నమోదైంది. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గిరిశిఖర పెదశాఖ పంచాయతీ జల గ్రామంలో కొండ సమీపాన పాకలో బుధవారం రాత్రి ఆ యువతి నిద్రపోతోంది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన గిరిజనుడు కడ్రక తిరుపతి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అతడిని చున్నీతో చుట్టి బయటికి గెంటేశానని, తర్వాత ఏమైందో తనకు తెలియదని యువతి తెలిపింది. అయితే.. ఆత్మరక్షణ కోసమే అయినా వ్యక్తిని చంపినందుకు ఆమెపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కడ్రక తిరుపతి మద్యం మత్తులో ఉండటం వల్లే ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించినట్లు చెప్పారు. చున్నీ మెడకు బిగించడంతో పాటు రాయితో తలపై కొట్టడం వల్ల తలకు తీవ్ర గాయం కావడం వల్లే అతడు మరణించినట్లు తేలింది. ఆ మహిళను మాత్రం ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. -
చున్నీతో చుట్టి.. రాయితో కొట్టి..
కొమరాడ, న్యూస్‌లైన్: మద్యం మత్తులో తనపై అత్యాచారానికి యత్నించిన మృగాడి మెడకు చున్నీ బిగించి, రాయితో కొట్టి తనను తాను రక్షించుకుందా గిరిపుత్రి. తరువాత కాసేపటికి అతడు మరణించాడు. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గిరిశిఖర పెదశాఖ పంచాయతీ జల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. కొండ సమీపాన పాకలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన యువతి నిద్రపోతోంది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన గిరిజనుడు కడ్రక తిరుపతి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అతడిని చున్నీతో చుట్టి బయటికి గెంటేశానని, తర్వాత ఏమయిందో తనకు తెలియదని యువతి తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించి ఎలాంటి కేసు నమోదు చేయాలో నిర్ణయిస్తామని ఎస్ఐ జేఏవీ రమణ ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. -
వస్త్రదుకాణంలో యువతిపై యజమాని అత్యాచారయత్నం
హైదరాబాద్: పాతబస్తీలోని ఒక వస్త్ర దుకాణంలో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. ఆ దుకాణ యజమానే ఈ దారుణానికి పాల్పడ్డాడు. శారీ షాప్ యజమాని అంజద్ తనపై అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.