కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం అశోక్ అనే యువకుడు ఇంట్లో పనిచేయడానికి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు ఇంట్లో చెప్పడంతో బంధువులు, కుటుంబీకులు యువకుడిపై దాడికి యత్నించారు. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగక రోడ్డుపై ఆందోళనకు పూనుకున్నారు.